PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rains-three-days3383c499-1af7-4889-89e5-619ff9a791b1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rains-three-days3383c499-1af7-4889-89e5-619ff9a791b1-415x250-IndiaHerald.jpgబంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఇటు రైతుల్లో ఆందోళన నెలకొంది. ఎక్కడ తాము కష్టపడి వేసిన పంట నీట మునుగుతుందోనని టెన్షన్ పడుతున్నారు. ఇటు ఏపీలోని తీర ప్రాంతాల్లో ఉన్నవారు సముద్ర వేటకు వెళ్లొద్దనే హెచ్చరికలు జారీ అయ్యాయి. rains three days{#}Odisha;Sircilla;Karimnagar;Telangana;Warangal;Hyderabad;Varsham;Teluguహెచ్చరిక : మూడు రోజులు జాగ్రత్త.. ఆ వైపు వెళ్లొద్దు !హెచ్చరిక : మూడు రోజులు జాగ్రత్త.. ఆ వైపు వెళ్లొద్దు !rains three days{#}Odisha;Sircilla;Karimnagar;Telangana;Warangal;Hyderabad;Varsham;TeluguSun, 11 Jul 2021 22:00:00 GMT
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల్లో కేంద్రీకృతమైంది. అల్పపీడనం కారణంగా మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయనీ.. మిగతా చోట్ల తేలిక పాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. తీరం వెంబడి 55నుంచి 65కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తాయని విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. ఎల్లుండి వరకు వేటకు వెళ్లొద్దని జాలర్లను హెచ్చరించింది. ప్రజలు అఫ్రమత్తంగా ఉండాలని వెల్లడించింది.

మరోవైపు అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షలు కురుస్తున్నాయి. వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో భారీగా వానలు పడుతున్నాయి. వరంగల్ జిల్లా చెన్నారావువేటలో 14సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాజీపేటలో 11.3సెంటీమీటర్లు, సిరిసిల్ల జిల్లా ఇల్లంతుకుంటలో 11.8సెంటీమీటర్ల వర్షం కురిసింది.

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. కూకట్ పల్లి, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, నిజాంపేట్, ప్రగతినగర్, బాచుపల్లి, బాలానగర్, చింతల్, జగద్గిరిగుట్ట, జీడిమెట్ల, కొంపల్లి, సుచిత్ర, కుత్బుల్లాపూర్, మాదాపూర్, కొండాపూర్, మణికొండ, గచ్చిబౌలి, రాయదుర్గం, లంగర్ హౌజ్, గోల్కొండ, చార్మినార్, చాంద్రాయణగుట్ట,యాకుత్ పుర, కార్వాన్, జూబ్లీహిల్స్ సహా కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.మొత్తానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలనే హెచ్చరికలు వాతావరణ శాఖ నుంచి వచ్చాయి.  

 



బండికి మంచు లక్ష్మీ విషెస్.. ఏమై ఉంటుందబ్బా?

యశ్ ఫోకస్ మార్చాడే... అసలు కథేంటో?

విజయం మీదే: మీ పిల్లలు స్కూల్ కి వెళుతున్నారా... తీసుకోవాల్సిన జాగ్రత్తలివే ?

ప్రముఖ నటుడు సుమన్ కు అరుదైన గౌరవం..!

వ్యాక్సినేషన్ వేయించుకున్నారా? ఇది మీకే !

బర్త్ డే రోజే బండి సంజయ్ కి షాక్ ఇచ్చిన అధికారులు ?

బీజేపీలోకి ఎంపీ కోమ‌టిరెడ్డి?

'కారు' దిగ‌నున్న టీఆర్ఎస్ కీల‌క నేత‌లు..!

ఎందుకు ఇంకా సినిమా లు విడుదల కావట్లేదు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>