EditorialGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/babu-kcr06bcde7a-b82d-44ef-be84-f55f780666c7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/babu-kcr06bcde7a-b82d-44ef-be84-f55f780666c7-415x250-IndiaHerald.jpgతెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న జలవివాదంలో ఇప్పటి వరకూ టీడీపీ నోరు మెదపలేదు. ఇన్నాళ్లూ చంద్రబాబు సహా టీడీపీ నేతలకు జగన్ ని టార్గెట్ చేసే పాయింట్ దొరకలేదు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి మద్దతుగా మాట్లాడాలంటే అది జగన్ ని పొగిడినట్టే అవుతుంది. జగన్ ఆలోచనను మెచ్చుకున్నట్టవుతుంది. అందుకే చంద్రబాబు సైలెంట్ గా ఉన్నారు. కానీ ఇప్పుడు గొడవ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి క్రమంగా జల విద్యుత్ ఉత్పత్తివైపు మలుపు తిరిగింది. అక్కడినుంచి కృష్ణా జలాల్లో ఫిఫ్టీ ఫిఫ్టీ వాటా వైపు టర్న్ తీసుకుంది. దీంతో చంద్రబాబు రంగంలోbabu kcr{#}Srisailam;Krishna River;Rayalaseema;Aqua;Andhra Pradesh;Minister;KCR;CBN;TDP;Telangana;Jaganజగన్ ని టార్గెట్ చేయడంలో చంద్రబాబుకి కేసీఆర్ మాటసాయం..జగన్ ని టార్గెట్ చేయడంలో చంద్రబాబుకి కేసీఆర్ మాటసాయం..babu kcr{#}Srisailam;Krishna River;Rayalaseema;Aqua;Andhra Pradesh;Minister;KCR;CBN;TDP;Telangana;JaganSun, 11 Jul 2021 09:00:00 GMTతెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న జలవివాదంలో ఇప్పటి వరకూ టీడీపీ నోరు మెదపలేదు. ఇన్నాళ్లూ చంద్రబాబు సహా టీడీపీ నేతలకు జగన్ ని టార్గెట్ చేసే పాయింట్ దొరకలేదు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి మద్దతుగా మాట్లాడాలంటే అది జగన్ ని పొగిడినట్టే అవుతుంది. జగన్ ఆలోచనను మెచ్చుకున్నట్టవుతుంది. అందుకే చంద్రబాబు సైలెంట్ గా ఉన్నారు. కానీ ఇప్పుడు గొడవ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి క్రమంగా జల విద్యుత్ ఉత్పత్తివైపు మలుపు తిరిగింది. అక్కడినుంచి కృష్ణా జలాల్లో ఫిఫ్టీ ఫిఫ్టీ వాటా వైపు టర్న్ తీసుకుంది. దీంతో చంద్రబాబు రంగంలోకి దిగారు. టీడీపీ నేతలు జల వివాదంలో జగన్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

తాజాగా కడపలో మీటింగ్ పెట్టుకున్న టీడీపీ నేతలు.. జగన్ ని టార్గెట్ చేశారు. శ్రీశైలం జలాశయం నుంచి తెలంగాణ ప్రభుత్వం నీటిని అక్రమంగా కిందకు విడుదల చేస్తుంటే జగన్ చోద్యం చూస్తున్నారంటూ మండిపడ్డారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. జగన్ నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం వల్లే అక్కడ నీరు వృథాగా సముద్రంపాలవుతోందని ఆరోపించారు.

రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రధాన సమస్యగా ఉన్నప్పుడు టీడీపీ ఎంటర్ కాలేకపోయింది. ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం జలవిద్యుత్ పేరుతో నీటిని కిందకు వదిలేస్తోందో, కృష్ణావాటాలపై పట్టుబట్టిందో.. అప్పుడే టీడీపీ రంగంలోకి దిగింది. ఒకరకంగా జలవివాదాన్ని మలుపు తిప్పి చంద్రబాబుకి కేసీఆర్ మాట సాయం చేసినట్టయింది.

జలవివాదంలో ఏపీ మితవాదాన్ని అనుసరిస్తుండటం, తెలంగాణ నేతలు అతివాదులుగా మాటలకు పదును పెట్టడం చూస్తూనే ఉన్నాం. తెలంగాణ మంత్రులు పదే పదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నా ఏపీ సీఎం జగన్ సహా మంత్రులు కూడా ఇప్పటికీ మౌనంగానే ఉన్నారు. కేవలం లేఖలతో సరిపెడుతున్నారు. కృష్ణాజలాల్లో ఏపీ వాడుకుంటున్న 66 శాతాన్ని 50శాతానికి పరిమితం చేయాలంటూ తెలంగాణ కొత్త డిమాండ్ ని తెరపైకి తెచ్చినా ఏపీ ధీటుగా బదులివ్వలేకపోతోంది. జలవిద్యుత్ పేరుతో రోజుకి 4టీఎంసీల నీరు వృథాగా పోతున్నా కట్టడి చేయలేకపోయింది. దాదాపుగా జలాశయాల్లో నీరు తగ్గి ఏపీకి ఇప్పటికే తీరని నష్టం జరిగింది. ఇకనైనా ఏపీ నేతలు మేలుకొని, కేంద్రం సాయంతో తెలంగాణను కట్టడి చేస్తేనే ఏపీ రైతన్న ధైర్యంగా ఉండగలడు.





జగన్, బాబులకు కేసీఆర్‌ను ఎదిరించే దమ్ము లేదు.. తేల్చేసిన ఆర్కే..?

కృష్ణపట్నం ఆనందయ్య ఎమ్మెల్సీ అవుతారా ?

ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దవుతుంది.. ఎలాగైనా జగన్ జైలుకు వెళ్తాడు.. అప్పుడు జగన్‌ ఖాళీ చేసిన సీఎం సీటు కోసం వైఎస్‌ కుటుంబంలో గొడవలు వస్తాయి.. కుటుంబంలో కాకపోతే.. పార్టీలో గొడవలు వస్తాయి.. నేనంటే నేనే సీఎం అవుతానని పార్టీ నాయకులు పోటీ పడతారు. ఇదంతా ఏంటి అనుకుంటున్నారా.. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కాలజ్ఞానం.

వైఎస్‌ రాజశేఖర రెడ్డి కుటుంబంలో విభేదాలు నానాటికీ ముదురుతున్నాయని.. వైఎస్‌ఆర్‌ జయంతి సందర్భంగా ఈ విభేదాలు మరింత ప్రస్ఫుటంగా కనిపించాయని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అంచనా వేస్తున్నారు. జగన్ సీఎం కావడం, షర్మిల, విజయలక్ష్మిని అధికారానికి దూరం పెట్టడంతో విభేదాలు మరింత ముదిరాయంటున్నారు.

ఈ వైసీపీ నేత‌ల మూగ‌నోము వెన‌క ఏం జ‌రిగింది ?

కాంగ్రెస్ కు భారీ షాక్.. తెరాసలోకి వెళ్తున్న కీలక నేత..?

ఈటలను గల్లీ నాయకుడిగా మార్చిన కేసీఆర్..

ఏపీ, తెలంగాణ నీళ్లలొల్లికి అసలు గుట్టు బయటపెట్టిన ఏబీఎన్‌ ఆర్కే..?

మణిశర్మకు ఛాన్స్ లు తగ్గడానికి ఆ హీరోనే కారణమా.. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>