WinnersVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/winners/130/vijayam-meedhe2f6e665e-bfac-4ce2-b912-926a50e0c14d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/winners/130/vijayam-meedhe2f6e665e-bfac-4ce2-b912-926a50e0c14d-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ కారణంగా దేశానికి రేపటి పౌరులుగా మారాల్సిన పిల్లల చదువులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. ముఖ్యంగా టెన్త్ మరియు ఇంటర్ మీడియట్ విద్యార్థులకు జరగాల్సిన పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా రద్దు అయిపోతాయి. దీనితో వారి చదువులు ప్రశ్నార్థకంగా మారాయి. దీనితో పిల్లల భవిషత్తు గురించి తల్లి తండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.VIJAYAM MEEDHE{#}School;News;Telugu;Coronavirusవిజయం మీదే: మీ పిల్లలు స్కూల్ కి వెళుతున్నారా... తీసుకోవాల్సిన జాగ్రత్తలివే ?విజయం మీదే: మీ పిల్లలు స్కూల్ కి వెళుతున్నారా... తీసుకోవాల్సిన జాగ్రత్తలివే ?VIJAYAM MEEDHE{#}School;News;Telugu;CoronavirusSun, 11 Jul 2021 21:00:00 GMTకరోనా వైరస్ కారణంగా దేశానికి రేపటి పౌరులుగా మారాల్సిన పిల్లల చదువులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. ముఖ్యంగా టెన్త్ మరియు ఇంటర్ మీడియట్ విద్యార్థులకు జరగాల్సిన పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా రద్దు అయిపోతాయి. దీనితో వారి చదువులు ప్రశ్నార్థకంగా మారాయి. దీనితో పిల్లల భవిషత్తు గురించి తల్లి తండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. రెండు సంవత్సరాల నుండి మన దేశాన్ని వీడని కరోనా దశల వారీగా తన ప్రభావాన్ని చూపుతోంది. కాగా గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గడంతో, మొన్నటి వరకు ఉన్న లాక్ డౌన్ ఆంక్షలను తెలుగు రాష్ట్రాలు సడలించడం జరిగింది. అంతే కాకుండా గత రెండు సంవత్సరాలుగా చదువుకు నోచుకోని విద్యార్థుల కోసం పాఠశాలలను తెరవడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతమున్న సమాచారం మేరకు ఆగస్ట్ 16 వ తేదీ నుండి స్కూల్స్ ను పునఃప్రారంభించనున్నారు. అయితే కరోనా మూడవ దశ కూడా వచ్చే అవకాశం ఉండడంతో ఒకవేళ స్కూల్స్ తెరిచి, పేరెంట్స్ వారి పిల్లలను స్కూల్స్ కు పంపితే ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.

* కరోనా మూడవ దశ వచ్చే చాన్స్ ఉండడంతో ఎంతమంది పేరెంట్స్ పిల్లల్ని స్కూల్ కు పంపుతారో తెలియాల్సి ఉంది.

* ఎవరైతే పేరెంట్స్ స్కూల్ కు పంపుతారో వారు ఖచ్చితంగా పిల్లలకు కరోనా పట్ల పాటించాల్సిన జాగ్రత్తలను అర్థమయ్యేలా తెలియచేయాలి.

* ఇంటి నుండి స్కూల్ కి బయలుదేరే ముందు మాస్క్ ను ఎలా ధరించాలో నేర్పించి, ఎటువంటి పరిస్థితుల్లో మస్కును తీయకూడదని వారికి చెప్పాలి.

* పేరెంట్స్ పిల్లలకు శానిటైజర్ ను అప్లై చేసి పంపించాలి. అంతే కాకుండా స్కూల్ దగ్గరా కూడా బాత్ రూం కి వెళ్ళినా, లంచ్ చేసినా ఎవరి వస్తులనైనా ముట్టుకున్నా శానిటైజర్ ను అప్లై చెయ్యాలని అవగాహన కలిగించాలి.

* అదే విధంగా చేతులను శుభ్రంగా  కడుక్కోవాలని తెలియచేయాలి.

* మీరే స్వయంగా స్కూల్ దగ్గరకు వెళ్ళి ఉపాధ్యాయులకు మీ పిల్లలను జాగ్రత్తగా చూడమని చెప్పాలి.

* పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చాక వారికి ఏమైనా హెల్త్ ఇష్యూ ఉందా అని గమనించాలి. అలాగే వారి క్లాస్ లో అందరూ ఆరోగ్యంగానే ఉన్నారా లేదా అని అడగాలి. ఒకవేళ ఎవరికైనా దగ్గు జలుబు ఉంటే ముందుగానే వారిని గుర్తించి నయం చేసుకునే అవకాశం ఉంటుంది.
 
ఇలా పిల్లల తల్లితండ్రులు అన్ని జాగ్రత్తలు పాటిస్తూ పిల్లలను స్కూల్ కు పంపాలి. ముఖ్యంగా థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావం చూపనుంది. కావున ఎటువంటి నిర్లక్ష్యాన్ని వ్యవహరించవద్దు.



ప్రముఖ నటుడు సుమన్ కు అరుదైన గౌరవం..!

వ్యాక్సినేషన్ వేయించుకున్నారా? ఇది మీకే !

బాయ్ ఫ్రెండ్ కి చికెన్ తినిపించిన శృతిహాసన్.. వైరల్ అవుతున్న వీడియో..!!

ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్న మెగాస్టార్...

బర్త్ డే రోజే బండి సంజయ్ కి షాక్ ఇచ్చిన అధికారులు ?

ఫస్ట్ లుక్ తో అదరగొట్టేసిన "వాలిమై"

ప్రముఖ పత్రిక ద్వారా పెళ్లి చేసుకున్న మురళి మోహన్, జయచిత్ర.. అసలు కథ ఏంటి ?

ఎందుకు ఇంకా సినిమా లు విడుదల కావట్లేదు?

ఎన్టీఆర్ చెల్లి ఏంటి ఇలా మారిపోయింది..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>