PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tag9f9d282e-0f6d-44b6-9a17-55388a674706-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tag9f9d282e-0f6d-44b6-9a17-55388a674706-415x250-IndiaHerald.jpgఏప్రిల్, మే నెలల్లో విరుచుకుపడిన క‌రోనా రెండోదశ మ‌న‌దేశంలో విధ్వంసం సృష్టించింది. కేసులు, మృతుల సంఖ్య వేగంగా పెర‌గ‌డంతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డాల్సి వ‌చ్చింది. అయితే, రెండోద‌శ దాదాపుగా తగ్గినట్లుగా అనిపిస్తోన్న సమయంలో కోవిడ్-19 కొత్త వేరియంట్లపై చ‌ర్చ ఆందోళనకు గురిచేస్తోంది. కరోనాతో మరణించిన ఓ 90ఏళ్ల మహిళ ఒకే సమయంలో కరోనావైరస్ ఆల్ఫా, బీటా వేరియంట్స్‌తో ఉండ‌టం దేశ‌వ్యాప్తంగా వైద్య‌నిపుణుల‌ను ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. tag{#}oxygen;Belgium;Coronavirusఒకే శ‌రీరంలో రెండు క‌రోనా వేరియంట్లు?ఒకే శ‌రీరంలో రెండు క‌రోనా వేరియంట్లు?tag{#}oxygen;Belgium;CoronavirusSun, 11 Jul 2021 17:03:10 GMT
ఏప్రిల్, మే నెలల్లో విరుచుకుపడిన క‌రోనా రెండోదశ మ‌న‌దేశంలో విధ్వంసం సృష్టించింది. కేసులు, మృతుల సంఖ్య వేగంగా పెర‌గ‌డంతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డాల్సి వ‌చ్చింది. అయితే, రెండోద‌శ దాదాపుగా తగ్గినట్లుగా అనిపిస్తోన్న సమయంలో కోవిడ్-19 కొత్త వేరియంట్లపై చ‌ర్చ ఆందోళనకు గురిచేస్తోంది. కరోనాతో మరణించిన ఓ 90ఏళ్ల మహిళ ఒకే సమయంలో కరోనావైరస్ ఆల్ఫా, బీటా వేరియంట్స్‌తో ఉండ‌టం దేశ‌వ్యాప్తంగా వైద్య‌నిపుణుల‌ను ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనాతో మృతిచెందిన‌వారి శ‌రీరంలో ప‌రిశోధ‌కులు ఒక వైర‌స్ వేరియంట్‌ను మాత్ర‌మే క‌నుగొన్నారు. అయితే ఈ రెండు వేరియంట్లు ఆ మ‌హిళ శ‌రీరంలోకి ఎలా ప్ర‌వేశించాయ‌నే విష‌యంపై ప‌రిశోధ‌న‌లు జ‌రిగాయి.

