PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jaganc26e4a2a-ce7c-42e6-a1e4-da130fc690ea-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jaganc26e4a2a-ce7c-42e6-a1e4-da130fc690ea-415x250-IndiaHerald.jpgఎన్నికలకు ముందు వీరి స‌మ‌స్య‌లు సావ‌ధానంగా విని తాను ప‌రిష్క‌రిస్తాన‌ని చెప్పిన జ‌గ‌న్ ఇప్పుడు వీరిని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని గ‌గ్గోలు పెడుతున్నారు. ఇక క‌రోనా దెబ్బ‌తో ఉద్యోగుల‌పై ప‌ని భారం పెరిగింది. స‌కాలం లో వేత‌నాలు అంద‌డం లేదు. ఇక మూడు రాజ‌ధానుల ప్ర‌భావంతో ఉద్యోగులు వైజాగ్‌కు వెళ్లేందుకు ఇష్టంగా లేరు. ఇక వీరంతా త‌మ అసంతృప్తి నేప‌థ్యంలో ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డిని క‌లిశారు. విజ‌య‌వాడ కేంద్రంగా వీరు ఓ సారి స‌మావేశ‌మై ప్ర‌భుత్వానికి అల్టిమేటం జారీ చేయాల‌ని కూడా నిర్ణ‌యం Jagan Mohan Reddy{#}Jagan;Reddy;CMజ‌గ‌న్‌కు వీళ్లంతా దూరం దూరం... బ‌డ‌బాగ్ని బ‌ద్ద‌లేనా ?జ‌గ‌న్‌కు వీళ్లంతా దూరం దూరం... బ‌డ‌బాగ్ని బ‌ద్ద‌లేనా ?Jagan Mohan Reddy{#}Jagan;Reddy;CMMon, 12 Jul 2021 14:44:00 GMTఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. 2024 ఎన్నికల్లో కూడా విజయం సాధించడమే లక్ష్యంగా జగన్ ఎన్నో ప్రణాళికలతో ముందుకు వెళుతున్నారు. ఎన్నికలలో విజయం సాధించాలంటే అన్ని కులాలు - అన్ని మతాలు - అన్ని వర్గాలకు చెందిన వారిని కలుపుకోవాలి. జగన్ పాదయాత్రలో కులం చూడం.. మతం చూడం అని చెప్పారు. జగన్ మాటలు నమ్మి ఆయనకు 151 సీట్లతో అప్రతిహత విజయాన్ని అందించారు.  రెండు  ఏళ్ల పాలనలో ఉద్యోగ సంఘాల నేత‌లు, ఉద్యోగులు జగన్ పై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న తీరే కనిపిస్తోంది. ఇప్పటికే తమ పై పని భారం పెరిగిపోతుందని.. అల‌వెన్సులు ఆగిపోతున్నాయని... కనీసం ఇళ్ల స్థ‌లాలు కూడా లేవని ఉద్యోగ సంఘాల నేతలు వాపోతున్నారు.

ఎన్నికలకు ముందు వీరి స‌మ‌స్య‌లు సావ‌ధానంగా విని తాను ప‌రిష్క‌రిస్తాన‌ని చెప్పిన జ‌గ‌న్ ఇప్పుడు వీరిని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని గ‌గ్గోలు పెడుతున్నారు.  ఇక క‌రోనా దెబ్బ‌తో ఉద్యోగుల‌పై ప‌ని భారం పెరిగింది. స‌కాలం లో వేత‌నాలు అంద‌డం లేదు. ఇక మూడు రాజ‌ధానుల ప్ర‌భావంతో ఉద్యోగులు వైజాగ్‌కు వెళ్లేందుకు ఇష్టంగా లేరు. ఇక వీరంతా త‌మ అసంతృప్తి నేప‌థ్యంలో ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డిని క‌లిశారు. విజ‌య‌వాడ కేంద్రంగా వీరు ఓ సారి స‌మావేశ‌మై ప్ర‌భుత్వానికి అల్టిమేటం జారీ చేయాల‌ని కూడా నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.

మ‌రో విషయం ఏంటంటే ఈ అసంతృప్త ఉద్యోగుల్లో ఎక్కువ మంది రెడ్డి వ‌ర్గం వారే ఉన్నార‌ట‌. గ‌తంలో తాము జ‌గ‌న్‌కు స‌హ‌క‌రించ‌బ‌ట్టే.. ఆయ‌న అధికారంలోకి వ‌చ్చార‌ని.. ఇప్పుడు త‌మ క‌నీసం డిమాండ్లు కూడా నెర‌వేర్చ‌డం లేద‌ని వాపోతున్నార‌ట‌. కొంద‌రు అయితే పెన్ డౌన్ చేసి ప్ర‌భుత్వానికి త‌మ స‌త్తా ఏంటో చూపాల‌ని చెపుతున్నా ఉద్యోగ సంఘాల నేత‌ల్లో కొంద‌రు కొంత కాలం వేచి చూసే ధోర‌ణితో ఉందామ‌ని స‌ర్ది చెప్ప‌డంతో ఉద్యోగుల అసంతృప్తికి కాస్త బ్రేక్ ప‌డింద‌ని అంటున్నారు. వీరిని సంతృప్తి ప‌ర‌చ‌క‌పోతే బ‌డ‌బాగ్ని ర‌గ‌ల‌డం ఖాయం.

 



వివేకా హత్య: సిబిఐ మళ్ళీ వాళ్ళనే...?

భ‌ట్టికి రేణుకా చౌద‌రికి మ‌ధ్య విభేదాలెందుకు..?

పిడుగుల వ‌ర్షానికి 68మంది మృతి... !

సీఎం జగన్ కరోనా పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.... అన్ని జిల్లాల్లో ఒకే విధంగా కర్ఫ్యూ ఆంక్షలు అమలు చేయాలని ఆదేశించారు. ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కర్ఫ్యూ సడలింపులు ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. అంతేకాకుండా రాత్రి తొమ్మిది గంటలకు రాష్ట్రంలో షాపులు అన్నింటినీ మూసివేయాలని ఆదేశించారు. క‌ర్ఫ్యూ స‌మ‌యంలో నిబంధనలను క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని తెలిపారు. ఒకవేళ ఎవరైనా మాస్కులు ధరించనట్లయితే వారికి రూ.100 ఫైన్ వేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్‌ కఠినంగా అమలు చేయాల‌ని కూడా సీఎం ఆదేశించారు.

సీఎం సంచ‌ల‌న నిర్ణ‌యం.. రాష్ట్రంలో 144 సెక్ష‌న్.. !

అఖిల‌ప్రియ‌ను టీడీపీ నుంచి గెంటేస్తోందెవ‌రు ?

జ‌గ‌న్ ఇలాకాలో ఇద్ద‌రు వైసీపీ నేత‌ల ఫైట్... ఎమ్మెల్యే వ్శ్ ఎమ్మెల్సీ..!

ఆ ఏపీ మంత్రి ప‌ద‌వి ఊస్టే... లీక్ అయ్యే సైలెంట్ అయ్యారా ?

పొలిటిక‌ల్ ఎంట్రీ పై మ‌రోసారి ర‌జినీ క్లారిటీ.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>