India Corona Recoveries: ఇండియాలో 3 కోట్లకు చేరిన కరోనా విజేతలు, రికవరీ భేష్

India Corona recoveries reaches 3 crores: ఇండియాలో వరుసగా నాలుగైదు రోజులు పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు మరోసారి దిగొచ్చాయి. భారత్‌లో కరోనా పాజిటివిటీ రేటు 97.22 శాతానికి చేరింది. ఇండియాలో నేటి ఉదయం 8 గంటలకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 37,154 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. కరోనాతో పోరాడుతూ మరో 724 మంది మరణించారు. 

ఆదివారం సైతం కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులు అధికంగా ఉండటం ఊరట కలిగిస్తోంది. తాజా కేసులతో కలిపితే దేశంలో మొత్తం కరోనా వైరస్ (Corona Variants Attack) బాధితుల సంఖ్య 3,08,74,376 (3 కోట్ల 8 లక్షల 74 వేల 376)కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 724 మంది చనిపోగా, మొత్తం కోవిడ్-19 మరణాలు 4,08,764 (4 లక్షల 8 వేల 40)కు చేరుకున్నాయి. నిన్న ఒక్కరోజులో 39,649 మంది కరోనా మహమ్మారిని జయించి డిశ్ఛార్జ్ కాగా, ఇప్పటివరకూ 3 కోట్ల మంది కరోనాను జయించారు. మొత్తంగా దేశంలో 3 కోట్ల 14 వేల 713 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 4 లక్షల 50 వేల 899 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. 

దేశంలో జనవరిలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించగా, జులై 11 వరకు 37 కోట్ల 73 లక్షల 52 వేల 501 డోసులు ఇచ్చారు. నిన్న ఒక్కరోజే 12 లక్షల 35 వేల 287 మందికి కరోనా టీకాలు ఇచ్చినట్లు  కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు, వీక్లీ కరోనా పాజిటివిటీ రేట్లు తగ్గాయని అధికారులు వెల్లడించారు. కేరళ రాష్ట్రంలో జికా వైరస్ కేసులు (Kerala Zika Virus Cases) నమోదువుతున్నాయి. ఇప్పటివరకూ ఆ రాష్ట్రంలో 15 వరకు కేసులు నమోదుకాగా, అందులో గర్భిణీ సైతం ఉన్నారని తెలిసిందే.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link – https://bit.ly/3hDyh4G

Apple Link – https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More | https://zeenews.india.com/telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *