MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tag8ce81207-b544-4407-9781-53f8aaedd363-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tag8ce81207-b544-4407-9781-53f8aaedd363-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ విలక్షణ హీరో సూర్య హీరోగా నటించిన "సూరారై పొట్రు" చిత్రం తెలుగులో "ఆకాశం నీ హద్దురా" పేరుతో విడుదలైన విషయం తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం ఎంతోమంది సినీ ప్రియుల హృదయాలను గెలుచుకుంది. మహిళా దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రశంసలు, అవార్డులతో పాటు కొత్త రికార్డులు కూడా క్రియేట్ చేసింది. తాజాగా ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈరోజే ఈ రీమేక్ కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. షెర్ని, శకుంతSoorarai Pottru Hindi Remake;{#}prem;vikram;Jaan;John;Yevaru;ajay;Chitram;producer;Producer;Hindi;Remake;Hero;media;Army;Blockbuster hit;Amazon;Tamil;Akshay Kumar;surya sivakumar;bollywood;Cinema"ఆకాశం నీ హద్దు" హిందీ రీమేక్... హీరో అతనేనా ?"ఆకాశం నీ హద్దు" హిందీ రీమేక్... హీరో అతనేనా ?Soorarai Pottru Hindi Remake;{#}prem;vikram;Jaan;John;Yevaru;ajay;Chitram;producer;Producer;Hindi;Remake;Hero;media;Army;Blockbuster hit;Amazon;Tamil;Akshay Kumar;surya sivakumar;bollywood;CinemaMon, 12 Jul 2021 18:00:00 GMTకోలీవుడ్ విలక్షణ హీరో సూర్య హీరోగా నటించిన "సూరారై పొట్రు" చిత్రం తెలుగులో "ఆకాశం నీ హద్దురా" పేరుతో విడుదలైన విషయం తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం ఎంతోమంది సినీ ప్రియుల హృదయాలను గెలుచుకుంది. మహిళా దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రశంసలు, అవార్డులతో పాటు కొత్త రికార్డులు కూడా క్రియేట్ చేసింది. తాజాగా ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈరోజే ఈ రీమేక్ కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. షెర్ని, శకుంతల దేవి, ఎయిర్‌ లిఫ్ట్, టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ వంటి చిత్రాలను నిర్మించిన నిర్మాత విక్రమ్ మల్హోత్రా ఈ బ్లాక్ బస్టర్ మూవీ హిందీ రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకున్నారు. దీనిని బాలీవుడ్ లో సూర్య 2 డి ఎంటర్టైన్మెంట్, విక్రమ్ మల్హోత్రా అబుండాంటియా ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించనున్నట్లు సమాచారం. 

సినిమా పేదలకు తక్కువ ఖర్చుతో కూడిన విమాన సౌకర్యాన్ని అందించాలని తపన పడి, ఎయిర్లైన్స్ ఎయిర్ డెక్కన్ ను స్థాపించిన రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్ జిఆర్ గోపీనాథ్ జీవితం చుట్టూ తిరుగుతుంది. "సింప్లీ ఫ్లై: ఎ డెక్కన్ ఒడిస్సీ" పుస్తకం ఆధారంగా సినిమాను రూపొందించారు. ఈ బాలీవుడ్ రీమేక్ ను కూడా ఒరిజినల్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకురాలు సుధా కొంగర డైరెక్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఇక్కడ తలెత్తే అసలు ప్రశ్న ఏంటంటే సూర్య పాత్రలో నటించే బాలీవుడ్ హీరో ఎవరు ? అని. కానీ ఈ విషయాన్ని మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. దీంతో అప్పుడే "ఆకాశం నీ హద్దురా" హిందీ రీమేక్ లో హీరోగా నటించబోయేది ఈ హీరోనే అంటూ ప్రచారం మొదలెట్టారు. అందులో కొందరు స్టార్ హీరోల పేర్లు ఉన్నాయి. ఆ జాబితాలో అజయ్ దేవ్‌గన్, హృతిక్ రోషన్, జాన్ అబ్రహం, అక్షయ్ కుమార్ వంటి అగ్ర నటుల పేర్లు విన్పిస్తున్నాయి. కొన్ని మీడియా కథనాల ప్రకారం ఈ స్టార్ హీరోలలో ఎవరికి డేట్లు కుదిరితే వాళ్ళు నటించనున్నారట. చూడాలి మరి సూర్య పాత్రలో నటించి మెప్పించబోయే ఆ బాలీవుడ్ స్టార్ ఎవరనేది..!!





స్టార్స్ సందడి షురూ... హైదరాబాద్ టార్గెట్ ?

హీరోయిన్ రాధ అక్క కూడా ఒక స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా ?

హీరో.. విలన్.. బన్నీనే.. పుష్పలో ఈ ట్విస్ట్ ఏంటి బాబోయ్..!

'నారప్ప' .... మీరు నిజంగా గ్రేటప్పా .... !!

ఆ సినిమాలో వేశ్యగా హీటెక్కించనున్న ఇలియానా...

బ్రేకింగ్ : 'సర్కారు వారి పాట' లేటెస్ట్ పోస్టర్ అదుర్స్ .... !!

పెళ్లయితే మంచిదనుకుంటున్నారు కానీ.. !

సీరియల్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న కోవై సరళ..!!

సెకండ్ హాఫ్ లో దద్దరిల్లనున్న బాలీవుడ్!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>