PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-d466d1c2-c01b-4109-89a1-af8db4ebd346-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-d466d1c2-c01b-4109-89a1-af8db4ebd346-415x250-IndiaHerald.jpgహుజురాబాద్ సీటు ఎలాగైనా దక్కించుకోవాలనే లక్ష్యంతో, ఈటల రాజేందర్ ను ఓడించాలనే కంకణం కట్టుకున్నారు కేసీఆర్. అందుకొరకే ఎల్.రమణను పార్టీలోకి రప్పించి మరి పోటీ చేయిస్తున్నారు. దీంతో ఆయనకు రెండు రకాల ఆఫర్లు కూడా ఇచ్చారు. ఈ ఆశతో ఎల్ రమణ గట్టిగా ట్రై చేసి మంత్రివర్గంలోకి వచ్చేందుకు తగిన ప్రణాళిక వేసుకుంటారని అర్థమవుతుంది. ఏది ఏమైనా హుజురాబాద్ ప్రజల గుండెల్లో ఎవరున్నారు అనేది సత్యదూరం..Political {#}Mudiraj;Huzurabad;ramana;Telangana Rashtra Samithi TRS;Eatala Rajendar;politics;Congress;Bharatiya Janata Party;CM;Party;Yevaruకేసీఆర్ ఎల్.రమణకు ఇచ్చిన ఆఫర్ చూస్తే షాకే..?కేసీఆర్ ఎల్.రమణకు ఇచ్చిన ఆఫర్ చూస్తే షాకే..?Political {#}Mudiraj;Huzurabad;ramana;Telangana Rashtra Samithi TRS;Eatala Rajendar;politics;Congress;Bharatiya Janata Party;CM;Party;YevaruMon, 12 Jul 2021 09:05:00 GMTహుజురాబాద్ లో రాజకీయాలు రోజురోజుకు హిట్ ఎక్కుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితిలో ఉన్నాయి. అన్ని పార్టీలు తమదైన శైలిలో విజయ కేతనం ఎగుర వేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే హోరాహోరి సభలు, ప్రచారాలు ప్రారంభించిన పార్టీలు తమదైన శైలిలో ముందుకు పోతూ, ప్రజలకు మమేకమై  తిరుగుతున్నారు. ఈ సందర్భంగా  ఒకరినొకరు మాటలతో యుద్ధాలు చేసుకుంటూ విమర్శనాస్త్రాలు విడుస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. దీంతో అక్కడ రాజకీయాలన్నీ ఏ నిమిషాన ఎలా మారుతున్నాయో అర్థం కావడం లేదు..

 ఇప్పటికే బిజెపి పార్టీ నుంచి  ఈటల రాజేందర్ బరిలోకి దిగినట్లు స్పష్టంగా అర్థం అవుతోంది. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా  ఇంకా అభ్యర్థి ఎవరో ప్రకటించలేదు. టీజేఎస్ కూడా పోటీ చేస్తారని ప్రచారం నడుస్తోంది. ఇంకా అధికార పార్టీ  ఎవరు పోటీ చేస్తారనే దానిపైనే సస్పెన్స్ నెలకొన్నది. చాలా మంది పేర్లు వాదనలు వినబడుతున్నాయి. కానీ కెసిఆర్ ఎవరినీ నిలబెడతారు అనేది ఇంకా  అధికారికంగా బయటకు రాలేదు. ఇవాళ  టిఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం తీసుకుని  ఎల్ రమణను తెరపైకి తెస్తున్నారు. ఆయన ఇటీవల కాలంలో సీఎం కేసీఆర్ ను కలిసిన సంగతి మనకు తెలిసిందే. ఆయననే పోటీలో నిలబెట్టే అవకాశం ఉన్నదని సమాచారం.

**రమణ వర్సెస్ ఈటల**
 ఈటెల రాజేందర్ ఇప్పటికే ఆ బలమైన క్యాడర్ ఉన్న నాయకుడు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. హుజురాబాద్ నియోజకవర్గంలో ఎక్కువగా బిసి, దళిత సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. దీంతో టీఆర్ఎస్ పార్టీ సామాజిక సమీకరణాలన్ని పరిగణలోకి తీసుకొని , అన్ని విధాల సర్వేలు చేయించి  ముందడుగు వేయబోతున్నదని అర్థమవుతుంది. అయితే  ఎల్ రమణ పద్మశాలి కాబట్టి హుజురాబాద్ లో బీసీలు ఎక్కువగా ఉండడంతో  ఓటు బ్యాంకు మళ్ళించు కోవచ్చని గులాబీ బాస్ ఆలోచన.

**మంత్రి పదవి లేదా ఎమ్మెల్సీ**
 హుజురాబాద్ లో  ఒకవేళ ఎల్.రమణ పోటీ చేస్తే  కెసిఆర్ మంచి ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో  రమణ గెలిస్తే  మంత్రివర్గంలోకి తీసుకుంటానని, ఒకవేళ ఓడిపోయినా  టిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ పదవి కల్పిస్తానని హామీ ఇచ్చారు. అందుకే ఎల్.రమణ గులాబీ లోకి చేరేందుకు సముఖత చూపినట్టు సమాచారం.

**విజయం కోసం తిప్పలు**
 హుజురాబాద్ సీటు ఎలాగైనా దక్కించుకోవాలనే లక్ష్యంతో, ఈటల రాజేందర్ ను ఓడించాలనే కంకణం కట్టుకున్నారు కేసీఆర్. అందుకొరకే ఎల్.రమణను పార్టీలోకి రప్పించి మరి పోటీ చేయిస్తున్నారు. దీంతో ఆయనకు  రెండు రకాల ఆఫర్లు కూడా ఇచ్చారు. ఈ ఆశతో ఎల్ రమణ గట్టిగా ట్రై చేసి  మంత్రివర్గంలోకి వచ్చేందుకు  తగిన ప్రణాళిక వేసుకుంటారని అర్థమవుతుంది. ఏది ఏమైనా  హుజురాబాద్ ప్రజల గుండెల్లో ఎవరున్నారు అనేది సత్యదూరం..



ఆ పార్టీ అధ్యక్ష పదవి ఇస్తానంటున్నా.. ఎవరూ తీసుకోవడం లేదా..?

టీఆర్ఎస్‌లో ర‌మ‌ణ చేరిక‌పై చంద్ర‌బాబు రియాక్ష‌న్‌..!

వెంటనే భర్తీ చేయండి..కేసీఆర్ ఆర్డర్.. !

క్షణ..క్షణం.. భయం.. భయం..!

నిరుద్యోగులకు శుభవార్త : 50వేల ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు?

కేసీఆర్ వేగ‌వంత‌మైన నిర్ణ‌యాల వెనుక మ‌ర్మం ఎమిటీ?

ఎన్టీవోడి భక్తుడి హఠాన్మరణం - దిగ్భ్రాంతిలో చంద్రబాబు ?

రెండు కండ్లు చాలవు ఆ జలపాతం చూడాలంటే..!

మన స్టార్ హీరోల ఫస్ట్ క్రష్ వీరే..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>