PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/eetala-rajender5940150a-700a-4e7f-aa23-314e17fc8428-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/eetala-rajender5940150a-700a-4e7f-aa23-314e17fc8428-415x250-IndiaHerald.jpgటీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయి బయటకొచ్చి ఈటల రాజేందర్ కొత్త రాజకీయ ప్రస్థానం మొదలు పెడతారనుకున్న టైమ్ లో ఆయన వ్యూహం ఎలా ఉంటుందా అని చాలామంది ఆసక్తిగా ఎదురు చూశారు. కొత్త రాజకీయ పార్టీ పెట్టి, కేసీఆర్ వ్యతిరేకులందర్నీ ఓ చోటకు చేర్చి టీఆర్ఎస్ పై యుద్ధం ప్రకటిస్తారని ఓ వర్గం అంచనా వేసింది. అలా చేస్తే కచ్చితంగా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతుందని, కేసీఆర్ ని ఢీకొనే బలమైన ఉద్యమ నాయకుడు తెరపైకి వచ్చినట్టవుతుందని అనుకున్నారంతా. కానీ రోజులు గడిచే కొద్దీ ఈటల వ్యవహారం పూర్తిగా నీరుగారిపోయింది. కేసీeetala rajender{#}Eatala Rajendar;Chakram;Prasthanam;Leader;Bharatiya Janata Party;KCR;Telangana Rashtra Samithi TRS;Party;warఈటలను గల్లీ నాయకుడిగా మార్చిన కేసీఆర్..ఈటలను గల్లీ నాయకుడిగా మార్చిన కేసీఆర్..eetala rajender{#}Eatala Rajendar;Chakram;Prasthanam;Leader;Bharatiya Janata Party;KCR;Telangana Rashtra Samithi TRS;Party;warSun, 11 Jul 2021 08:00:00 GMTటీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయి బయటకొచ్చి ఈటల రాజేందర్ కొత్త రాజకీయ ప్రస్థానం మొదలు పెడతారనుకున్న టైమ్ లో ఆయన వ్యూహం ఎలా ఉంటుందా అని చాలామంది ఆసక్తిగా ఎదురు చూశారు. కొత్త రాజకీయ పార్టీ పెట్టి, కేసీఆర్ వ్యతిరేకులందర్నీ ఓ చోటకు చేర్చి టీఆర్ఎస్ పై యుద్ధం ప్రకటిస్తారని ఓ వర్గం అంచనా వేసింది. అలా చేస్తే కచ్చితంగా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతుందని, కేసీఆర్ ని ఢీకొనే బలమైన ఉద్యమ నాయకుడు తెరపైకి వచ్చినట్టవుతుందని అనుకున్నారంతా. కానీ రోజులు గడిచే కొద్దీ ఈటల వ్యవహారం పూర్తిగా నీరుగారిపోయింది. కేసీఆర్ కి వ్యతిరేకంగా రాష్ట్రనాయకుడవుతారని అనుకున్న రాజేందర్.. గ్లలీ లీడర్ గా మారిపోయారు. కేసీఆర్ ఆయన్ను అలా మార్చేశారంతే.

ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం అప్పటికప్పుడు ఆయనకి అత్యవసరం అయి ఉండొచ్చు. అయితే ఆయన బీజేపీలో చేరడంతో అనుచరులు చాలామంది టీఆర్ఎస్ ని వదిలి ఆయనతో కలసి నడవడానికి ఇష్టపడలేదనే విషయం మాత్రం వాస్తవం. కేసుల భయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అండని ఈటల కోరుకున్నారు. అయితే ఈటల ఒంటరిగా వెళ్తే మద్దతిస్తామన్న చాలామంది ఆ తర్వాత ఆయనకు దూరం జరిగారు.

వాస్తవానికి ఈటల ఇండిపెండెంట్ గా పోటీ చేసినా హుజూరాబాద్ లో సింపతీ ఉండేది. బీజేపీలో చేరడం ఈటలపై కాస్త వ్యతిరేకత పెరగడానికి కారణం అయింది. టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు బీజేపీని చెడామడా తిట్టేసిన ఈటల.. ఇప్పుడు ఆ పార్టీ కండువా భుజాన వేసుకుని ఊరూరా తిరుగుతున్నారు.

హుజూరాబాద్ గెలుపు ఈటలకు ప్రతిష్టాత్మకంగా మారింది. రోజు రోజుకీ ఆయనకు గెలుపుపై నమ్మకం సన్నగిల్లుతున్నట్టు అర్థమవుతోంది. అందుకే ఉప ఎన్నికల ప్రకటన వెలువడక ముందే ఇల్లిళ్లూ తిరుగుతున్నారు. ఊరూరా ప్రచారం చేపడుతున్నారు. తనపై టీఆర్ఎస్ దాడి చేసిందని, ఒంటరివాడ్ని చేసి మంత్రులందర్నీ హుజూరాబాద్ పైకి మళ్లించారని విమర్శలు చేస్తున్నారు ఈటల.

మంత్రిగా, రాష్ట్ర నాయకుడి హోదాలో ఉండాల్సిన ఈటల రాజేందర్, ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలవడానికి ఆపసోపాలు పడుతున్నారు. కేసీఆర్ కి పోటీగా రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతారని అనుకున్న ఈటల ఇలా అనుకోకుండా హుజూరాబాద్ కే పరిమితం కావాల్సి వచ్చింది. బీజేపీ నాయకులలో ఒకరిగా మారిపోవాల్సి వచ్చింది. ఓవైపు కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ, హడావిడి చేస్తుంటే ఈటల మాత్రం గెలుపు కోసం గల్లీ గల్లీ తిరగాల్సి వస్తోంది.





రెండోసారి ప్రధానమంత్రి పగ్గాలు..!

ఈ వైసీపీ నేత‌ల మూగ‌నోము వెన‌క ఏం జ‌రిగింది ?

కాంగ్రెస్ కు భారీ షాక్.. తెరాసలోకి వెళ్తున్న కీలక నేత..?

ఏపీ, తెలంగాణ నీళ్లలొల్లికి అసలు గుట్టు బయటపెట్టిన ఏబీఎన్‌ ఆర్కే..?

తెలంగాణ టీడీపీ కొత్త అధ్యక్షుడు ఎవరు..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: లక్ష్మీపార్వతి గెలిచిన చోట...వైసీపీ ఎమ్మెల్యే సత్తా చాటుతున్నారా?

బాబాయి-అబ్బాయి సెట్ చేయట్లేదా... బాబుకు షాక్ ఇచ్చేస్తారా?

బాబుతో రేవంత్‌కు కష్టమే...ఎటాక్ చేసిన లాభం లేదా?

అలా జరిగితే...రఘురామ రూట్ మారుతుందా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>