ఇద్ద‌రు వ్య‌క్తుల నుంచి రెండు వైర‌స్‌లు సోకాయి
అసలు శ‌రీరంలో కరోనా రెండు వేరియంట్లు ఉంటాయా? శరీరంలోకి ప్ర‌వేశించాక రెండు వేరియంట్లుగా మారిందా? ఐదు రోజుల్లోనే మ‌ర‌ణించేంత ప‌రిస్థితిని ఆ రెండు వేరియంట్లు తెచ్చాయా? ఇలాంటి అనుమానాల నేప‌థ్యంలో బెల్జియం ప‌రిశోధ‌కులు చివ‌ర‌కు అస‌లు విష‌యాన్ని క‌నుగొన్నారు. ఒంటరిగా నివసించే వృద్ధురాలు ఒక‌రు మృతిచెందిన త‌ర్వాత పరీక్షలు జరపగా, బ్రిటన్లో ఉద్భవించిన ఆల్ఫా, బీటా వేరియంట్లు రెండింటినీ ఆమె శరీరంలో ఉన్న‌ట్లు వైద్యులు క‌నుగొన్నారు. అయితే ఈ రెండు వేరియంట్లు ఆమెకు బయటనుంచే సోకినట్లుగా గుర్తించారు. ఒకేసారి ఒకే వ్యక్తి నుంచి కాకుండా ఇద్దరు వ్యక్తుల నుంచి కొవిడ్  సోకడంతో రెండుర‌కాల వైర‌స్ వేరియంట్లు ఆ వృద్దురాలి శరీరంలోకి ప్రవేశించాయ‌ని నిర్థ‌రించారు. రెండు వేరియంట్లను ఆమె శ‌రీరం తట్టుకోలేకపోవ‌డంతో ప్రాణాలు కోల్పోవాల్సి వ‌చ్చింద‌ని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఆమెకు ఆక్సిజన్ స్థాయిలు మొదట్లో బాగానే ఉన్న‌ప్ప‌టికీ పరిస్థితి వేగంగా క్షీణించి ఐదురోజుల్లో మృతిచెందింద‌ని వైద్యులు వెల్ల‌డించారు. ఆమె టీకా కూడా వేయించుకోలేద‌ని తెలిపారు. ప‌రిశోధ‌కులు చేసిన ఈ అధ్య‌య‌నాన్ని ఎక్క‌డా ప్ర‌చురించ‌లేదు. ఒక‌టికంటే ఎక్కువ వేరియంట్ల‌ను శ‌రీరం త‌ట్టుకోలేద‌ని దీనివ‌ల్ల రుజువైంద‌ని వైద్య‌నిపుణులు చెబుతున్నారు.

హైద‌రాబాద్‌లో బ‌జాజ్ చేత‌క్?

ఏప్రిల్, మే నెలల్లో విరుచుకుపడిన క‌రోనా రెండోదశ మ‌న‌దేశంలో విధ్వంసం సృష్టించింది. కేసులు, మృతుల సంఖ్య వేగంగా పెర‌గ‌డంతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డాల్సి వ‌చ్చింది. అయితే, రెండోద‌శ దాదాపుగా తగ్గినట్లుగా అనిపిస్తోన్న సమయంలో కోవిడ్-19 కొత్త వేరియంట్లపై చ‌ర్చ ఆందోళనకు గురిచేస్తోంది. కరోనాతో మరణించిన ఓ 90ఏళ్ల మహిళ ఒకే సమయంలో కరోనావైరస్ ఆల్ఫా, బీటా వేరియంట్స్‌తో ఉండ‌టం దేశ‌వ్యాప్తంగా వైద్య‌నిపుణుల‌ను ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనాతో మృతిచెందిన‌వారి శ‌రీరంలో ప‌రిశోధ‌కులు ఒక వైర‌స్ వేరియంట్‌ను మాత్ర‌మే క‌నుగొన్నారు. అయితే ఈ రెండు వేరియంట్లు ఆ మ‌హిళ శ‌రీరంలోకి ఎలా ప్ర‌వేశించాయ‌నే విష‌యంపై ప‌రిశోధ‌న‌లు జ‌రిగాయి.

పవన్ సినిమాకి పాటలు వద్దంటున్న త్రివిక్రమ్..?

బిగ్ బాస్-5 కంటెస్టెంట్స్ వీళ్లేనా..?

క‌రోనా థ‌ర్డ్‌వేవ్ వ‌చ్చేస్తోంది.. ఆర్ నాట్ విలువ చెప్పేస్తోంది..!

ఎన్టీఆర్ మొదలెట్టేసాడు..!!

కత్తి మహేష్ నుంచి TNR వరకు 2021 లో కన్ను మూసిన జర్నలిస్టులు

ప్రపంచ జనాభా దినోత్సవం 2021 ప్రాముఖ్యత ఇదే ?

కృష్ణపట్నం ఆనందయ్య ఎమ్మెల్సీ అవుతారా ?

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>