PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tag1c8e28f3-760f-4b22-8057-ea9f90f1be7c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tag1c8e28f3-760f-4b22-8057-ea9f90f1be7c-415x250-IndiaHerald.jpgభువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి భార‌తీయ జ‌న‌తాపార్టీలో చేర‌నున్నారా? అందుకే త‌రుచుగా ఆ పార్టీవారితో స‌మావేశ‌మ‌వుతున్నారా? అందుకే త‌న సొంత పార్టీ కాంగ్రెపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారా? పీసీసీ ప‌ద‌వంటే చాలా చిన్న‌ది త‌న దృష్టిలో అంటూ ఎందుకు వ్యాఖ్యానించారు? రేవంత్‌రెడ్డి చిన్న‌పిల్లాడ‌నం దేనికి సంకేతం?.. ఇలాంటివ‌న్నీ ఆయ‌న పార్టీ మార‌బోతున్నార‌నేదానికి సంకేత‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. తెలంగాణ పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి ఆశించి తీవ్ర‌స్థాయిలో భంగ‌ప‌డ్డ కోమ‌టిరెడ్డి త‌న‌కు ఆ ప‌ద‌విtag{#}Delhi;Cabinet;Bharatiya Janata Party;Revanth Reddy;MP;central government;Congress;Party;Telanganaబీజేపీలోకి ఎంపీ కోమ‌టిరెడ్డి?బీజేపీలోకి ఎంపీ కోమ‌టిరెడ్డి?tag{#}Delhi;Cabinet;Bharatiya Janata Party;Revanth Reddy;MP;central government;Congress;Party;TelanganaSun, 11 Jul 2021 18:25:07 GMT


భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి భార‌తీయ జ‌న‌తాపార్టీలో చేర‌నున్నారా? అందుకే త‌రుచుగా ఆ పార్టీవారితో స‌మావేశ‌మ‌వుతున్నారా? అందుకే త‌న సొంత పార్టీ కాంగ్రెపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారా?  పీసీసీ ప‌ద‌వంటే చాలా చిన్న‌ది త‌న దృష్టిలో అంటూ ఎందుకు వ్యాఖ్యానించారు?  రేవంత్‌రెడ్డి చిన్న‌పిల్లాడ‌నం దేనికి సంకేతం?.. ఇలాంటివ‌న్నీ ఆయ‌న పార్టీ మార‌బోతున్నార‌నేదానికి సంకేత‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. తెలంగాణ పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి ఆశించి తీవ్ర‌స్థాయిలో భంగ‌ప‌డ్డ కోమ‌టిరెడ్డి త‌న‌కు ఆ ప‌ద‌వి ద‌క్క‌క‌పోయేస‌రికి కాంగ్రెస్ పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.

వ‌రుస‌గా ఢిల్లీలో భేటీలు?
రేవంత్‌రెడ్డిని ఎంపిక చేయ‌డానికి ముందు కాంగ్రెస్ అధిష్టానాన్ని క‌ల‌వ‌డానికి హ‌డావిడిగా కోమ‌టిరెడ్డి ఢిల్లీ బ‌యలుదేరి వెళ్లారు. ఆ త‌ర్వాత కొద్దిరోజుల‌కు రేవంత్‌ను ఎంపికను ధ్రువీక‌రిస్తూ అధిష్టానం ప్ర‌క‌ట‌న చేసింది. దీంతో కోమ‌టిరెడ్డి అగ్గిమీద గుగ్గిల‌మ‌య్యారు. ఆ త‌ర్వాత కేంద్ర మంత్రులు నితిన్ గ‌డ్క‌రీ, కిష‌న్‌రెడ్డితో భేటీ అయ్యారు. త‌రుచుగా ఢిల్లీ వెళుతూ బీజేపీ పెద్ద‌ల‌తో సాన్నిహిత్యం పెంచుకుంటున్నారు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి ప‌నుల కోస‌మే మంత్రుల‌ను క‌లుస్తున్నానంటున్నారు. క్యాబినెట్ ర్యాంకు సాధించిన కిష‌న్‌రెడ్డిని ప్ర‌త్యేకంగా క‌లిసి అభినంద‌న‌లు తెలియ‌జేశారు. తన నియోజకవర్గంలోని పర్యాటక కేంద్రాల అభివృద్ధికి, ప్ర‌చారానికి నిధులివ్వాలని, నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి కూడా నిధులివ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. అధికారికంగా కిష‌న్‌రెడ్డితో విజ్ఞ‌ప్తి చేసిన‌ప్ప‌టికీ అనధికారికంగా రాజకీయ చర్చలు సాగించిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం.

స్థాయికి త‌గ్గ‌ట్లుగా ప‌ద‌విస్తే..
కోమటిరెడ్డి వెంక‌ట‌రెడ్డి తాను బీజేపీలోకి వస్తే మంచి ప‌ద‌విస్తార‌నే ఆశ‌తో ఉన్న‌ట్లు తెలుస్తోంది. త‌న స్థాయికి త‌గ్గ‌ట్లుగా, త‌న స‌మ‌ర్థ‌త‌కు త‌గ్గ‌ట్లుగా పార్టీ రాష్ట్ర అధ్య‌క్ష బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే బాగుంటుంద‌నే ఉద్దేశంతో ఆయ‌న ఉన్న‌ట్లు స‌మాచారం. అలాంటి హామీ ఇచ్చి పార్టీలో చేర్చుకుంటార‌నే ఉద్దేశంతోనే ఆయ‌న ఢిల్లీ చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తున్నారంటూ ఆయ‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు విమ‌ర్శిస్తున్నారు. రేవంత్‌రెడ్డి చిన్న పిల్లాడు కాబ‌ట్టి ఆయ‌న నాయ‌క‌త్వంలో ప‌నిచేయ‌డానికి కోమ‌టిరెడ్డి సిద్ధంగా లేర‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం భార‌తీయ జ‌న‌తాపార్టీలో ఉన్న ప‌రిస్థితులు కూడా ఏమాత్రం అనుకూలంగా లేవు. బండి సంజ‌య్‌ను త‌ప్పించే ఆలోచ‌న ఆ పార్టీకి అస‌లే లేదు. మ‌రి కోమ‌టిరెడ్డి మ‌రీ ఎక్కువ ఆశ‌ప‌రుడుత‌న్నారేమోన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో ఆయ‌న ఎటువైపు అడుగువేస్తారో చూడాల్సి ఉంది..!!







