Rains in Telangana : హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు…

Telangana

oi-Srinivas Mittapalli

|

హైదరాబాద్‌ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోని ముషీరాబాద్,సికింద్రాబాద్,అడిక్‌మెట్,నల్లకుంట,కేపీహెచ్‌బీ,నిజాంపేట్,బాచుపల్లి,బాలానగర్,కుత్భుల్లాపూర్,మాదాపూర్,కొండాపూర్,మణికొండ,జూబ్లీహిల్స్,బంజారాహిల్స్,గచ్చిబౌలి తదిరత ప్రాంతాల్లో ఆదివారం(జులై 11) ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. తెల్లవారుజామున తేలికపాటి చినుకులు పడగా.. మధ్యాహ్నం సమయానికి భారీ వర్షంగా మారింది.

ఖమ్మం,భద్రాద్రి కొత్తగూడెం,మహబూబాబాద్,వరంగల్,హన్మకొండ జిల్లాల్లోనూ ఆదివారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. నాగర్‌కర్నూల్ జిల్లాలో 14.9సెం.మీ వర్షపాతం నమోదైనట్లు తెలుస్తోంది. వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.

 telangana receives moderate to heavy rains acorss the state

రుతుపవనాల ప్రభావంతో గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్బపీడన ప్రభావంతో తెలంగాణలో వర్షాలు నమోదవుతున్నాయని హైదరబాద్ వాతావరణ శాఖ తెలిపింది.దీని ప్రభావంతో ఈ నెల 13వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 3 రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు వెల్లడించారు. ముఖ్యంగా కోస్తాంధ్ర,రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి గంటకు 55-65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పారు. ఈ మూడు రోజులు సముద్రంలో అలజడి ఉంటుందని… మత్య్సకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.

ఈ అల్ప పీడన ప్రభావంతో కేరళ,కర్ణాటక,తమిళనాడు,మహారాష్ట్ర,మధ్యప్రదేశ్,ఒడి,గుజరాత్,అండమాన్ నికోబార్ రాష్ట్రాల్లోనూ అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

English summary

Several districts in Telangana, including Hyderabad, are receiving heavy rains. It will rain in Musheerabad, Secunderabad, Adikmet, Nallakunta, KPHB, Nizampet, Bachupally, Balanagar, Kutchhullapur, Madhapur, Kondapur, Manikonda, Jubilee Hills, Banjara Hills and Gatchibauli areas of Hyderabad from Sunday (July 11) morning. Light drizzle in the morning .. It became heavy rain by noon.

Story first published: Sunday, July 11, 2021, 13:40 [IST]

Source | Oneindia.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *