HealthVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jika-virus-in-keralaf44f3e64-395e-45af-93f2-f9f256cd8aec-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jika-virus-in-keralaf44f3e64-395e-45af-93f2-f9f256cd8aec-415x250-IndiaHerald.jpgచైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్‌ దాటికి ప్రపంచంలోని అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు అస్తవ్యస్థం అయ్యాయి. చాలా మంది ఉపాధి కోల్పోయి... రోడ్డున పడ్డారు. ఇక... పేద ప్రజలమో.... ఆకలితో అలమటించారు. ఈ మహమ్మారి.... ఫస్ట్‌ వేవ్‌... సెకండ్‌ వేవ్‌... అంటూ అందరినీ ముంచేస్తుంది. మొన్నటి వరకు బ్లాక్‌ ఫంగస్‌ తో సతమతమైన ప్రజలు... ఆ తర్వాత డెల్టా వైరస్‌ తో వణికిపోతున్నారు. అయితే.. ఈ వైరస్‌ తాకిడిని అరికట్టేందుకు ప్రభుత్వాలు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలzika virus{#}Kerala;Dengue;mosquitos;Brazil;Coronavirusవణుకు పుట్టిస్తోన్న జీకా వైరస్‌.. కొత్త లక్షణాలు ఇవే ?వణుకు పుట్టిస్తోన్న జీకా వైరస్‌.. కొత్త లక్షణాలు ఇవే ?zika virus{#}Kerala;Dengue;mosquitos;Brazil;CoronavirusSun, 11 Jul 2021 09:44:24 GMTచైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్‌ దాటికి ప్రపంచంలోని అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు అస్తవ్యస్థం అయ్యాయి. చాలా మంది ఉపాధి కోల్పోయి... రోడ్డున పడ్డారు. ఇక... పేద ప్రజలమో.... ఆకలితో అలమటించారు. ఈ మహమ్మారి.... ఫస్ట్‌ వేవ్‌... సెకండ్‌ వేవ్‌... అంటూ అందరినీ ముంచేస్తుంది. మొన్నటి వరకు బ్లాక్‌ ఫంగస్‌ తో సతమతమైన ప్రజలు... ఆ తర్వాత డెల్టా వైరస్‌ తో వణికిపోతున్నారు. అయితే.. ఈ వైరస్‌ తాకిడిని అరికట్టేందుకు ప్రభుత్వాలు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో జీకా వైరస్‌ అందరనీ కలవరపెడుతోంది. ఇప్పటికే కేరళ రాష్ట్రంలో ఈ వైరస్‌ కు సంబంధించిన కేసులు కూడా నమోదవడం గమనార్హం. అసలు ఈ జీకా వైరస్‌ ఏంటి..ఇది సోకితే ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. డెంగ్యూ, మలేరియా మాదిరిగానే జీకా కూడా ఒక రకమైన వైరస్.  ఈ దోమ కాటు వలన వ్యాప్తి చెందుతుంది. ఇది ప్రధానంగా ఈడేస్ దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది.  ఈజీకా వైరస్ కు పగటిపూట కుట్టే దోమలే కారణమని నిపుణులు చెబుతున్నారు. డెంగ్యూ చికెన్ గున్యా వంటి వ్యాధులు వ్యాప్తి చెందడానికి కూడా ఇదే కారణం. అయితే ఈ జీకా వైరస్ ను 1947లో ఆఫ్రికాలో మొదట గా గుర్తించారు. అయితే  2015లో ఈ వైరస్ బ్రెజిల్  వ్యాప్తి చెందింది. ఇలా నెమ్మదిగా ప్రపంచ దేశాలకు పాకిన ఈ వైరస్... మన దేశంలోనూ దీనికి సంబంధించిన కేసులు బయటపడుతున్నాయి.

లక్షణాలు : జీకా సోకిన వారిలో కనిపించే మొట్టమొదటి లక్షణం జ్వరం. డెంగ్యూ బారిన పడిన వారికి ఉన్న లక్షణాలు ఈ జీకా సోకిన వారిలోనూ ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. అయితే మొదట రోగ నిర్ధారణ చేయడం చాలా కష్టం. చాలా మంది రోగులు ఫ్లూ లక్షణాలు గా భావించి నిర్లక్ష్యం చేస్తున్నారు. తాము జీకా బారిన పడ్డామని తెలుసు కునేందుకు చాలా సమయం పడుతుంది. జీకా బారినపడిన వారిలో ముఖ్యంగా తీవ్రమైన జ్వరం, తలనొప్పి, దద్దుర్లు,  ముక్కు కారడం ఇలా వారం రోజుల పాటు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.

అంతేకాదు కొంతమందిలో కండ్ల కలక, కండరాలు, కీళ్ళ నొప్పులు, తలనొప్పి కూడా వస్తుంది అని చెబుతున్నారు వైద్యనిపుణులు. ఒక అరుదైన సందర్భాల్లో జీకా వైరస్ కూడా ఇమ్యూన్ ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుందని నిపుణులు పేర్కొన్నారు. జీకా వైరస్ శరీరంలోకి ప్రవేశించాక... మెదడు మరియు వెన్నుపాము ఇన్ఫెక్షన్లు వస్తాయి అలాగే నాడీ సంబంధిత ఏర్పడతాయి. ఈ వైరస్ వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు వైద్యనిపుణులు.







28 ఏళ్ళ తర్వాత ట్రోఫీ కొట్టిన అర్జెంటీనా

ప్రపంచ జనాభా దినోత్సవం 2021 ప్రాముఖ్యత ఇదే ?

ఆ షోకి ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..!

తెరుచుకోనున్న శబరిమల ఆలయం.. వెళ్ళాలంటే ఇవి తప్పనిసరి!

పీకే.. "ఏకే".. రీమేక్.. అప్పటికే..!

ఆగస్టు 12న నింగిలోకి జీఐశాట్-1!

రాథే శ్యామ్ కోసం చిరంజీవి లా ప్రవర్తిస్తున్న ప్రభాస్ !

ఆచార్య సినిమా నుండి అదిరే సర్‌ప్రైజ్‌..!!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ఈరోజు ధరలు ఇవే!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>