PoliticsVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/new-rule-on-sound-pollution-ff628460-121f-4d4b-bcab-d07604f7a298-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/new-rule-on-sound-pollution-ff628460-121f-4d4b-bcab-d07604f7a298-415x250-IndiaHerald.jpgపర్యావరణం బాగుంటేనే మనం బాగుంటాము ఇది జగమెరిగిన సత్యం. పర్యావరణానికి చేటు చేసే ప్రతీది జీవకోటికి ముప్పును కలిగిస్తుంది. కాకపోతే కాస్త ముందు వెనుక అంతే. ఇంత తెలిసి మానవులు అభివృద్ధి , టెక్నాలజీ పేరుతో పర్యావరణానికి హాని కలిగించే విధంగా కొన్ని కృత్యాలను ఆవిష్కరిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. NEW RULE ON SOUND POLLUTION {#}TECHNOLOGY;Delhi;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Diesel;Saturday;pollution;Duvvada Jagannadham;Manamఢిల్లీ సర్కార్ మరో కఠిన నిర్ణయం... ?ఢిల్లీ సర్కార్ మరో కఠిన నిర్ణయం... ?NEW RULE ON SOUND POLLUTION {#}TECHNOLOGY;Delhi;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Diesel;Saturday;pollution;Duvvada Jagannadham;ManamSun, 11 Jul 2021 09:00:00 GMTపర్యావరణం బాగుంటేనే మనం బాగుంటాము ఇది జగమెరిగిన సత్యం. పర్యావరణానికి చేటు చేసే ప్రతీది జీవకోటికి ముప్పును కలిగిస్తుంది. కాకపోతే కాస్త ముందు వెనుక అంతే. ఇంత తెలిసి మానవులు అభివృద్ధి , టెక్నాలజీ పేరుతో పర్యావరణానికి హాని కలిగించే విధంగా కొన్ని కృత్యాలను ఆవిష్కరిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. రాబోయే కాలంలో ఆ ప్రభావం తిరిగి మనపై తప్పకుండా ఉండబోతుంది అన్న విషయం తెలిసి కూడా నేడు సౌకర్యవంతంగా సంతోషంగా గడపడం కోసం వారికి నచ్చిన విధంగా వారు చేసుకుపోతున్నారు. అయితే ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. ఇకనైనా పర్యావరణ రక్షణపై పూర్తి శ్రద్ధ పెట్టకపోతే సర్వ జీవకోటికి పెను ఉప్పెన సంభవించే అవకాశం ఉంది. అయితే తాజాగా పర్యావరణానికి మేలు చేసే ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకుంది ఢిల్లీ ప్రభుత్వం. ధ్వని కాలుష్యం అనేది పర్యావరణానికి ఒక రకంగా కీడు చేసేదే అయితే ఇందుకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుని ఆదేశాలను జారీ చేసింది ఢిల్లీ సర్కారు.

ఇకపై ముందస్తు అనుమతులు లేకుండా డీజే సెట్లు, లౌడ్ స్పీకర్లు , ఇతరత్రా ద్వని కాలుష్య వాహకాలు అయినా సరే ముందుగా అనుమతి లేకుండా వాడినా, పరిమితికి మించి వినియోగించినా అటువంటివారికి ఇకమీదట పది వేల రూపాయల నుండి లక్ష రూపాయల వరకు జరిమానా విధించబడుతుంది అని ప్రకటించింది డిల్లీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ నిర్ణయం ఇకపై ఢిల్లీ రాష్ట్రంలో అమలులో ఉండబోతోంది. ఢిల్లీ వాసులు ఎవరైనా సరే శబ్ద కాలుష్య నిబంధనలను ఉల్లంఘించినట్లయితే ఆ నేరానికి వారికి శిక్ష తప్పదని ధ్రువీకరించింది ఢిల్లీ సర్కార్. సవరించిన ఈ నిబంధనలను ఇకపై ఖచ్చితంగా అమలు చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ డి పి సి సి .
ఈ మేరకు శనివారం నాడు ఈ ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో బహిరంగ ప్రదేశాలలో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా లేదా లౌడ్ స్పీకర్ల వంటి సాధనాల ద్వారా పరిమితికి మించి శబ్దాలను పెంచిన ధ్వని కాలుష్యానికి కారణమైన అటువంటి వ్యక్తులకు లేదా బృందాలకు జరిమానా తప్పదని స్పష్టం చేసింది డిల్లీ ప్రభుత్వం.

అంతేకాకుండా శబ్ద కాలుష్యానికి వినియోగించిన పరికరాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకోవాలని సూచించింది ప్రభుత్వం. ఇక ధ్వని కాలుష్య లెక్కల వివరాలు ఇలా ఉన్నాయి...
వాణిజ్య ప్రదేశాలలో పగటి పూట 65 డెసిబెల్, అదే విధంగా రాత్రి వేళల్లో 55 డెసిబెల్,ఇక సున్నిత ప్రాంతాలలో పగటి వేళల్లో 50 డెసిబెల్, రాత్రి సమయంలో 40 డెసిబెల్ వరకే ధ్వని స్థాయికి అనుమతి ఉంటుంది అని ఇంతకు మించి అతిక్రమిస్తే చర్యలు తప్పవని క్లారిటీ ఇచ్చింది.

1,000 కెవిఎకు మించిన డీజిల్ జెనరేటర్(డిజి) సెట్లు ఉపయోగిస్తే అటువంటి వారు తప్పకుండా రూ. 1 లక్ష జరిమానా చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది . 62.5 కెవిఎ నుంచి 1,000 కెవిఎ లోపు డిజి సెట్లు వినియోగించినట్టు అయితే వారికి రూ. 25,000, అదేవిధంగా 62.5 కెవిఎ లోపు డిజి సెట్లు వాడినట్లైయితే అటువంటి వారు రూ 10,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని డిపిసిసి ఉత్తర్వులో పేర్కొంది. ఇక నివాస ప్రాంతాల విషయానికి వస్తే, పగటి పూట 55 డెసిబెల్, రాత్రి సమయంలో 45 డెసిబెల్ మించి ధ్వని స్థాయి ఉండకూడదని తెలియచేసింది. ఒకవేళ పై చెప్పబడిన ఆదేశాలను అతిక్రమిస్తే చర్యలు తప్పవు మరి.



తెరుచుకోనున్న శబరిమల ఆలయం.. వెళ్ళాలంటే ఇవి తప్పనిసరి!

కాంగ్రెస్ కు భారీ షాక్.. తెరాసలోకి వెళ్తున్న కీలక నేత..?

మణిశర్మకు ఛాన్స్ లు తగ్గడానికి ఆ హీరోనే కారణమా.. ?

ఏపీకి కొత్త గవర్నర్ గా యడ్యూరప్ప..?

విజయం మీదే: మార్చుకో నీవెంచుకున్న మార్గాన్ని ?

బిజినెస్: రూ.12 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. కోట్లల్లో రాబడి..

భారీ బాంబు పేలుడు... 10 మంది మృతి !

లైఫ్ స్టైల్: పూజా మందిరం ఎక్కడ ఉంటే మంచిది..

గ్యాస్ సిలిండర్లపై ఉండే ఈ నంబర్స్ ఏంటో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>