PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tag7714042e-60fc-405f-b243-ad3571871ba9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tag7714042e-60fc-405f-b243-ad3571871ba9-415x250-IndiaHerald.jpg వ్యవసాయం ఇప్పుడు ఖ‌రీదైందిగా మారిపోయింది. పెట్టుబడి పెరిగిపోవడంతోపాటు ఒక‌వేళ‌ ప్రతికూల వాతావరణం ఏర్పడితే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇటువంటి త‌రుణంలో రైతులు అధిక దిగుబడి ఇచ్చే పంటలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉన్న పంటలు, ఔషధ మొక్కల పెంపకం సాగు చేపడితే లాభాలు కురిపించ‌నున్నాయి. గుజరాత్‌లోని దాంగ్‌ జిల్లా రైతులు ఇదే విషయాన్ని నిరూపిస్తున్నారు. ఇక్కడి రైతులు అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న వైట్ మస్లీ అనే మూలికల పంట పండిస్తున్నారు. దీంతో వారికి కాసులు కురుస్తున్నాయి. tag{#}Ayurveda;District;local languageత‌క్కువ ఖ‌ర్చుతో రూ.ల‌క్ష‌లార్జిస్తోందెవ‌రు? ఎక్క‌డ‌?త‌క్కువ ఖ‌ర్చుతో రూ.ల‌క్ష‌లార్జిస్తోందెవ‌రు? ఎక్క‌డ‌?tag{#}Ayurveda;District;local languageSun, 11 Jul 2021 18:04:52 GMT
వ్యవసాయం ఇప్పుడు ఖ‌రీదైందిగా మారిపోయింది. పెట్టుబడి పెరిగిపోవడంతోపాటు ఒక‌వేళ‌ ప్రతికూల వాతావరణం ఏర్పడితే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇటువంటి త‌రుణంలో రైతులు అధిక దిగుబడి ఇచ్చే పంటలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉన్న పంటలు, ఔషధ మొక్కల పెంపకం సాగు చేపడితే లాభాలు కురిపించ‌నున్నాయి. గుజరాత్‌లోని దాంగ్‌ జిల్లా రైతులు ఇదే విషయాన్ని నిరూపిస్తున్నారు. ఇక్కడి రైతులు అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న వైట్ మస్లీ అనే మూలికల పంట పండిస్తున్నారు. దీంతో వారికి కాసులు కురుస్తున్నాయి.

స‌ఫేద్ మ‌స్లీ అంటారు
దాంగ్‌ జిల్లా రైతులు తెలుపు మస్లీ మూలికల పంటను సాగుచేస్తున్నారు. సఫేద్ మస్లీ అని కూడా దీన్ని అంటారు. వర్షాకాలంలో చేపట్టే ఈ మూలిక సాగుతో రైతుల‌కు ల‌క్ష‌లాది రూపాయ‌ల ఆదాయం ల‌భిస్తోంది. వీరి జీవన శైలి కూడా మారిపోయింది.  ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతిలో ఈ మూలికల సాగు ఉండ‌టంతో తక్కువ పెట్టుబడితోనే పంట చేతికొస్తోంది. మరోవైపు మార్కెటింగ్ కూడా సుల‌భంగా ఉంటోంది. దీంతో వారికి వెన‌క్కి తిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం లేకుండా పోయింది. ఎక్కువ‌గా సాగుమీదే దృష్టిపెట్టి ల‌క్ష‌లార్జిస్తున్నారు.

విదేశాల్లో కూడా డిమాండ్‌
ఈ మూలికలు అంగ స్తంభన సమస్యలకు, బరువు తగ్గేందుకు, మ‌ధుమేహం అదుపులో ఉంచుకునేందుకు బాగా పనిచేస్తుంటాయి. దీనికి మ‌న‌దేశంతోపాటు దేశాల్లోనూ డిమాండ్ ఉంది. మూలికలతో పాటు టానిక్ రూపంలో కూడా ఇది అందుబాటులో ఉంటోంది. పంట చేతికి రాగానే స్థానిక వ్యాపారుల‌తోపాటు ఫార్మా కంపెనీల ప్రతినిధులు రైతుల వద్దకే వచ్చి వీటిని కొనుగోలు చేస్తుంటారు. వైట్ మస్లీతో తయారుచేసిన మందులను ప్ర‌భుత్వం ఆయుర్వేద ఆస్పత్రులకు స‌ర‌ఫ‌రా చేస్తోంది.

కేజీ వెయ్యిరూపాల‌యల నుంచి రూ.1500 వ‌ర‌కు
వైట్ మస్లీకి డిమాండ్ ఉండటంతో ఈ-కామర్స్ సైట్లలో కూడా వీటిని అమ్ముతున్నారు. దాంగ్ ఫారెస్ట్ విభాగం ఈ తరహా వ్యవసాయాన్ని ప్రోత్స‌హిస్తోంది. వారికి విత్త‌నాలు కూడా స‌ర‌ఫ‌రా చేస్తోంది. దాంగ్‌ జిల్లాలో 350 మంది రైతులు 40 ఎకరాల్లో ఈ పంట‌ను సాగుచేస్తున్నారు. కేజీ వైట్ మస్లీ ధర రూ.1000 నుండి రూ.1500గా ఉంది. ప్రభుత్వ రాయితీలు కూడా ఉండ‌టంతో సాగు ఖ‌ర్చు చాలా త‌క్కువ‌గా ఉంటోంది.



