PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-5b123fde-589d-458f-82c7-eb3bf3bf69be-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-5b123fde-589d-458f-82c7-eb3bf3bf69be-415x250-IndiaHerald.jpgఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి పనులను తమ అస్త్రాలుగా వాడుకుంటూ పార్టీని బలోపేతం చేసే దిశలో షర్మిల ముందుకు వెళుతోంది. ఇదే సమయంలో తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష తో ఉద్యమాలు చేసి దానికి అండగా నిలిచిన టిఆర్ఎస్ పార్టీ, కెసిఆర్ ను రెండుసార్లు విజయతీరాలకు తీసుకెళ్లారు. కానీ గత కొద్ది రోజులుగా తెలంగాణలో అణచివేత ఎక్కువైందని ప్రజలలో అసమ్మతి మొదలైందని తెలుస్తోంది. ఈ అసమ్మతి ఇతర పార్టీలకు లాభంగా మారుతున్నాయని అనుకోవచ్చు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వివక్షకు గురైనటువంటి తెలంగాణ ప్రజానీకం మPolitical {#}dr rajasekhar;Telangana;history;Service;Sharmila;Party;Government;Andhra Pradeshషర్మిల పార్టీ ప్రభావంతో టిఆర్ఎస్ పతనమైనా..?షర్మిల పార్టీ ప్రభావంతో టిఆర్ఎస్ పతనమైనా..?Political {#}dr rajasekhar;Telangana;history;Service;Sharmila;Party;Government;Andhra PradeshSun, 11 Jul 2021 11:05:00 GMTరాజకీయ పార్టీలకు మన దేశంలో కొదవలేదు. ప్రజా సేవ చేయడానికి చాలా పార్టీలు  జనాల్లోకి రావచ్చు. దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు వెలుస్తున్నాయి. ఈ పార్టీలన్నీ  దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చరిత్ర గల పార్టీలను డీ కొడతాయా.. తెలంగాణలో ఇప్పటికే చాలా మంది నాయకులు ప్రాంతీయ పార్టీలు  పెట్టుకున్నారు. ఈ పార్టీ తెలంగాణలో సుదీర్ఘ చరిత్ర గల పార్టీలను ఢీ కొట్టి నిలబడ తాయా.. ప్రజలు షర్మిల పార్టీకి మద్దతు ఇస్తారా ఇవ్వరా  అనేది మనకు రాబోవు రోజుల్లో కనబడుతుంది.
రాజకీయ పార్టీలు అంటేనే ప్రజల యొక్క పాలనకు సంబంధించి సమగ్రమైన సిద్ధాంతంతో పని చేసే అటువంటి భావజాలం కలిగి ఉన్న సమూహాలు. గతంలో రాజకీయ పార్టీలుగా ఉండి ప్రజల ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చిన కొన్ని పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టించారు. తామే పాలకుల మని ప్రజలను ఇబ్బంది గురిచేసిన పార్టీలకు పతనం తప్పదని చెప్పవచ్చు. ఓట్ల కొరకు మాత్రమే ప్రజలను వాడుకొని, వారి అవసరాలు తీరాక అనేక అక్రమాలకు తెర లేపుతూ ప్రజల అవసరాలను గాలికొదిలేసిన పార్టీలు ఎన్నో ఉన్నాయి.  ఇందులోనే జాతీయ పార్టీలు మాత్రం ప్రచారం లోనూ పాలన లోను దేశమంతా ఉంటాయి.

