QuotesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/quotes/131/manchimaata9b1e60ce-2fe4-48db-bc58-8e187a59a8fe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/quotes/131/manchimaata9b1e60ce-2fe4-48db-bc58-8e187a59a8fe-415x250-IndiaHerald.jpgతల్లులు తమ బిడ్డల విషయంలో అన్ని విధాలా, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటం తో పాటు తమ వంతు బాధ్యతలను కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇక అందులో భాగంగానే ఇటీవల కరోనా విజృంభించి, పాఠశాలలు మూతపడ్డ విషయం తెలిసిందే. దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి ఈ కరోనా మహమ్మారి దేశవిదేశాలలో పాకి, అందరి భవిష్యత్తును నాశనం చేయడంతో పాటు ఎంతోమంది ప్రాణాలను కూడా తీసుకెళ్లి పోయింది. ముఖ్యంగా ఈ కరోనా సమయంలో ఎంతో మంది తల్లులు, పిల్లలు లేని వారయ్యారు లేదా పిల్లలు , తల్లిలు లేని వారు అయ్యారు.. ఇక ఈ సందర్భాలలో వివరించడం అసాధ్యం.MANCHIMAATA{#}School;News;Coronavirusమంచిమాట: స్కూల్స్ ఓపెన్ అవుతున్న తరుణంలో తల్లులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.మంచిమాట: స్కూల్స్ ఓపెన్ అవుతున్న తరుణంలో తల్లులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.MANCHIMAATA{#}School;News;CoronavirusMon, 12 Jul 2021 14:00:04 GMT
తల్లులు తమ బిడ్డల విషయంలో అన్ని విధాలా, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటం తో పాటు తమ వంతు బాధ్యతలను కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇక అందులో భాగంగానే ఇటీవల కరోనా విజృంభించి, పాఠశాలలు మూతపడ్డ విషయం తెలిసిందే. దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి ఈ కరోనా మహమ్మారి దేశవిదేశాలలో పాకి, అందరి భవిష్యత్తును నాశనం చేయడంతో పాటు ఎంతోమంది ప్రాణాలను కూడా తీసుకెళ్లి పోయింది. ముఖ్యంగా ఈ కరోనా సమయంలో ఎంతో మంది తల్లులు, పిల్లలు లేని వారయ్యారు లేదా పిల్లలు , తల్లిలు లేని వారు అయ్యారు.. ఇక ఈ సందర్భాలలో వివరించడం  అసాధ్యం.


ఇక ఇదంతా పక్కన పెడితే, ఈ కరోనా కారణంగా ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో స్కూల్స్ కూడా మూత పడిన విషయం తెలిసిందే. ఇక పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని , ఆన్లైన్ క్లాసులను  కూడా పాఠశాలలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే  ఇప్పుడు కరోనా  తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ,తల్లులు వారి పిల్లలను  స్కూల్స్ కి పంపించాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వారు ప్రభుత్వాన్ని కోరుతున్న విషయం తెలిసిందే. అయితే ఒకవేళ పాఠశాలలు రీ ఓపెన్ అయితే తమ పిల్లల ఆరోగ్యం విషయంలో,తల్లులు  ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను ఇప్పుడు ఇక్కడ  చదివి తెలుసుకుందాం.


ముందుగా తల్లులు , తమ పిల్లలకు స్కూల్స్ కు  వెళ్ళకముందే కరోనా వైరస్ పై అవగాహన కల్పించాలి. నిత్యం శుభ్రంగా ఉండే మంచి పద్ధతిని వారికి అలవాటు చేయాలి. ప్రతి అరగంటకు ఒకసారి చేతులను శుభ్రం చేసుకోవాలని వారికి సూచించాలి. అంతేకాదు తమ స్నేహితులతో పిల్లలు గడిపేటప్పుడు భౌతిక దూరం పాటించమని చెప్పాలి. అలాగే మాస్క్ ను ఎట్టిపరిస్థితిలోనూ తీయరాదు అని కూడా వారికి సూచించాలి. ఇక ముందు కాలం లాగా ఇప్పుడు స్నేహితులతో చెట్టపట్టాలు వేసుకుని తిరగడం, కరచాలనం చేయడం వంటివి ఆపివేయాలని కూడా తల్లులు తమ పిల్లలకు నేర్పించాలి.


తప్పకుండా స్కూల్ కి  వెళ్లేటప్పుడు పాఠ్య పుస్తకాలతోపాటు శానిటైజర్ , మాస్క్ ,వాటర్ బాటిల్, లంచ్ బాక్స్ తప్పనిసరి. ఇక ప్రస్తుతం రాబోయే కాలంలో కరోన రూపాంతరం చెంది థర్డ్ వేవ్ గా  విజృంభించ డానికి సిద్ధంగా ఉంది. ఇక ముఖ్యంగా పిల్లలపై ప్రభావం చూపుతుందనే వార్తలు కూడా ఎక్కువగా వినిపిస్తున్న నేపథ్యంలో, తప్పకుండా తల్లులు తమ పిల్లల ఆరోగ్య విషయంపై జాగ్రత్త వహించాలి. వారికి ఇమ్యూనిటీ పవర్ ని పెంచే ఆహారాన్ని స్పందించాలి.  ఇంక వీరికి ఎప్పటికప్పుడు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడానికి పాటు పడాలి. బయట ఎక్కడా ఆహారం తీసుకోకూడదని సూచించాలి. ఇక తల్లులు ఈ జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలు తమ మాట వింటున్నారో లేదో కూడా తెలుసుకొని  జాగ్రత్తపడాలి. చివరిగా తమ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేయాలని కూడా సూచించాలి.





కరోనా ప్రభావం తగ్గి స్కూల్స్ రీ ఓపెన్ అవుతున్న తరుణంలో తల్లులు తమ పిల్లలకు కరోనా కు సంబంధించిన అన్ని జాగ్రత్తలను నేర్పించాలి.

సీఎం సంచ‌ల‌న నిర్ణ‌యం.. రాష్ట్రంలో 144 సెక్ష‌న్.. !

సినీ ఇండస్ట్రీలో కరోనా చిచ్చు మాములుగా లేదుగా.. !

పొలిటిక‌ల్ ఎంట్రీ పై మ‌రోసారి ర‌జినీ క్లారిటీ.. !

అక్షయ కుమార్ షాక్ ఇచ్చేలా ఉన్నాడుగా... ?

సెట్స్ పైకి నాలుగు.. మరోటి కూడా ఫైనల్ చేసిన బాలయ్య!!

తస్మాత్ జాగ్రత్త.. వాట్సాప్ లో ఇవి అస్సలు చేయొద్దు?

గుడ్ న్యూస్ : థియేటర్లు ఓపెన్.. కానీ?

ప్రేమ పెళ్లి.. కానీ అదే ప్రేమ దక్కలేదని ఆత్మహత్య?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>