Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/priyanka7f7fd9b0-ed93-4b6c-b297-19278d837115-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/priyanka7f7fd9b0-ed93-4b6c-b297-19278d837115-415x250-IndiaHerald.jpgరౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన టాక్సీ వాలా సినిమా మంచి విజయాన్ని సాధించింది. సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. ఇక ఈ సినిమాలో విజయ్ నటన ఆకట్టుకుంది. అయితే టాక్సీవాలా సినిమాలో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయం అయింది తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్. ఇక మొదటి సినిమాలో తన అందం అభినయంతో విమర్శకుల దగ్గర మంచి మార్కులే కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. అటు ఆడియన్స్ ని కూడా తన చిలిపి నవ్వుతో కట్టిపడేసింది. తన కోర చూపుల తో ఎంతో మంది ని బుట్టలPriyanka{#}priyanka jawalkar;Taxiwala;Telugammayi;Devarakonda;priyanka;Joseph Vijay;Hero;Heroine;Audience;Telugu;Cinemaనాకలాంటి చేదు అనుభవం ఎదురు కాలేదు : టాక్సీవాలా భామనాకలాంటి చేదు అనుభవం ఎదురు కాలేదు : టాక్సీవాలా భామPriyanka{#}priyanka jawalkar;Taxiwala;Telugammayi;Devarakonda;priyanka;Joseph Vijay;Hero;Heroine;Audience;Telugu;CinemaMon, 12 Jul 2021 10:16:00 GMTరౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన టాక్సీ వాలా సినిమా మంచి విజయాన్ని సాధించింది. సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. ఇక ఈ సినిమాలో విజయ్ నటన ఆకట్టుకుంది. అయితే టాక్సీవాలా సినిమాలో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయం అయింది తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్.  ఇక మొదటి సినిమాలో తన అందం అభినయంతో విమర్శకుల దగ్గర మంచి మార్కులే కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. అటు ఆడియన్స్ ని కూడా తన చిలిపి నవ్వుతో కట్టిపడేసింది. తన కోర చూపుల తో ఎంతో మంది ని బుట్టలో వేసుకుని అభిమానులుగా మార్చుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ప్రియాంక జవాల్కర్ ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా మంచి విజయం సాధించడంతో ఈ అమ్మడికి వరుస అవకాశాలు వస్తాయి అనుకున్నారు అందరు.


 స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు. అయితే టాక్సీ వాలా సినిమా విడుదలై మూడేళ్లు గడుస్తుంది కానీ ఇప్పటివరకు సినిమా తో ముందుకు రాలేదు ఈ అమ్మడు. టాక్సీవాలా విడుదలైన కొన్ని రోజుల్లోనే చబ్బిగా ముఖం పై మొటిమలు తో కనిపించడంతో ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఫై ఎన్నో మీమ్స్ కూడా వచ్చాయ్. ఇటీవలే మళ్లీ నాజూగ్గా మారిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పింది.  ఒకప్పుడు మొటిమలతో కనిపించారు ఎందుకు అని ఒక అభిమాని ప్రశ్నించగా..  తనలో ఉన్న కొన్ని ఆరోగ్య సమస్యలను గుర్తించ లేదని అందుకే అప్పట్లో బాగా లావు ముఖం మీద మొటిమలు వచ్చాయని.. కానీ ఆ తర్వాత పలు జాగ్రత్తలు తీసుకొని మళ్ళీ సన్నగా మారాను అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నాను అంటూ తెలిపింది.



 అదే సమయంలో ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు అవకాశాలు రావు అనే విషయంపై కూడా మాట్లాడింది.  ఇటీవల కాలంలో తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు బాగానే సందడి చేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చింది. మంచి అవకాశాలు దక్కుతున్నాయి అంటూ తెలిపింది. తెలుగు అమ్మాయి కావడం వల్ల ఎప్పుడైనా అవకాశాలు కోల్పోయారా అని తనను ఎంతో మంది అడుగుతుంటారు అంటూ చెప్పుకొచ్చింది. నిజానికి అయితే తనకు ఇప్పటి వరకు అలాంటి చేదు అనుభవం ఎదురు కాలేదు అంటూ తెలిపింది ప్రియాంక జవాల్కర్. కథలు పారితోషకాలు విషయాల్లోనే కొన్ని సినిమాలు చేజారి ఉండొచ్చు కానీ ఇప్పటివరకు  తెలుగు అమ్మాయి అన్న కారణంతో ఏ సినిమా అవకాశం చేజారిపోలేదు అంటూ తెలిపింది ప్రియాంక జవాల్కర్.



దీపికా పదుకొనె ని మించిపోయిన 70 ఏళ్ల బామ్మ.. ఆదరగొట్టేసింది

నా పేరు టాటూ ఉన్న వ్యక్తినే నిజంగా ప్రేమిస్తున్నా : అషురెడ్డి

మానవ మృగం గా మారిన అఖిల్ !

జక్కన్న వరల్డ్ వైడ్ ప్లాన్.. దాన్ని గట్టిగా ప్లాన్ చేశాడే?

తమిళ హీరోతో జాతిరత్నాలు డైరక్టర్.. పాన్ ఇండియా మూవీ..!

విజయ్ నటించిన మొదటి సినిమా.. ఆ సమయంలో ఏం జరిగిందో తెలుసా .?

ఈ దెబ్బ తో సునీల్ కెరీర్ పుంజుకుంటుందట!!

ఆమె ప్రయాణం అద్భుతం: సిఎం జగన్

బాలీవుడ్‌లో ఎన్టీఆర్‌ సినిమా రీమేక్.. హీరో కూడా కన్‌ఫార్మ్‌..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>