'కారు' దిగ‌నున్న టీఆర్ఎస్ కీల‌క నేత‌లు..!

వ్యవసాయం ఇప్పుడు ఖ‌రీదైందిగా మారిపోయింది. పెట్టుబడి పెరిగిపోవడంతోపాటు ఒక‌వేళ‌ ప్రతికూల వాతావరణం ఏర్పడితే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇటువంటి త‌రుణంలో రైతులు అధిక దిగుబడి ఇచ్చే పంటలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉన్న పంటలు, ఔషధ మొక్కల పెంపకం సాగు చేపడితే లాభాలు కురిపించ‌నున్నాయి. గుజరాత్‌లోని దాంగ్‌ జిల్లా రైతులు ఇదే విషయాన్ని నిరూపిస్తున్నారు. ఇక్కడి రైతులు అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న వైట్ మస్లీ అనే మూలికల పంట పండిస్తున్నారు. దీంతో వారికి కాసులు కురుస్తున్నాయి.

త‌క్కువ ఖ‌ర్చుతో రూ.ల‌క్ష‌లార్జిస్తోందెవ‌రు? ఎక్క‌డ‌?

రేవంత్ రెడ్డి చిన్నపిల్లాడు.. నా దృష్టిలో ఆ పదవి చాలా చిన్నది !

భారతదేశంలో విద్యుత్తు వాహనాలకు ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఏర్పడుతోంది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు పలు మోడళ్లను కంపెనీలు మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. బజాజ్ కంపెనీ కూడా విద్యుత్తు వాహనాలను సిద్ధం చేస్తోంది. హైదరాబాద్ మార్కెట్ లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను ప్రవేశపెట్టేందుకు బ‌జాజ్ ఆటో సిద్ధ‌మైంది. నాగపూర్ లో చేతక్ ఈవీ షోరూమ్ ను ప్రారంభించ‌డానికి ఏర్పాట్లు కూడా జ‌రుగుతున్నాయి. నాగ్ పూర్, హైదరాబాద్, చెన్నై మార్కెట్‌లో తమ స్కూటర్ అందుబాటులో ఉంచేలా బజాజ్ ప్ర‌ణాళిక సిద్ధం చేస్తోంది. బజాజ్ చేతక్ వాహనాలకు గ‌తంలో ఫుల్ డిమాండ్ ఉండేది. 1990వ దశకంలో స్కూట‌ర్ విభాగంలో బజాజ్‌ చేతక్ అంటే చాలు వినియోగదారుల సంతోష‌ప‌డిపోయేవారు. మార్కెట్ లోకి పలు కంపెనీలు బైక్‌లను విడుదల చేయ‌డంతో బజాజ్ చేతక్ లను పక్కన పెట్టారు. అంద‌రూ బైక్‌ల‌వైపు మళ్ల‌డంతో చేతక్ స్కూటర్ వాహనాల అమ్మకాలు ఎప్ప‌టిక‌ప్పుడు త‌గ్గిపోతూ వ‌చ్చాయి.

హైద‌రాబాద్‌లో బ‌జాజ్ చేత‌క్?

తెలంగాణతో పోరాటం మీద వైసీపీ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు!

ఈ లేడీ స్టార్ ఆర్టిస్ట్ ల గురించి ఎంత చెప్పినా తక్కువే

ఏప్రిల్, మే నెలల్లో విరుచుకుపడిన క‌రోనా రెండోదశ మ‌న‌దేశంలో విధ్వంసం సృష్టించింది. కేసులు, మృతుల సంఖ్య వేగంగా పెర‌గ‌డంతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డాల్సి వ‌చ్చింది. అయితే, రెండోద‌శ దాదాపుగా తగ్గినట్లుగా అనిపిస్తోన్న సమయంలో కోవిడ్-19 కొత్త వేరియంట్లపై చ‌ర్చ ఆందోళనకు గురిచేస్తోంది. కరోనాతో మరణించిన ఓ 90ఏళ్ల మహిళ ఒకే సమయంలో కరోనావైరస్ ఆల్ఫా, బీటా వేరియంట్స్‌తో ఉండ‌టం దేశ‌వ్యాప్తంగా వైద్య‌నిపుణుల‌ను ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనాతో మృతిచెందిన‌వారి శ‌రీరంలో ప‌రిశోధ‌కులు ఒక వైర‌స్ వేరియంట్‌ను మాత్ర‌మే క‌నుగొన్నారు. అయితే ఈ రెండు వేరియంట్లు ఆ మ‌హిళ శ‌రీరంలోకి ఎలా ప్ర‌వేశించాయ‌నే విష‌యంపై ప‌రిశోధ‌న‌లు జ‌రిగాయి.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>