SpiritualityVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/spirituality/pisces_pisces/spiritualitye103c158-6b6c-47fe-bf9d-aa0baed7746d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/spirituality/pisces_pisces/spiritualitye103c158-6b6c-47fe-bf9d-aa0baed7746d-415x250-IndiaHerald.jpgఈ విశ్వానికే అధిపతి అయిన మహాశివునికి అత్యంత ప్రసిద్ధి చెందిన పలు ప్రత్యేక దేవాలయ గురించి మీరు వినే ఉంటారు. అయితే పరమశివునికి సంబంధించి ఈ శివాలయం మరింత అద్భుతం. ఆ ముక్కంటికి తప్ప ఎవరికీ అంతుచిక్కని రహస్యం ఒకటుంది. అదే గుజరాత్ లోని నిష్కలంక్ ఆలయం. SPIRITUALITY{#}Gujarat - Gandhinagar;Sea;Evening;lord sivaఈ మహాశివుడి ఆలయం చాలా ప్రత్యేకం ?ఈ మహాశివుడి ఆలయం చాలా ప్రత్యేకం ?SPIRITUALITY{#}Gujarat - Gandhinagar;Sea;Evening;lord sivaSun, 11 Jul 2021 08:00:00 GMTగుజరాత్ లోని నిష్కలంక్ ఆలయం. ఈ ఆలయం నిత్యం సముద్రంలో మునిగి తేలుతూ ఉంటుంది. అలల తాకిడికి అనుగుణంగా ఆలయం అదృశ్యమైపోతుంది. ఈ అరుదైన ఆలయం గుజరాత్ లోని భావనగర్ కు తూర్పున 23 కిలోమీటర్ల దూరంలో కొలియాక్ సముద్ర తీర ప్రాంతంలో కొలువై ఉంది. సముద్రం మద్యలో ఎంతో విచిత్రంగా ఉండే ఈ ఆలయం అప్పట్లో కావాలనే ఇలా నిర్మించారా లేకపోతే కాలక్రమేణా ఈ తీరుగా మారింది అనేది ఎవరికీ అంతుచిక్కని రహస్యం.

ఈశ్వర్ ఆలయంలోని శివలింగం ప్రాచీనమైంది అయినా దీని చుట్టూ ఉన్న ఆలయాన్ని మాత్రం చాలా ఏళ్ల క్రితమే నిర్మించారు. సముద్రపు అలలకు అనుగుణంగా ఈ ఆలయం కనిపిస్తుంది. అలలు తక్కువగా ఉన్నప్పుడు ఒక్క అంగుళమే బయటపడుతూ భక్తులు అందులోకి వెళ్లే అవకాశం లభిస్తుంది.  మళ్లీ అదే తరహాలో సముద్రంలోకి మునిగిపోతుంది. సముద్ర గర్భంలోకి వెళ్ళిపోవడం, మళ్లీ విడిపోవడం వరకు మొత్తం ఈ  క్రమాన్ని గమనించేందుకు భక్తులు ఉదయం నుంచి సాయంత్రం వరకు తీరం వద్దే వేచి ఉంటారు. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి నిత్యం సముద్రుడు ఇలా అభిషేకిస్తూ శివుని అర్థిస్తూ ఉంటాడని  భక్తుల ప్రగాఢ నమ్మకం.  

కొలియాక్ సముద్రంలో ఉన్న ఈ శివాలయం ఉదయం సముద్రంలో పూర్తిగా మునిగి ఉంటుంది. ఉదయం 11 గంటలు దాటిన తర్వాత నుంచి మెల్లగా సముద్రం వెనక్కి జరిగి ఆలయానికి వెళ్లే మార్గం కనిపిస్తుంది. ఈ సమయంలో భక్తులు ఆలయంలోకి ప్రవేశించి ఆ పరమ శివుడ్ని దర్శించుకుంటారు. మహాశివరాత్రి వంటి ప్రత్యేక రోజుల్లో ఇక్కడ ఎంతో వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. సముద్రం మధ్యలో శివాలయం ఎలా నిర్మించారనే విషయం మాత్రం ఇప్పటికీ అంతు చిక్కని రహస్యం.


ఆచార్య సినిమా నుండి అదిరే సర్‌ప్రైజ్‌..!!

నాని 'టక్ జగదీష్' రిలీజ్ కి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..?

నిద్రపట్టడం లేదా.. ? అయితే ఇలా చేయండి.. !

ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. 13 సెకన్లలో ప్రపంచ రికార్డు?

ఇష్టకామేశ్వరి దేవి ప్రత్యేకత ఇదే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>