వ్యవసాయం ఇప్పుడు ఖ‌రీదైందిగా మారిపోయింది. పెట్టుబడి పెరిగిపోవడంతోపాటు ఒక‌వేళ‌ ప్రతికూల వాతావరణం ఏర్పడితే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇటువంటి త‌రుణంలో రైతులు అధిక దిగుబడి ఇచ్చే పంటలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉన్న పంటలు, ఔషధ మొక్కల పెంపకం సాగు చేపడితే లాభాలు కురిపించ‌నున్నాయి. గుజరాత్‌లోని దాంగ్‌ జిల్లా రైతులు ఇదే విషయాన్ని నిరూపిస్తున్నారు. ఇక్కడి రైతులు అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న వైట్ మస్లీ అనే మూలికల పంట పండిస్తున్నారు. దీంతో వారికి కాసులు కురుస్తున్నాయి.

భారతదేశంలో విద్యుత్తు వాహనాలకు ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఏర్పడుతోంది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు పలు మోడళ్లను కంపెనీలు మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. బజాజ్ కంపెనీ కూడా విద్యుత్తు వాహనాలను సిద్ధం చేస్తోంది. హైదరాబాద్ మార్కెట్ లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను ప్రవేశపెట్టేందుకు బ‌జాజ్ ఆటో సిద్ధ‌మైంది. నాగపూర్ లో చేతక్ ఈవీ షోరూమ్ ను ప్రారంభించ‌డానికి ఏర్పాట్లు కూడా జ‌రుగుతున్నాయి. నాగ్ పూర్, హైదరాబాద్, చెన్నై మార్కెట్‌లో తమ స్కూటర్ అందుబాటులో ఉంచేలా బజాజ్ ప్ర‌ణాళిక సిద్ధం చేస్తోంది. బజాజ్ చేతక్ వాహనాలకు గ‌తంలో ఫుల్ డిమాండ్ ఉండేది. 1990వ దశకంలో స్కూట‌ర్ విభాగంలో బజాజ్‌ చేతక్ అంటే చాలు వినియోగదారుల సంతోష‌ప‌డిపోయేవారు. మార్కెట్ లోకి పలు కంపెనీలు బైక్‌లను విడుదల చేయ‌డంతో బజాజ్ చేతక్ లను పక్కన పెట్టారు. అంద‌రూ బైక్‌ల‌వైపు మళ్ల‌డంతో చేతక్ స్కూటర్ వాహనాల అమ్మకాలు ఎప్ప‌టిక‌ప్పుడు త‌గ్గిపోతూ వ‌చ్చాయి.

హైద‌రాబాద్‌లో బ‌జాజ్ చేత‌క్?

ఈ లేడీ స్టార్ ఆర్టిస్ట్ ల గురించి ఎంత చెప్పినా తక్కువే

ఏప్రిల్, మే నెలల్లో విరుచుకుపడిన క‌రోనా రెండోదశ మ‌న‌దేశంలో విధ్వంసం సృష్టించింది. కేసులు, మృతుల సంఖ్య వేగంగా పెర‌గ‌డంతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డాల్సి వ‌చ్చింది. అయితే, రెండోద‌శ దాదాపుగా తగ్గినట్లుగా అనిపిస్తోన్న సమయంలో కోవిడ్-19 కొత్త వేరియంట్లపై చ‌ర్చ ఆందోళనకు గురిచేస్తోంది. కరోనాతో మరణించిన ఓ 90ఏళ్ల మహిళ ఒకే సమయంలో కరోనావైరస్ ఆల్ఫా, బీటా వేరియంట్స్‌తో ఉండ‌టం దేశ‌వ్యాప్తంగా వైద్య‌నిపుణుల‌ను ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనాతో మృతిచెందిన‌వారి శ‌రీరంలో ప‌రిశోధ‌కులు ఒక వైర‌స్ వేరియంట్‌ను మాత్ర‌మే క‌నుగొన్నారు. అయితే ఈ రెండు వేరియంట్లు ఆ మ‌హిళ శ‌రీరంలోకి ఎలా ప్ర‌వేశించాయ‌నే విష‌యంపై ప‌రిశోధ‌న‌లు జ‌రిగాయి.

ఒకే శ‌రీరంలో రెండు క‌రోనా వేరియంట్లు?

సీఎం జ‌గ‌న్‌కు టీడీపీ ఎమ్మెల్యేల లేఖ‌

కృష్ణపట్నం ఆనందయ్య ఎమ్మెల్సీ అవుతారా ?

విశాఖ ఉక్కు క‌ర్మాగారాన్ని ప్ర‌యివేటు ప‌రం చేయాల‌నుకున్న‌ప్పుడు కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళ‌న చేశాయి. వీరికి మ‌ద్ద‌తుగా రాజ‌కీయ పార్టీలు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు, ధ‌ర్నాలు చేప‌ట్టాయి. అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల‌న్నీ కార్మిక సంఘాల‌కు మ‌ద్ద‌తు తెలిపాయి. తెలుగుదేశం పార్టీ నేత‌లైతే ఆమ‌ర‌ణ దీక్ష‌కు కూడా కూర్చున్నారు. రాజ్య‌స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి పాద‌యాత్ర నిర్వ‌హించారు. అయితే ఆ యాత్ర విశాఖ న‌గ‌రపాల‌క సంస్థ ఎన్నిక‌ల కోస‌మ‌ని అప్ప‌ట్లోనే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఆయ‌న ఢిల్లీ వెళ్లి కూడా విశాఖ ఉక్కును అమ్మ‌నీయ‌బోమంటూ ప్ర‌క‌ట‌న చేశారు. అయితే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మాత్రం కేంద్ర పెద్ద‌ల‌కు ఒక లేఖ రాసి స‌రిపెట్టారు.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>