PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/cm-jagan7c61e075-a08d-4947-bca0-6abaa568397e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/cm-jagan7c61e075-a08d-4947-bca0-6abaa568397e-415x250-IndiaHerald.jpgఇచ్చిన హామీలే కాదు, ఇవ్వని హామీలు కూడా అమలు చేస్తున్నాం అంటూ వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకోవడం వింటూనే ఉన్నాం. కరోనా కష్టకాలంలో నగదు బదిలీలతో పేదల్ని ఆదుకుంటున్న ఏపీ సీఎం జగన్, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారనడంలో ఎలాంటి సందేహం లేదు. పథకం పేరేదయినా, నిరుపేదలకు సకాలంలో ఆర్థిక సాయం అందించడం, అది కూడా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, నేరుగా అకౌంట్లలోకి డబ్బులు బదిలీ చేయడం విశేషమే. అయితే అదే సమయంలో ఉద్యోగుల జీతాలు ఆలస్యం కావడం విచారకరం. cm jagan{#}Andhra Pradesh;Government;CM;TDP;News;YCP;Coronavirus;CBNఅన్నీ చేస్తున్న జగన్.. అక్కడ బోల్తా పడ్డారు.అన్నీ చేస్తున్న జగన్.. అక్కడ బోల్తా పడ్డారు.cm jagan{#}Andhra Pradesh;Government;CM;TDP;News;YCP;Coronavirus;CBNSat, 10 Jul 2021 07:03:39 GMTఇచ్చిన హామీలే కాదు, ఇవ్వని హామీలు కూడా అమలు చేస్తున్నాం అంటూ వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకోవడం వింటూనే ఉన్నాం. కరోనా కష్టకాలంలో నగదు బదిలీలతో పేదల్ని ఆదుకుంటున్న ఏపీ సీఎం జగన్, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారనడంలో ఎలాంటి సందేహం లేదు. పథకం పేరేదయినా, నిరుపేదలకు సకాలంలో ఆర్థిక సాయం అందించడం, అది కూడా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, నేరుగా అకౌంట్లలోకి డబ్బులు బదిలీ చేయడం విశేషమే. అయితే అదే సమయంలో ఉద్యోగుల జీతాలు ఆలస్యం కావడం విచారకరం.

ఈ నెల పదో తేదీ వచ్చినా ఇంకా కొన్ని విభాగాల ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాల చెల్లింపులు జరగలేదు. ప్రతి నెలా ఒకటోతేదీ ఠంచనుగా నిరుపేదలకు సామాజిక పెన్షన్ అందించే సీఎం జగన్, పెన్షన్ డబ్బులతోనే జీవితాన్ని గడిపే రిటైర్డ్ ఉద్యోగుల సంగతి ఎందుకు పట్టించుకోవడంలేదు. కరోనా కష్టకాలంలో నిధులెక్కడినుంచి వస్తాయి, కాస్త ఆలస్యమైతే సర్దుకోలేరా అనే సమాధానం వినిపిస్తోంది. నిజంగా ఇది సమర్థనీయమేనా. సంక్షేమ కార్యక్రమాల అమలుకోసం నిధులు కేటాయిస్తున్న సమయంలో, ఉద్యోగుల జీతాలు, పెన్షనర్లకు నిధులు నిండుకున్నాయంటే ఎలా..? కనీసం ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ముందస్తు సమాచారం కూడా లేకపోవడంతో చాలామంది ఉద్యోగులు, పెన్షనర్లు ఇబ్బందులు పడుతున్నారు.

కరోనా కష్టకాలంలో దాదాపుగా పేద, మధ్యతరగతివారంతా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. ప్రభుత్వాలు కూడా ఆర్థిక కష్టాల్లో ఇరుక్కున్నాయి. అటు కేంద్రం మాత్రం ఇంధన రేట్లను భారీగా పెంచి ఖజానా నింపుకుంటోంది. దానిపై వచ్చే ట్యాక్స్ తో రాష్ట్రాలు కూడా పండగ చేసుకుంటున్నాయి. పరోక్షంగా నిత్యావసరాల ధరలు పెరిగి, పేద, మధ్యతరగతి మరింత కుంగుబాటుకి గురవుతోంది. ఈ దశలో రాష్ట్రాలకు అప్పు పుట్టడమే కష్టంగా మారింది. చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి వెళ్లారు, ఆ తప్పులన్నీ ఇప్పుడు సరిదిద్దుకుంటున్నామంటూ వైసీపీ కవర్ చేసుకోవాలనుకోవచ్చు. రెండేళ్ల పాలన తర్వాత కూడా ఇంకా చంద్రబాబుపై సాకు చెప్పడం మాత్రం సరైన పద్ధతి కాదు.

ఏపీతోపాటు దాదాపు అన్ని రాష్ట్రాలు కరోనా కష్టాల్లో ఉన్నాయి, మరి ఏపీలాగా ఇతర రాష్ట్రాల్లో కూడా జీతాలు ఆలస్యమవుతున్న సందర్భాలు మాత్రం లేవు. ఒకవేళ ఉంటే కచ్చితంగా ఆయా రాష్ట్రాలను ఉదాహరణగా చెప్పి వైసీపీ, తన తప్పుని సరిదిద్దుకోవాలనుకునేది. మరి ఏపీకే ఎందుకీ సమస్య. ఓవైపు సంక్షేమ పథకాలు సజావుగా అమలవుతున్నాయి కదా, ఉద్యోగుల జీతాలెందుకు ఆలస్యం అవుతున్నాయి? అభివృద్ధి, సంక్షేమాన్ని ఆపాలని ఎవరూ కోరుకోరు కానీ, అదే సమయంలో ప్రభుత్వం తనకు తానే ఇలా విమర్శలు ఎదుర్కోవాల్సి రావడం మాత్రం విచారకరం. పరోక్షంగా ప్రతిపక్షాలకు ఓ అస్త్రాన్ని జగనే సిద్దం చేసి ఇచ్చినట్టవుతోంది. మా హయాంలో ఇలా జరగలేదు, మీరొచ్చాకే కష్టాలన్నీ అంటూ టీడీపీ విమర్శలు ఎక్కుపెడుతోంది. ఇలాంటి అపవాదులనుంచి తప్పించుకోవాలంటే.. ఇకనైనా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఉద్యోగ వర్గాలనుంచి విమర్శలు రాకుండా కాచుకోవాలి.



మరి కాసేపట్లో వీర జవాన్ అంత్యక్రియలు..

ప్రాథమిక హక్కు అంటే ఏమిటో తెలుసుకుందామా..?

కేసీఆర్‌ ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా..? ‍

అప్పుల అప్పారావులు.. మన కేంద్ర మంత్రులు..

రేవంత్‌రెడ్డికి కొత్త పేరు పెట్టిన రోజా... పంచ్ పేలిందిగా..!

నాని నాగచైతన్యల వైపు చూస్తున్న ఇండస్ట్రీ !

కేసీఆర్ అంటే జగన్ కి, జగన్ అంటే కేసీఆర్ కు చాలా ఇష్టం!

క‌రోనా థ‌ర్డ్‌వేవ్‌... ఈ ఆరోగ్య‌ స‌మ‌స్య వారికి డేంజ‌రే...!

ఎందుకు ఈ వైరస్‌లన్నీ కేరళతోనే మొదలవుతాయి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>