PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bjpaeb3eb80-1387-4c2f-a000-ef656652c090-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bjpaeb3eb80-1387-4c2f-a000-ef656652c090-415x250-IndiaHerald.jpgకొంగునాడు త‌మిళ‌నాడులోని ఓ ప్రాంతం.. ఈ ప్రాంత‌ పరిధిలో తొమ్మిది జిల్లాలు ఉన్నాయి. గ‌త కొంత కాలం నుంచి ప్ర‌జ‌ల్లో ఆ ప్రాంతాన్ని కొత్త రాష్ట్రంగా చేయాల‌ని ఆకాంక్షిస్తూ వ‌చ్చారు. ఇప్పుడు ఏకంగా స్వ‌రాష్ట్రం కోసం అక్క‌డి వాళ్లు ఉద్య‌మం మొద‌లు పెట్టారు. బీజేపీ ఈ ఉద్య‌మాన్ని లీడ్ చేయడం విశేషం. రాష్ట్ర‌ విభ‌జ‌న‌కు అన్నాడీఎంకే అనుకూలంగా ఉంది. దీనికి కార‌ణం ఆ పార్టీకి అక్క‌డ బ‌ల‌మైన ప‌ట్టు ఉంది. మాజీ సీఎం పలని స్వామి కూడా కొంగునాడు వారే. తమిళనాడులో బీజేపీ ఎప్పటికీ బలపడ‌ద‌నే ఆలోచ‌న‌తో రాష్ట్రాన్ని చీల్చి కkongunadu{#}Loksabha;central government;CM;Bharatiya Janata Party;Partyత‌మిళ‌నాడును రెండుగా చీల్చ‌డానికి కేంద్రం ప్లాన్ చేస్తోందా..?త‌మిళ‌నాడును రెండుగా చీల్చ‌డానికి కేంద్రం ప్లాన్ చేస్తోందా..?kongunadu{#}Loksabha;central government;CM;Bharatiya Janata Party;PartyMon, 12 Jul 2021 10:23:29 GMT కొంగునాడు త‌మిళ‌నాడులోని ఓ ప్రాంతం.. ఈ ప్రాంత‌ పరిధిలో తొమ్మిది జిల్లాలు ఉన్నాయి. గ‌త కొంత కాలం నుంచి ప్ర‌జ‌ల్లో ఆ ప్రాంతాన్ని కొత్త రాష్ట్రంగా చేయాల‌ని ఆకాంక్షిస్తూ వ‌చ్చారు. ఇప్పుడు ఏకంగా స్వ‌రాష్ట్రం కోసం అక్క‌డి వాళ్లు ఉద్య‌మం మొద‌లు పెట్టారు. బీజేపీ ఈ ఉద్య‌మాన్ని లీడ్ చేయడం విశేషం. రాష్ట్ర‌ విభ‌జ‌న‌కు అన్నాడీఎంకే అనుకూలంగా ఉంది. దీనికి కార‌ణం ఆ పార్టీకి అక్క‌డ బ‌ల‌మైన ప‌ట్టు ఉంది. మాజీ సీఎం పలని స్వామి కూడా కొంగునాడు వారే. తమిళనాడులో బీజేపీ ఎప్పటికీ బలపడ‌ద‌నే ఆలోచ‌న‌తో రాష్ట్రాన్ని చీల్చి కొత్త రాష్ట్రంలో బలపడాలనేది బీజేపీ స్ట్రాట‌జీ ప్లాన్.

 కొంగునాడును ప్ర‌త్యేక రాష్ట్రంగా లేదా కేంద్రపాలిత ప్రాంతంగా చేయ‌డానికి బీజేపీ రంగం సిద్దం చేసిందని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఇదే నిజ‌మ‌యితే త్వ‌ర‌లోనే త‌మిళ‌నాడు రెండుగా చీల‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ వ్య‌వ‌హారంతో డీఎంకే, బీజేపీ మ‌ధ్య చిచ్చు రాజేసే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే ఇరుపార్టీల మ‌ధ్య విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి.

 అధికార పార్టీ డీఎంకేకు కొంగునాడులో అంత‌గా ప‌ట్టులేక‌పోవ‌డం గ‌త ఎన్నిక‌ల సంద‌ర్భంగా తెలిసింద‌ని నేత‌లు అనుకుంటున్నారు. ఎంజీఆర్ స‌మ‌యం నుంచి అన్నాడీఎంకేకు కొంగునాడు పెట్ట‌ని కోట‌గా ఉంది. కొంగు మండలంలో కోయంబత్తూర్‌, తిరుప్పూర్‌, ఈరోడ్‌, నామక్కల్‌, సేలం, ధర్మపురి, నీలగిరి, కరూర్‌, కృష్ణగిరి, దిండుగల్‌ జిల్లాలున్నాయి. 10 లోక్‌సభ స్థానాలు, 61 శాసనసభ స్థానాలున్న ఈ మండ‌లంలో గత శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకే 40 స్థానాల్లో విజయం సాధించింది. డీఎంకే 16 స్థానాల్లో,  2 స్థానాల్లో బీజేపీ నిలింది.

ఇప్పుడిప్పుడే కొంగు మండ‌లాభివృద్ధిపై సీఎం ఫోక‌స్ చేశాడు. అటువైపు బీజేపీ, డీఎంకే బ‌లం పెంచుకోవాల‌ని చూస్తోంది. ఇదే ప్రాంతానికి చెందిన బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మురుగన్‌ ప్రస్తుతం కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నాడు. దీంతో 2024 ఎన్నిక‌ల్లోగా కొంగునాడును ప్ర‌త్యేక రాష్ట్రంగా చేయాల‌ని కేంద్ర బీజేపీ ప్ర‌భుత్వం చూస్తుంద‌ని త‌మిళ రాజ‌కీయ వ‌ర్గాలు భావిస్తున్నాయి.







మోడీని తిట్టే వాళ్లకు నటుడు కోటా స్ట్రాంగ్ కౌంటర్ ?

ఆడియో కలకలం రచ్చ : టీఆర్ఎస్ టికెట్ నాకే అంటున్న కౌశిక్ రెడ్డి ?

వైయస్సార్ ఫ్యామిలీ హిస్సా సరే, మరి ఎన్టీవోడి కుటుంబ కథ..?

బాబు మారలేదా..? ఈసారి మూడు కళ్ల సిద్ధాంతం..?

బాబోరి రేవంత్ కు దేవుడిగా మారిన వైఎస్సార్ ?

ఆ పార్టీ అధ్యక్ష పదవి ఇస్తానంటున్నా.. ఎవరూ తీసుకోవడం లేదా..?

టీఆర్ఎస్‌లో ర‌మ‌ణ చేరిక‌పై చంద్ర‌బాబు రియాక్ష‌న్‌..!

కేసీఆర్ ఎల్.రమణకు ఇచ్చిన ఆఫర్ చూస్తే షాకే..?

వెంటనే భర్తీ చేయండి..కేసీఆర్ ఆర్డర్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>