PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ratan-tata4c09892b-a710-43b9-8ced-951c95930003-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ratan-tata4c09892b-a710-43b9-8ced-951c95930003-415x250-IndiaHerald.jpgరతన్‌ టాటా.. ఈ దేశంలోనే కోటీశ్వరుల్లో ముందు వరుసలో ఉంటాడు. ధనవంతుడు అంటే మన దేశంలో ముందుగా గుర్తొచ్చే పేరే టాటా.. అందులోనూ రతన్ టాటా అంటే ధనవంతుడిగానే కాదు.. మనసున్న మనిషిగా మంచి పేరున్న వ్యక్తి. ఆయనకు లక్షల కోట్ల ఆస్తులు ఉన్నా.. ఓ విషయంలో మాత్రం ఇప్పటికీ బాధపడుతుంటారట. ఆ విషయాన్ని ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. మరి అంతటి ధనవంతునికి ఉన్న అసంతృప్తి ఏంటో తెలుసా..? చదివిన చదువుకూ.. చేస్తున్న వ్యాపారానికి పొంతన లేకపోవడం.. ఇష్టంతో చదువుకున్న చదువుకు సంబంధించి ఏమీ చేయలేకపోవడం.. ఈ రెండు విషయాలుratan-tata{#}RATAN TATA;Degree;jobలక్షల కోట్లున్నా.. రతన్‌టాటా ఇప్పటికీ అందుకు బాధపడతాడట..!లక్షల కోట్లున్నా.. రతన్‌టాటా ఇప్పటికీ అందుకు బాధపడతాడట..!ratan-tata{#}RATAN TATA;Degree;jobMon, 12 Jul 2021 07:00:00 GMTరతన్‌ టాటా.. ఈ దేశంలోనే కోటీశ్వరుల్లో ముందు వరుసలో ఉంటాడు. ధనవంతుడు అంటే మన దేశంలో ముందుగా గుర్తొచ్చే పేరే టాటా.. అందులోనూ రతన్ టాటా అంటే ధనవంతుడిగానే కాదు.. మనసున్న మనిషిగా మంచి పేరున్న వ్యక్తి. ఆయనకు లక్షల కోట్ల ఆస్తులు ఉన్నా.. ఓ విషయంలో మాత్రం ఇప్పటికీ బాధపడుతుంటారట. ఆ విషయాన్ని ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. మరి అంతటి ధనవంతునికి ఉన్న అసంతృప్తి ఏంటో తెలుసా..?


చదివిన చదువుకూ.. చేస్తున్న వ్యాపారానికి పొంతన లేకపోవడం.. ఇష్టంతో చదువుకున్న చదువుకు సంబంధించి ఏమీ చేయలేకపోవడం.. ఈ రెండు విషయాలు ఇప్పటికీ రతన్ టాటాను బాధపెడతాయట. ఇంతకీ రతన్ టాటా ఏం చదువుకున్నారో తెలుసా.. ఆర్కిటెక్చర్‌ డిగ్రీ. అవును.. రతన్ టాటా 1959లో న్యూయార్క్‌లోని కొర్నెల్‌ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్‌ డిగ్రీ చదివారట. ఆ కోర్సు పూర్తి చేసుకొని పట్టా కూడా పొందిన రతన్ టాటా అక్కడే కొన్నాళ్లు ఉద్యోగం కూడా చేశారట.


లాస్‌ ఎంజిలెస్‌లోని ఓ ఆర్కిటెక్ట్‌ కంపెనీలో రతన్ టాకా కొన్నాళ్లు ఉద్యోగం చేశారట. కానీ ఇంతలో ఆయన తన టాటా సంస్థ బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చిందట. దీంతో ఆయన తనకు ఎంతో ఇష్టమైన ఆర్కిటెక్ట్‌ వృత్తిని వదిలేశారట. ఆ తర్వాత వ్యాపార వేత్తగా ఎన్ని కోట్లు గడించినా ఆర్కిటెక్చర్ వృత్తి కొనసాగించలేదన్న బాధ మాత్రం ఉంటుందట. ఇప్పటికీ తాను ఒక ఆర్కిటెక్ట్‌ అని చెప్పుకోవడానికి  ఏమాత్రం ఇబ్బంది పడరట రతన్ టాటా. కానీ.. ఆర్కిటెక్ట్‌గా కొనసాగలేదన్న చింత మాత్రం ఇంకా ఉందని  చెబుతుంటారు.


అయితే.. ఆర్కిటెక్ట్‌గా తాను కొనసాగకపోయినా ఆర్కిటెక్చర్‌ కోర్సు తనకు అనేక విషయాలు నేర్పిందని ఆయన గుర్తు చేసుకుంటారు. ఆర్కిటెక్చర్‌ కోర్సులో నేర్పించిన పాఠాలు తనకు ఎంతో ఉపయోగపడ్డాయట కూడా. అన్నింటిని ఒక్క చోటకు చేర్చే, ఇచ్చిన బడ్జెట్‌లో ప్రాజెక్టు పూర్తి చేయగలిగే సామర్థ్యం తనకు ఆర్కిటెక్చర్‌ నుంచే వచ్చిందట. వివిధ రూపాల్లో వచ్చే సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యం కూడా ఆర్కిటెక్చర్‌ కోర్సులో బాగా చెప్పారట.





రతన్ టాటా అంటే ధనవంతుడిగానే కాదు.. మనసున్న మనిషిగా మంచి పేరున్న వ్యక్తి. ఆయనకు లక్షల కోట్ల ఆస్తులు ఉన్నా.. ఓ విషయంలో మాత్రం ఇప్పటికీ బాధపడుతుంటారట. ఆ విషయాన్ని ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.

కార్పొరేటర్‌ నుంచి అధ్యక్షుడి స్థాయికి బండి సంజయ్‌.. ఎలా సాధ్యమైంది ?

యూట్యూబర్ పై భారత్ నిషేధం.. ఎందుకో తెలుసా?

స్మరణ: నవ్వులు పువ్వులు పూయించిన సుత్తి వీరభద్ర రావు..

కత్తి మహేశ్ గురించి మీకు తెలియని కొన్ని షాకింగ్ విషయాలు ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>