PoliticsN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/nimmalaramanaidu-d0f04731-51ea-4361-bfbc-260f81a89b01-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/nimmalaramanaidu-d0f04731-51ea-4361-bfbc-260f81a89b01-415x250-IndiaHerald.jpgక‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌ల ఇబ్బందుల‌ను ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ప‌ట్టించుకోవ‌డంలేదు.వామ్మో క‌రోనా అంటూ ఇళ్ల నుంచి కాలు కూడా బ‌య‌ట‌పెట్టని ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు కానీ ఆ ఒక్క ఎమ్మెల్యే మాత్రం నిత్యం ప్ర‌జ‌ల్లోనే ఉన్నారు.క‌రోనా స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు ఏ స‌మ‌స్య వ‌చ్చినా నేనున్నానంటూ భ‌రోసా ఇస్తున్నారు.ఇంతకి ఆ ఎమ్మెల్యే ఎవ‌రోతెలుసుకోవాల‌ని ఉందా... అయితే వివ‌రాల్లోకి వెళ్దాం. పాల‌కొల్లు ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన నిమ్మ‌ల రామ‌నాయుడు ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌ని చేస్తున్నారుnimmalaramanaidu;{#}Assembly;D Ramanaidu;vegetable market;Nimmala Ramanaidu;Service;Cycle;MLA;TDP;YCP;Partyశ‌భాష్ నిమ్మ‌ల నీకు సాటిలేరెవ్వ‌రు...!శ‌భాష్ నిమ్మ‌ల నీకు సాటిలేరెవ్వ‌రు...!nimmalaramanaidu;{#}Assembly;D Ramanaidu;vegetable market;Nimmala Ramanaidu;Service;Cycle;MLA;TDP;YCP;PartySun, 11 Jul 2021 12:33:39 GMTక‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌ల ఇబ్బందుల‌ను ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ప‌ట్టించుకోవ‌డంలేదు.వామ్మో క‌రోనా అంటూ ఇళ్ల నుంచి కాలు కూడా బ‌య‌ట‌పెట్టని ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు కానీ ఆ ఒక్క ఎమ్మెల్యే  మాత్రం నిత్యం ప్ర‌జ‌ల్లోనే ఉన్నారు.క‌రోనా స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు ఏ స‌మ‌స్య వ‌చ్చినా నేనున్నానంటూ భ‌రోసా ఇస్తున్నారు.ఇంతకి ఆ ఎమ్మెల్యే ఎవ‌రోతెలుసుకోవాల‌ని ఉందా... అయితే వివ‌రాల్లోకి వెళ్దాం.

పాల‌కొల్లు ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన నిమ్మ‌ల రామ‌నాయుడు ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌ని చేస్తున్నారు. 2014లో పాల‌కొల్లు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో మ‌రోసారి ఘ‌న విజ‌యం సాధించారు.రాజ‌కీయాల్లో వివాద‌ర‌హితుడిగా పేరు తెచ్చుకున్న నిమ్మ‌ల రామానాయుడు నిరంత‌రం త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటున్నారు. అసెంబ్లీ స‌మావేశాలు, పార్టీ కార్య‌క్ర‌మాలు మాత్రమే ఆయ‌న అమ‌రావ‌తికి వ‌స్తున్నారు,మిగిలిన అన్ని రోజులు నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తి గ్రామంలో ప‌ర్య‌టిస్తున్నారు.

