MoviesN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balamevvadu-ecd2f8bc-9157-4657-9c21-4bb67411e010-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balamevvadu-ecd2f8bc-9157-4657-9c21-4bb67411e010-415x250-IndiaHerald.jpgప్రస్తుతం కార్పొరేట్ ఆస్పత్రుల్లో మోసాలు ఎక్కువగా కనిపించడం మనం చూస్తూ ఉంటాం. వైద్యం పేరుతో లక్షల రూపాయలు కొల్లగొడుతున్నారు. ‘ఎంత ఖర్చయినా పర్వాలేదు.. వైద్యం చేయండి’ అనే మాటతో ఇష్టారాజ్యంగా డబ్బులను సంపాదిస్తున్నారు. డబ్బులు తీసుకున్నా.. మనిషి ప్రాణాలతో బయటపడ్డాడనే గ్యారెంటీ కూడా లేదు. Balamevvadu {#}Ganga;Ganges;Sri Krishna;Corporate;mani sharma;hari;hari music;Doctor;Sangeetha;sunday;Darsakudu;Director;Cinema;Manam;Hero;Teluguఆకట్టుకుంటున్న ‘బలమెవ్వడు’ మూవీ టీజర్..!!ఆకట్టుకుంటున్న ‘బలమెవ్వడు’ మూవీ టీజర్..!!Balamevvadu {#}Ganga;Ganges;Sri Krishna;Corporate;mani sharma;hari;hari music;Doctor;Sangeetha;sunday;Darsakudu;Director;Cinema;Manam;Hero;TeluguMon, 12 Jul 2021 11:25:00 GMTప్రస్తుతం కార్పొరేట్ ఆస్పత్రుల్లో మోసాలు ఎక్కువగా కనిపించడం మనం చూస్తూ ఉంటాం. వైద్యం పేరుతో లక్షల రూపాయలు కొల్లగొడుతున్నారు. ‘ఎంత ఖర్చయినా పర్వాలేదు.. వైద్యం చేయండి’ అనే మాటతో ఇష్టారాజ్యంగా డబ్బులను సంపాదిస్తున్నారు. డబ్బులు తీసుకున్నా.. మనిషి ప్రాణాలతో బయటపడ్డాడనే గ్యారెంటీ కూడా లేదు. చివరికీ మృతదేహాన్ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జీ చేయడానికి కూడా డబ్బులు పూర్తిగా కట్టాలని, లేకుండా శవాన్ని హ్యాండోవర్ చేయమనే ఘటనలు కూడా మనం చాలానే చూస్తున్నాం.
 
ఇలాంటి తరుణంలో.. కార్పొరేట్ హాస్పిటల్‌ల ధన దాహానికి, మెడికల్ మాఫియా మోసాలకు అద్దం పడుతూ ఒక సినిమాను రూపొందించారు.  ‘బలమెవ్వడు’ సినిమాతో ధృవన్ కటకం హీరోగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. నియా త్రిపాఠీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. పృథ్విరాజ్, సుహసినీ, నాజర్ ఇతరులు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. సనాతన దృశ్యాలు సమర్పణలో ఆర్‌బీ మార్కండేయులు బలమెవ్వడు సినిమాను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకు దర్శకుడు రాచకొండ డైరెక్ట్ చేస్తున్నారు. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ స్వరాలు అందిస్తున్నారు.

జూలై 10 ఆదివారం సంగీత దర్శకుడు మణిశర్మ పుట్టినరోజు సందర్భంగా బలమెవ్వడు సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఒకసారి టీజర్ చూసినట్లయితే.. పూర్వకాలంలో వైద్యాన్ని సేవగా భావించిన పుణ్యభూమి మనది. కానీ క్రమక్రమంగా అది వ్యాపారంగా మారిపోయింది. డబ్బులు సంపాదించడానికి మార్గంగా ఎంచుకుంటున్నారు. అలా వైద్యం కార్పొరేట్ రూపు దాల్చింది. దీంతో వైద్యం చేయించుకోలేక పేదలు, మధ్యతరగతి ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారు. నాణ్యమైన వైద్యం సామాన్యుడి దొరకని పరిస్థితిలో ఉంది. ఎలాంటి వైద్యం చేయించుకోవాలన్నా లక్షలతో కూడుకున్న పని. దీంతో చాలా మంది తమ ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. దీనిపై బలమెవ్వడు సినిమా అద్భుతంగా రూపొందించారు.

సినిమా ప్రారంభం భగవద్గీతలోని ప్రసిద్ధ శ్లోకంతో ప్రారంభం అవుతుంది. వైద్యో నారాయణో హరి అంటూ.. మెడిసిన్స్ గంగా తీర్థంలా పవిత్రంగా ఉండాలనే మాటలు వినిపిస్తాడు. వైద్యుడు దేవుడితో సమానమని గుర్తు చేశారు. బలమెవ్వడు కరి బ్రోవను అనే శ్రీకృష్ణ శతక పద్యం వినిపిస్తుంటే డాక్టర్ పాత్రలో ఫృథ్విరాజ్, సుహసిని, నాజర్ పాత్రలు కనిపిస్తాయి. అలాగే హీరో ధృవన్ కటకం, నియా త్రిపాఠీ కూడా కనిపిస్తున్నారు. చివర్లో మణిశర్మకు మూవీ టీం తరఫున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. నిజ జీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నట్లు దర్శకుడు సత్య రాచకొండ వెల్లడించారు.





పెద్దపల్లి: పిల్లలతో కలిసి తల్లి దారుణం..!?

గుడ్ న్యూస్ : థియేటర్లు ఓపెన్.. కానీ?

మెగా కాంపౌండ్ లో మరో మల్టీ స్టారర్.. ?

క‌రీనా `ప్రెగ్నెన్సీ బైబిల్‌`లో ఏం ఉండ‌నుంది ?

తండ్రి కోరిక మేరకే.. పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన స్టార్ హీరోయిన్ ?

ఆ స్టార్ హీరోయిన్ లైఫ్‌లో బెస్ట్‌ డేస్..!

అటు చేసి ఇటు చేసి వేదళం ను పక్కకు పెట్టేశారే!!

దాసరి బయోపిక్ పై సందేహాలు !

ఎన్టీఆర్ సినిమా విడుదల చేయడానికి సైతం భయపడిన సందర్భం .. అంతలా ఏం జరిగింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>