 కానీ ప్రాంతీయ పార్టీలు మాత్రం ఒకటి రెండు రాష్ట్రాలలో తప్ప ఇంకెక్కడా కనిపించవు. తెలంగాణ విషయానికొస్తే  తెలంగాణ రాష్ట్రం పత్రిక ఆకాంక్ష కొరకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో వివక్షకు గురైందని పోరాడి స్వయంగా సాధించుకున్న రాష్ట్రం. దీనికి మొదటి నుంచి ప్రాతినిధ్యం వహించిన టిఆర్ఎస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ నినాదంతోనే   గద్దెనేక్కింది. స్వయం ప్రతిపత్తి తో పాలన కూడా మొదలు పెట్టింది. కానీ పరిపాలనను మాత్రం తెలంగాణ రాష్ట్రానికి అంతగా లబ్ధి జరగలేదని ప్రజల్లో ఒక అపోహ మిగిలింది.
అలాగే కెసిఆర్ పాలన తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలైన టువంటి కాంగ్రెస్, బిజెపి, సిపిఐ, సిపిఎం మిగతా చిన్న పార్టీల యొక్క  అభిప్రాయాన్ని కూడా గౌరవించకుండా మొండివైఖరి వెళుతుందని, అలాగే భూ దందాలు, నిర్బంధాలు, జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు  ఇలాంటి వాటికి ప్రభుత్వం పాల్పడుతూ  ప్రజల్లో అందరినీ ఒకింత ఇబ్బందులకు గురి చేసిందని చెప్పవచ్చు.


 ఇదే అదునుగా చూసినటువంటి షర్మిల తెలంగాణలో పార్టీ స్థాపన కోసం  గత  కొద్ది రోజుల నుండి సమీకరణాలు జరిపి  తెలంగాణలో అసంతృప్తిగా ఉన్నటువంటి నాయకులను తమ వైపు తిప్పుకొని  పార్టీని తెలంగాణలో ముందుకు తీసుకురావాలనే  సమీకరణాలు చేస్తోందని తెలుస్తోంది. ఆ దశలోనే గత కొన్ని నెలల నుంచి రాష్ట్రంలో అన్ని జిల్లాలలో తమ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను ఏర్పాటు చేసుకొని ఎనిమిదో తేదీన వేల మంది కార్యకర్తలతో తెలంగాణలో పార్టీ స్థాపించింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి  ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు  చేసినటువంటి అభివృద్ధి పనులను  తమ అస్త్రాలుగా వాడుకుంటూ పార్టీని బలోపేతం చేసే దిశలో షర్మిల ముందుకు వెళుతోంది. ఇదే సమయంలో తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష తో  ఉద్యమాలు చేసి దానికి అండగా నిలిచిన టిఆర్ఎస్ పార్టీ, కెసిఆర్ ను  రెండుసార్లు విజయతీరాలకు తీసుకెళ్లారు. కానీ గత కొద్ది రోజులుగా తెలంగాణలో  అణచివేత ఎక్కువైందని ప్రజలలో అసమ్మతి మొదలైందని తెలుస్తోంది. ఈ అసమ్మతి ఇతర పార్టీలకు లాభంగా  మారుతున్నాయని అనుకోవచ్చు. గతంలో  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వివక్షకు గురైనటువంటి తెలంగాణ ప్రజానీకం మళ్లీ షర్మిలను నమ్ముతుందా. ఆ పార్టీ  తెలంగా ణలో ఇంతవరకు తన ముద్రను వేసుకుంటుందో వేచి చూడాలి.



కృష్ణపట్నం ఆనందయ్య ఎమ్మెల్సీ అవుతారా ?

కేసీఆర్ విష‌యంలో.. రేవంత్ రెడ్డిది జోస్య‌మా... వ్యూహ‌మా?

విశాఖ ఉక్కుపై కేంద్రం ముంద‌డుగు?

యూట్యూబర్ పై భారత్ నిషేధం.. ఎందుకో తెలుసా?

టీ టీడీపీ కొత్త అధ్య‌క్షుడు ఆయ‌నేనా ?

నేడే తొలి తెలుగు మహిళ అంతరిక్ష ప్రయాణం

నోరు జారిన మరో తెలంగాణ మంత్రి.. వైరల్ వీడియో?

పూనం కౌర్ టార్గెట్ ఎవరు? ఆ కామెంట్స్ అర్థమేంటి?

అక్కడ ఏమీ లేదు.. కేసిఆరే రాద్ధాంతం చేస్తున్నారు: సజ్జల



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>