MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas65a40263-6485-4dda-ad0a-d0f68b5d9e7c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas65a40263-6485-4dda-ad0a-d0f68b5d9e7c-415x250-IndiaHerald.jpgమెగా స్టార్ చిరంజీవి ఇప్పటివరకు సినిమాలకు దర్శకత్వం వహించకపోయినా సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని రంగాల పైనా అతడికి పట్టు ఉంది. ముఖ్యంగా చిరంజీవి ఒక రచయిత చెపుతున్న కథ విన్నప్పుడు ఆకథ సినిమాగా తీస్తే సరిపోతుందా లేదా అన్నవిషయమై అతడికి చాలపట్టు ఉంది అంటారు.ఈవిచక్షణ వల్లనే విపరీతమైన పోటీ ఉన్న సినిమా రంగంలో 63 సంవత్సరాలు వచ్చినప్పటికీ చిరంజీవి తన పట్టును కొనసాగించ గలుగుతున్నాడు. ముఖ్యంగా సినిమాల ఎడిటింగ్ విషయంలో చిరంజీవికి చాల పట్టు ఉంది. మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలకు సంబంధించిన కథలతో పాటు ఆమprabhas{#}Dussehra;Vijayadashami;Writer;Coronavirus;Industry;Prabhas;Love;News;Chiranjeevi;Cinemaరాథే శ్యామ్ కోసం చిరంజీవి లా ప్రవర్తిస్తున్న ప్రభాస్ !రాథే శ్యామ్ కోసం చిరంజీవి లా ప్రవర్తిస్తున్న ప్రభాస్ !prabhas{#}Dussehra;Vijayadashami;Writer;Coronavirus;Industry;Prabhas;Love;News;Chiranjeevi;CinemaSun, 11 Jul 2021 08:00:00 GMTమెగా స్టార్ చిరంజీవి ఇప్పటివరకు సినిమాలకు దర్శకత్వం వహించకపోయినా సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని రంగాల పైనా అతడికి పట్టు ఉంది. ముఖ్యంగా చిరంజీవి ఒక రచయిత చెపుతున్న కథ విన్నప్పుడు ఆకథ సినిమాగా తీస్తే సరిపోతుందా లేదా అన్నవిషయమై అతడికి చాలపట్టు ఉంది అంటారు.


ఈవిచక్షణ వల్లనే విపరీతమైన పోటీ ఉన్న సినిమా రంగంలో 63 సంవత్సరాలు వచ్చినప్పటికీ చిరంజీవి తన పట్టును కొనసాగించ గలుగుతున్నాడు. ముఖ్యంగా సినిమాల ఎడిటింగ్ విషయంలో చిరంజీవికి చాల పట్టు ఉంది. మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలకు సంబంధించిన కథలతో పాటు ఆమూవీ ఎడిటింగ్ విషయంలో ఏమైనా సమస్యలు వస్తే చిరంజీవి సలహాలు ఇస్తూ ఉంటాడు.


అయితే ఇప్పుడు ప్రభాస్ ‘రాథే శ్యామ్’ కోసం చిరంజీవి స్ఫూర్తితో ఎడిటర్ గా మారడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. తెలుస్తున్న సమాచారం మేరకు ‘రాథే శ్యామ్’ షూటింగ్ ఇంచుమించు పూర్తి కావడంతో ఈమూవీ ఫైనల్ కాపీని తయారుచేయడానికి ఎడిటింగ్ వర్క్ మొదలైనట్లు టాక్. ఈమూవీ షూటింగ్ గత రెండు సంవత్సరాలుగా కొనసాగిన పరిస్థితులలో ఈమూవీ అవుట్ పుట్ చాల ఎక్కువగా వచ్చిందని ముఖ్యంగా ప్రభాస్ పూజ హెగ్డే ల మధ్య లవ్ ట్రాక్ సీన్స్ చాల ఎక్కువగా షూట్ చేయడంతో ఈమూవీ లెంత్ చాల ఎక్కువగా వచ్చిందని అందువల్ల సగటు ప్రేక్షకులకు బోర్ ఫీలింగ్ కలగకుండా ఈమూవీ నిడివిని కథ దెబ్బ తినకుండా ఎడిట్ చేయమని ప్రభాస్ ఈమూవీ టీమ్ కు సలహాలు ఇవ్వడమే కాకుండా తానే స్వయంగా ఎడిటింగ్ టేబుల్ దగ్గర సిటింగ్ వేస్తున్నట్లు టాక్.


వాస్తవానికి ఈమూవీ జూలై చివరి వారంలో విడుదల కావలసి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు వల్ల ఈమూవీ విడుదల ఆగిపోవడంతో ఇప్పుడు ఈమూవీని దసరా రేస్ లో దింపాలని ప్రభాస్ భావిస్తున్నాడు. అయితే ఇదే దసరా కు ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల అవుతున్న పరిస్థితులలో ఈమూవీకి ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదలకు మధ్య కనీసం ఒక నెల సమయం ఉండే విధంగా ప్రభాస్ ఆలోచనలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది..  







ఆగస్టు 12న నింగిలోకి జీఐశాట్-1!

ఏపీ, తెలంగాణ నీళ్లలొల్లికి అసలు గుట్టు బయటపెట్టిన ఏబీఎన్‌ ఆర్కే..?

ఆచార్య సినిమా నుండి అదిరే సర్‌ప్రైజ్‌..!!

కిస్ సీన్ సీక్రెట్స్ బయటపెట్టిన 'ఫ్యామిలీ మ్యాన్' డాటర్

మణిశర్మకు ఛాన్స్ లు తగ్గడానికి ఆ హీరోనే కారణమా.. ?

తెలంగాణ టీడీపీ కొత్త అధ్యక్షుడు ఎవరు..?

పెడ చెవిన పెడితే ఖబడ్డార్..? ప్రొడ్యూసర్ వార్నింగ్..!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ఈరోజు ధరలు ఇవే!

‘పుష్ప’ అప్పుడు రిలీజ్ కానుందా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>