ViralSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/ginnis-recors-typing-speed-viral-news18e4e3c0-b4f5-40e7-8d41-cf0ed2b2217d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/ginnis-recors-typing-speed-viral-news18e4e3c0-b4f5-40e7-8d41-cf0ed2b2217d-415x250-IndiaHerald.jpgప్రతి మనిషిలోనూ ఎదో ఒక ప్రతిభ అనేది దాగి ఉంటుంది.కానీ కొంతమంది మాత్రం వాళ్లలో దాగి ఉన్న ప్రతిభను బయటకి తీయలేరు. మరికొందరు మాత్రం ఆరు నూరు అయిన, నూరు ఆరు అయినాగానీ తమలో ఉన్న ప్రతిభను బయటకి తీసి ప్రపంచానికి పరిచయం చేయాలనీ అనుకుంటారు. ఈ క్రమంలోనే మీరు ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలి. సాధారణంగా మన అందరికి కంప్యూటర్ టైపింగ్ గురించి తెలిసే ఉంటుంది కదా. అయితే మీరు పదాలను టైప్ చేసేటప్పుడు ఎంత సేపట్లో నూట మూడుపదాలు ఉన్న వాక్యాన్ని టైప్ చేస్తారు.మహా అయితే ఒక అయిదు నిమిషాలు. లేదంటే రెండు నిమిషాల సమయం అంతేginnis recors, typing, speed, viral news{#}vinod kumarవైరల్ : సచిన్ రికార్డు బద్దలు కొట్టడమే అతని టార్గెట్...?వైరల్ : సచిన్ రికార్డు బద్దలు కొట్టడమే అతని టార్గెట్...?ginnis recors, typing, speed, viral news{#}vinod kumarMon, 12 Jul 2021 11:00:00 GMTవినోద్ కుమార్ మరెన్నో గిన్నిస్‌ రికార్డులను కూడా సొంతం చేసుకున్నాడు.

వివరాల్లోకి వెళితే ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో వినోద్ కుమార్ కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. సాధరణ వ్యక్తిలా కనిపించే అతని  పేరు మీద తొమ్మిది గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులు ఉన్నాయి తెలుసా. కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న వినోద్ ఎక్కువ సమయం కీబోర్డు మీదే గడుస్తుంది. అలా పదాలను వేగంగా టైప్‌ చేయడం అలవాటైంది.అదే క్రమంలో కీ బోర్డు మీద రకరకాలుగా టైప్‌ చేస్తూ ఏకంగా ఎనిమిది గిన్నిస్‌ రికార్డులను సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా తన ఇంట్లో ఓ కంప్యూటర్‌ కేంద్రాన్ని పెట్టి  పేదలకు, దివ్యాంగులకు కంప్యూటర్‌లో శిక్షణ ఇస్తున్నాడు. ఈ క్రమంలో 2014లో ‘ముక్కుతో కంపోజ్‌ చేస్తున్న వ్యక్తి’ అనే వార్త అతడిలో మార్పు తెచ్చింది.

తను కూడా అలా చేయాలని అనుకుని ప్రాక్టీస్‌ చేయడంతో పాటు అత్యంత వేగంగా కంపోజ్‌ చేసి రికార్డు నెలకొల్పాడు. అక్కడితో ఆగకుండా కళ్లకు గంతలు కట్టుకుని చూడకుండా ఒకచేతితో కంపోజ్‌ చేయడం, కాళ్లతో టైపు చేయటం లాంటి రకరకాల విన్యాసాలు చేసి గిన్నిస్‌ రికార్డులు నెలకొల్పాడు. అతడి రికార్డుల్లో ఎనిమిది కంపోజింగ్‌కి సంబంధించినవి. ఒక్కటి మాత్రం  టెన్నిస్ బాల్ కుసంబంధించినది. వినోద్ కు క్రికెట్ లో సంచనాలు సృష్టించిన సచిన్‌ టెండూల్కర్‌ రికార్డ్ బ్రేక్ చేయాలనీ కోరిక అంట . ఇప్పటిదాకా సచిన్ ఖాతాలో 19 గిన్నిస్‌ రికార్డులు ఉన్నాయి.ఎప్పటికైనా తాను ఎంతగానో అభిమానించే  సచిన్ గిన్నిస్‌ రికార్డులను అధిగమించాలనే ప్రయత్నంలో వినోద్‌ ఉన్నాడట.


వైరల్ : సచిన్ రికార్డు బద్దలు కొట్టడమే అతని టార్గెట్ తెలుసా

కార్పొరేటర్‌ నుంచి అధ్యక్షుడి స్థాయికి బండి సంజయ్‌.. ఎలా సాధ్యమైంది ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>