PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/politics-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/politics-IndiaHerald.jpgకాంగ్రెస్‌ పార్టీలో ట్రబుల్‌ షూటర్‌ గా పేరున్న డీకే శివ కుమార్‌... ప్రస్తుతం కర్ణాటక పీసీసీ చీఫ్‌గా కొనసాగుతున్నారు. డీకే శివ కుమార్‌ కు పార్టీలోనే... ప్రజల్లోనూ చాలా గుర్తింపు ఉంది. అయితే.. ఆయనకు కాస్త కోపం ఎక్కువ. ఇప్పటికే చాలా సార్లు... ఆయన కొన్ని వివాదాల్లో చిక్కుకోగా.... తాజాగా మరో వివాదానికి తెర లేపారు. గతంలో లాగే... కార్యకర్తలపై చేయిచేసుకున్న డీకే శివకుమార్‌.. మరోసారి ఓ కార్యకర్తపై తన విశ్వరూపం చూపించారు. దీంతో కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌.. మరో వివాదాన్ని కొని తెచ్చుకున్dk shivakumar{#}Shiva;Bharatiya Janata Party;lord siva;Friday;Partyకార్యకర్త చెంప పగులగొట్టిన పీసీసీ చీఫ్?కార్యకర్త చెంప పగులగొట్టిన పీసీసీ చీఫ్?dk shivakumar{#}Shiva;Bharatiya Janata Party;lord siva;Friday;PartySun, 11 Jul 2021 08:50:47 GMTకాంగ్రెస్‌ పార్టీలో ట్రబుల్‌ షూటర్‌ గా పేరున్న డీకే శివ కుమార్‌... ప్రస్తుతం కర్ణాటక పీసీసీ చీఫ్‌గా కొనసాగుతున్నారు. డీకే శివ కుమార్‌ కు పార్టీలోనే... ప్రజల్లోనూ చాలా గుర్తింపు ఉంది. అయితే.. ఆయనకు కాస్త కోపం ఎక్కువ. ఇప్పటికే చాలా సార్లు... ఆయన కొన్ని వివాదాల్లో చిక్కుకోగా.... తాజాగా మరో వివాదానికి తెర లేపారు. గతంలో లాగే... కార్యకర్తలపై చేయిచేసుకున్న డీకే శివకుమార్‌.. మరోసారి ఓ కార్యకర్తపై తన విశ్వరూపం చూపించారు. దీంతో కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌.. మరో వివాదాన్ని కొని తెచ్చుకున్నారు.

 తన భుజంపై చేయి వేయడానికి ప్రయత్నించిన ఓ కార్యకర్త చెంప పగల గొట్టారు డీకే శివ కుమార్‌. అయితే.. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో డీకే ను రౌడీతో పోల్చుతూ... బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. పార్టీ సీనియర్‌ నేతను పరామర్శించేందుకు పీసీసీ చీఫ్‌ డీకే శివ కుమార్‌ శుక్రవారం మండ్యాలో పర్యటన చేశారు. అయితే... ఈ పరామర్శ అనంతరం నడుస్తూ... బయటకు వస్తుండగా... ఓ కార్యకర్త డీకే భుజం పై చేయి వేసేందుకు ప్రయత్నించారు.

దీంతో ఒక్కసారిగా ఆగి వెంటనే కార్యకర్తపై చేయి చేసుకున్నారు డీకే శివ కుమార్‌. చనువు ఇస్తే.. చేయి వేయడానికి ప్రయత్నిస్తావా... అని మండిపడ్డారు డీకే. దీంతో ఈ వివాదం పెద్ద రచ్చగా మారిపోయింది. గతంలోనూ తనతో సెల్ఫీ దిగేందుకు యత్నించిన వారి సెల్‌ ఫోన్లను డీకే విసిరేసిన ఘటనలు ఉన్నాయి. తాజా ఘటన నేపథ్యంలో శివ కుమార్‌పై బీజేపీ విమర్శలు చేస్తోంది.

సొంత పార్టీ కార్యకర్తపై నలుగురిలో ఈ విధంగా ప్రవర్శించడం సరికాదని,... ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక కూడా డీకే శివ కుమార్‌ ఇలా వ్యవహరించడం ఏంటని... ప్రశ్నిస్తున్నారు బీజేపీ నేతలు. అయితే.. ఈ వివాదంపై    పీసీసీ చీఫ్‌ డీకే. శివ కుమార్‌ ఇంకా స్పందించలేదు. ఆయన ఎలా ఈ వివాదాన్ని ఎదురుకుంటారో చూడాలి.



రెండోసారి ప్రధానమంత్రి పగ్గాలు..!

ఈ వైసీపీ నేత‌ల మూగ‌నోము వెన‌క ఏం జ‌రిగింది ?

కాంగ్రెస్ కు భారీ షాక్.. తెరాసలోకి వెళ్తున్న కీలక నేత..?

ఈటలను గల్లీ నాయకుడిగా మార్చిన కేసీఆర్..

ఏపీ, తెలంగాణ నీళ్లలొల్లికి అసలు గుట్టు బయటపెట్టిన ఏబీఎన్‌ ఆర్కే..?

ఆచార్య సినిమా నుండి అదిరే సర్‌ప్రైజ్‌..!!

ఈ మహాశివుడి ఆలయం చాలా ప్రత్యేకం ?

తెలంగాణ టీడీపీ కొత్త అధ్యక్షుడు ఎవరు..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: లక్ష్మీపార్వతి గెలిచిన చోట...వైసీపీ ఎమ్మెల్యే సత్తా చాటుతున్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>