ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/virald02983ee-33aa-4048-9ad5-303c392e32b7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/virald02983ee-33aa-4048-9ad5-303c392e32b7-415x250-IndiaHerald.jpgమెహందీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.మన భాషలో మెహందీని గోరింటాకు అంటారనే సంగతి తెలిసిందే.ఇక ఇది పెళ్లి వేడుకల్లో తప్పనిసరిగా పెట్టుకొనే అలంకరణ ప్రక్రియ. ముఖ్యంగా పెళ్ళీడొచ్చిన అమ్మాయిలు మెహందీని చాలా ఎక్కువగా ఇష్టపడతారు. ఇక ఎన్నో విభిన్న రకాలైన డిజైన్లతో గోరింటాకు పెట్టుకొని అమ్మాయిలు అందరిని ఎంతగానో ఆకర్షిస్తుంటారు.ఇక అలాగే నార్త్ ఇండియా వివాహ మహోత్సవాల్లో అయితే ఓ రోజంతా మెహందీ పెట్టుకోవడానికి కేటాయిస్తారు. ఈ రోజుల్లో తమ అనుబంధాన్ని సూచించే విధంగా మెహందీ డిజైన్లను వేసుకుంటున్నారు. తాజాగా viral{#}geetha;Foot Ball;Champion;Girl;Ee Rojullo;marriage;prema;Husband;Love;India;Mumbai;mediaఆ రెండు టీంల మెహందీ పెయింటింగ్.. నెట్టింట వైరల్..ఆ రెండు టీంల మెహందీ పెయింటింగ్.. నెట్టింట వైరల్..viral{#}geetha;Foot Ball;Champion;Girl;Ee Rojullo;marriage;prema;Husband;Love;India;Mumbai;mediaMon, 12 Jul 2021 23:00:00 GMTమెహందీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.మన భాషలో మెహందీని గోరింటాకు అంటారనే సంగతి తెలిసిందే.ఇక ఇది పెళ్లి వేడుకల్లో తప్పనిసరిగా పెట్టుకొనే అలంకరణ ప్రక్రియ. ముఖ్యంగా పెళ్ళీడొచ్చిన అమ్మాయిలు మెహందీని చాలా ఎక్కువగా ఇష్టపడతారు. ఇక ఎన్నో విభిన్న రకాలైన డిజైన్లతో గోరింటాకు పెట్టుకొని అమ్మాయిలు అందరిని ఎంతగానో ఆకర్షిస్తుంటారు.ఇక అలాగే నార్త్ ఇండియా వివాహ మహోత్సవాల్లో అయితే ఓ రోజంతా మెహందీ పెట్టుకోవడానికి కేటాయిస్తారు. ఈ రోజుల్లో తమ అనుబంధాన్ని సూచించే విధంగా మెహందీ డిజైన్లను వేసుకుంటున్నారు. తాజాగా ఓ వధువు వైవిధ్యమైన డిజైన్‌లో మెహందీని పెట్టుకొని వార్తల్లో నిలిచింది. గీతా ఖడెకర్ అనే ఓ అమ్మాయి ముంబయి ఇండియన్స్, మాంచెస్టర్ యునైటెడ్ జట్ల క్రీడా లోగోలను తన చేతిపై గోరింటాకు వేయించుకొంది.

ఇక ఈ ఫొటో నెట్టింటా వైరల్ కావడంతో ముంబై ఇండియన్స్ టీమ్ సోషల్ మీడియాలో దీన్ని పోస్ట్ చేసింది.అయితే ఆ వధువు మెహందీని ఈ విధంగా క్రీడా జట్ల లోగోలతో పెట్టుకోవడానికి ఓ కారణముందట.గీత ముంబయి ఇండియన్స్ జట్టుకు సపోర్ట్ ఇస్తుంటే.. తనకు కాబోయే భర్త దేవ్రాత్ మెయిన్హాలికర్ మాత్రం మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్ బాల్ జట్టుకు సపోర్ట్ చేస్తున్నాడు.ఇక ఈ వివాహం ద్వారా వారి బంధాన్ని గుర్తు చేసే విధంగా సరికొత్త మెహందీ డిజైన్‌ను గీత వేయించుకోవడం జరిగింది. అంతేకాకుండా వారి ప్రేమ శాశ్వతంగా ఇలాగే కలకాలం ఉండాలని సూచించింది. "ఈ మెహందీ మా హృదయం" అనే క్యాప్షన్ ని గీత ఈ లోగోలో పొందుపరిచింది.ఇక ఈ ఫొటోను ముందుగా ఆ వధూవరులిద్దరూ తమ సోషల్ మీడియా వేదిక ద్వారా పంచుకున్నారు.ఇక ఆ తరువాత ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు సైతం దీన్ని షేర్ చేయడం జరిగింది.ప్రస్తుతం ఈ ఫొటో అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలోనూ తెగ వైరల్ అవుతోంది.ఇక ఈ ఫోటోని చూసిన నెటిజన్లు కూడా ఎంతో వినూత్నంగా స్పందిస్తున్నారు.





ఈ ఫొటోలో కనిపిస్తున్న స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా..?

క్రికెట్ కోసం ఆస్తులనే అమ్ముకున్న వ్యక్తి ! ఇపుడు ప్లేయర్ ఆఫ్ ది మంత్..!

ప్రేమించలేదని చేతబడి చేసాడు.. చివరికి?

ఏకమైన ప్రియురాలి భర్త.. ప్రియుడి భార్య.. షాకింగ్ డెసిషన్?

మునగచెట్టులో ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయా..?

కోహ్లీ కెప్టెన్సీపై సురేశ్ రైనా సంచలన వ్యాఖ్యలు?

షాకింగ్ : యాక్షన్ హీరో ఇంటికి సీల్ !

క్లీవేజ్ షాతో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న రాజ్ తరుణ్ హీరోయిన్....

అమానుషం : అప్పు తీర్చలేక.. భార్యను బేరం పెట్టాడు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>