గ‌త ఏడాదిన్న‌రగా క‌రోనా మ‌హామ్మారి ప్ర‌జ‌ల జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసింది.అయితే చాలా మంది ప్ర‌జ‌లు ఆక‌లితో చనిపోయిన ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి.ప్ర‌ధానంగా లాక్‌డౌన్ వ‌ల్ల చాలా మంది ఉపాధిని కోల్పోయారు.దీనికంటే ముందు వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే ఇసుక కొర‌త‌తో రోజువారీ కూలీ పనులు చేసుకునే వారు రోడ్డున ప‌డ్డారు.ఇసుక కొర‌త‌పై నిమ్మ‌ల రామానాయుడు త‌న నియోజ‌క‌వ‌ర్గంలో రిక్షాపై ఇసుక అమ్ముతూ వినూత్నంగా నిర‌స‌న తెలిపారు.ప్ర‌భుత్వం తీసుకుంటున్న ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌పై నిమ్మ‌ల రామానాయుడు త‌న‌దైన‌శైలిలో నిర‌స‌న తెలిపేవారు.
క‌రోన మొద‌టి ద‌శ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు నిమ్మ‌ల రామ‌నాయుడు త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌జ‌ల‌ను కంటికిరెప్ప‌లా కాపాడుకుంటూ వ‌చ్చారు. ప్ర‌తి వీధికి వెళ్లి క‌రోనా బాధితుల‌ను ప‌రామ‌ర్శిస్తూ వారికి ధైర్యం చెప్తున్నారు. బాధితులంద‌రికి నిత్య‌వ‌స‌ర వ‌స్తువులు అందించారు. క‌రోనా వ‌ల్ల ఉపాధి కోల్పోయిన వారికి ఆర్థికసాయం అందించాల‌ని సైకిల్ యాత్ర చేప‌ట్టారు.ఇటు రైతుల స‌మ‌స్య‌ల‌పై కూడా వ్య‌వ‌సాయ మార్కెట్ ద‌గ్గ‌ర నిర‌స‌న వ్య‌క్తం చేశారు.అయితే ప్ర‌తిరోజు లాగే ప్ర‌జ‌ల ఈ రోజు కూడా నిమ్మ‌ల రామానాయుడు ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు జోరు వాన‌లోనే వెళ్లారు.ఉద‌యం నుంచి ఎంత‌సేపు అగిన వ‌ర్షం త‌గ్గ‌క‌పోవ‌డంతో సైకిల్‌పై గొడుగు ప‌ట్టుకుని త‌న సైకిల్ యాత్ర‌ను కొన‌సాగించారు.జోరు వ‌ర్షంలోనే క‌రోనా బాధితుల వ‌ద్ద‌కు వెళ్లి వారికి ధైర్యం చెప్పి నిత్య‌వ‌స‌ర వ‌స్తువులు అందించి వ‌చ్చారు.క‌రోనా స‌మ‌యంలో తన ప్రాణాలను సైతం ఫ‌ణంగా పెట్టి ప్ర‌జ‌ల్లోకి వ‌స్తున్న ఎమ్మ‌ల్యేకి నిమ్మ‌ల రామానాయుడుపై ఆ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు ప్ర‌శంస‌ల‌జ‌ల్లు కురిపిస్తున్నారు.ఇలాంటి ఎమ్మెల్యే దొర‌క‌డం పాల‌కొల్లు ప్ర‌జ‌ల అదృష్ట‌మ‌ని ప‌క్క నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు అనుకుంటున్నార‌ట‌. ఏదిఏమైన నిమ్మ‌ల రామ‌నాయుడు చేస్తున్న సేవ‌ల‌కు శ‌భాష్ అనాల్సిందే.



ఆ మూగ్గురిది ట్రైయాంగిల్ బిజినెస్ - టీడీపీ ఎంపీ

కొడాలి నానిని సేఫ్ చేస్తోందెవ‌రు...!

గంగుల చంద్రబాబును ఇంకా ప్రేమిస్తున్నారా..?

ఏపీ ఎమ్మెల్యేని అడ్డుకున్న తెలంగాణ పోలీసులు..కారణం ఇదే...?

కార్పొరేటర్‌ నుంచి అధ్యక్షుడి స్థాయికి బండి సంజయ్‌.. ఎలా సాధ్యమైంది ?

విశాఖ ఉక్కుపై కేంద్రం ముంద‌డుగు?

టీ టీడీపీ కొత్త అధ్య‌క్షుడు ఆయ‌నేనా ?

తెలంగాణ టీడీపీ కొత్త అధ్య‌క్షుడిగా రావుల చంద్రశేఖ‌ర్ రెడ్డి ?

షర్మిల పార్టీ ప్రభావంతో టిఆర్ఎస్ పతనమైనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>