MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/rana-mollywood-director040be416-4a3f-42d0-aba5-23bfd55c88d7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/rana-mollywood-director040be416-4a3f-42d0-aba5-23bfd55c88d7-415x250-IndiaHerald.jpgదగ్గుబాటి ఫ్యామిలీకి తెలుగు సినిమా పరిశ్రమలో ఎంత ప్రత్యేకత ఉందో అందరికీ తెలిసిన విషయమే. డాక్టర్ డి రామానాయుడు తెలుగు సినిమా అభివృద్ధికి చేసిన కృషిని ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. ఈ ఫ్యామిలీ నుండి నిర్మాతగా ఆయన తనయుడు సురేష్ బాబు మంచి మంచి సినిమాలను నిర్మిస్తూ ఇండస్ట్రీలో బిజీగా ఉండగా, మరో తనయుడు హీరో వెంకటేష్ అప్పటికీ ఇప్పటికీ అదే ఎనర్జీని కొనసాగిస్తూ యూత్ కి పోటీగా సినిమాలను చేస్తూ దూసుకుపోతున్నాడు.rana movie with mollywood director{#}rana daggubati;Bahubali;Doctor;Virataparvam;Suresh;Rajamouli;Director;Venkatesh;Telugu;Leader;D Ramanaidu;Nimmala Ramanaidu;Hero;Cinemaమలయాళ డైరెక్టర్ తో రానా... ప్లాన్ అదిరింది ?మలయాళ డైరెక్టర్ తో రానా... ప్లాన్ అదిరింది ?rana movie with mollywood director{#}rana daggubati;Bahubali;Doctor;Virataparvam;Suresh;Rajamouli;Director;Venkatesh;Telugu;Leader;D Ramanaidu;Nimmala Ramanaidu;Hero;CinemaSun, 11 Jul 2021 15:00:00 GMTదగ్గుబాటి ఫ్యామిలీకి తెలుగు సినిమా పరిశ్రమలో ఎంత ప్రత్యేకత ఉందో అందరికీ తెలిసిన విషయమే. డాక్టర్ డి రామానాయుడు తెలుగు సినిమా అభివృద్ధికి చేసిన కృషిని ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. ఈ ఫ్యామిలీ నుండి నిర్మాతగా ఆయన తనయుడు సురేష్ బాబు మంచి మంచి సినిమాలను నిర్మిస్తూ ఇండస్ట్రీలో బిజీగా ఉండగా, మరో తనయుడు హీరో వెంకటేష్ అప్పటికీ ఇప్పటికీ అదే ఎనర్జీని కొనసాగిస్తూ యూత్ కి పోటీగా సినిమాలను చేస్తూ దూసుకు పోతున్నాడు. వెంకటేష్ తర్వాత ఈ ఫ్యామిలీ నుండి హీరోగా వచ్చింది రానా మాత్రమే. రానా మొదట్లో లీడర్ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ సినిమాలో తనదైన నటనతో అభిమానులను సంపాదించుకున్నాడు.

ఆ తరువాత వరుసగా సినిమాలను చేసినా పాత్రలు మారాయే తప్ప రానాకు మంచి బ్రేక్ ఇచ్చిన మూవీ ఏదీ రాలేదు. అప్పుడే దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన బాహుబలి సిరీస్ తో రానా ప్రతిభ ప్రపంచమంతా తెలిసింది. భళ్లాలదేవుడిగా రానా నటన అద్భుతమని చెప్పాలి. సినిమాల ఫలితాల సంగతి అలా ఉంచితే ప్రయోగాలకు పెద్ద పీట వేస్తున్నాడు. తాజాగా విరాటపర్వం విడుదలకు సిద్ధంగా ఉంది. కాగా ప్రస్తుతం రానా మలయాళ దర్శకుడితో సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల మాలీవుడ్ సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

అందుకే రానా చూపు మాలీవుడ్ పై పడింది. మలయాళ దర్శకులు తెరకెక్కించే విధానం మరియు ఎంచుకునే కథలు రానాకు బాగా నచ్చాయట. అందుకే మలయాళ డైరెక్టర్ తో సినిమా తీయడానికి ఆసక్తి చూపిస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే సురేష్ బాబు డైరెక్టర్ తో మాట్లాడాడట, కథ రెడీ చేసిన తరువాత ఫైనల్ చేయనున్నట్లు సమాచారం. ఈ కథ రానాకు నచ్చి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా ? అన్నది తెలియాల్సి ఉంది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. ..


తన కన్న తండ్రి వల్ల ఖుష్బూ ఎన్ని కష్టాలు పడిందో తెలిస్తే కన్నీళ్లే

ఎన్టీఆర్ మొదలెట్టేసాడు..!!

కత్తి మహేష్ నుంచి TNR వరకు 2021 లో కన్ను మూసిన జర్నలిస్టులు

ఎన్టీఆర్ సినిమాను రీమేక్ చేస్తున్న సల్మాన్ ఖాన్..!!

రజినీ అవకాశాన్ని కొట్టేసిన వెంకీ!!

బాస్ సినిమాలో నటించిన పూనమ్ అవకాశాల కోసం మరి ఇంత దిగజారిందా ?

గంగుల చంద్రబాబును ఇంకా ప్రేమిస్తున్నారా..?

రామ్ కొత్త సినిమా టైటిల్ అదేనా..?

హీరోలు, డైరెక్టర్ లే కాదు.. ఇప్పుడు అరవ విలన్ లు కూడా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>