MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-sunil1274ab12-56e6-466f-b97e-9cd245569cd9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-sunil1274ab12-56e6-466f-b97e-9cd245569cd9-415x250-IndiaHerald.jpgకమెడియన్, హీరో, విలన్ సునీల్ కు మంచి రోజులొస్తున్నాయి. రాబోయో రోజుల్లో ప్రాధాన్యమున్న ప్రాజెక్ట్ ల్లో ఆయన కనిపించడమే కాదు... పేరు తీసుకొచ్చే పాత్రలు పోషించబోతున్నాడు. ఎవరైనా జీవితంలో యూటర్న్ అనేది ఒకసారి తీసుకుంటారు. కానీ.. విలక్షణ నటుడు సునీల్‌ మాత్రం రెండు మూడుసార్లు అలా చేశాడు. tollywood sunil{#}Chittoor;U Turn;sunil;Rajamouli;Darsakudu;Directorసునీల్ కు మంచి రోజులొస్తున్నాయ్..!సునీల్ కు మంచి రోజులొస్తున్నాయ్..!tollywood sunil{#}Chittoor;U Turn;sunil;Rajamouli;Darsakudu;DirectorSat, 10 Jul 2021 20:15:00 GMTకమెడియన్, హీరో, విలన్ సునీల్ కు మంచి రోజులొస్తున్నాయి. ఇన్నాళ్లూ ఆయన్ను కష్టకాలం వెంటాడింది. రాజమౌళి ఏమని హీరోగా పరిచయం చేశాడో.. అప్పటి నుంచి ఆయనకు పెద్దగా ఛాన్సులు రాలేదు. అనుకున్నంత గొప్ప పాత్రలేమి రాలేదు. దీంతో చాలా డిసప్పాయింట్ అయిపోడు సునీల్. గడిచింది గడిచిపోయింది.. రాబోయో రోజుల్లో ప్రాధాన్యమున్న ప్రాజెక్ట్ ల్లో ఆయన కనిపించడమే కాదు... పేరు తీసుకొచ్చే పాత్రలు పోషించబోతున్నాడు.

ఎవరైనా జీవితంలో యూటర్న్ అనేది ఒకసారి తీసుకుంటారు. కానీ.. విలక్షణ నటుడు సునీల్‌ మాత్రం రెండు మూడుసార్లు అలా చేశాడు. హాస్యనటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.  హీరోగా టర్న్‌ అయిన తర్వాత అందాలరాముడు... మర్యాదరామన్న.. పూలరంగడుతో మంచి విజయాలందుకున్నాడు.  అయితే ఆ తర్వాత హీరోగా నటించినా ఆయనకు ఆశించినంత ఫలితాలు రాలేదు. ఆ సినిమాలేవి హిట్ కాకపోవడంతో చాలా డిసప్పాయింట్ అయ్యాడు. మళ్లీ కమెడియన్‌గా యు టర్న్‌ తీసుకున్నాడు.

సెకండ్‌ ఇన్నింగ్స్‌లో కమెడియన్‌గా నటించిన సినిమాలేవీ  గుర్తింపు తీసుకురాకపోవడంతో.. విలన్‌గా మారాడు. డిస్కోరాజా.. కలర్‌ఫొటోలో నెగిటివ్‌ షేడ్స్ చూపించినా.. క్రేజీ విలన్‌ కాలేకపోయాడు. దీంతో మరోసారి రూటు మార్చి... ఇంపార్టెంట్ రోల్స్‌ పోషిస్తున్నాడు.  'పుష్ప' చిత్రంలోనెగెటివ్ షేడ్స్ ఉన్న పవర్ ఫుల్ రోల్ సునీల్ పోషిస్తున్నాడని  సమాచారం. హీరోహీరోయిన్లు మాదిరి  చిత్తూరు యాసలో మాట్లాడనున్నారట. లాక్ డౌన్ కు ముందే వీరి కాంబినేషన్ లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించడంతో.. గెటప్‌ కూడా డిఫరెంట్‌గా వచ్చిందని టాక్‌.

యాక్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తీసి హిట్స్ కొడుతున్న అనిల్‌ రావిపూడి దృష్టిలో సునీల్ పడ్డాడు. ఎఫ్‌3 సినిమాలో సునీల్‌  లెంగ్తీ రోల్‌ ఇచ్చాడట. ఎఫ్‌2లో వెంకటేశ్‌, వరున్‌తేజ్‌ క్యారెక్టర్స్ హైలైట్‌ అయినట్టే.. ఎఫ్‌3లో సునీల్‌ రోల్‌ హైలైట్‌ అవుతుందని దర్శకుడు చెబుతున్నాడు. అప్‌కమింగ్‌ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఒక్కటి క్లిక్‌ అయినా.. సునీల్‌ లైన్లో పడినట్టే.  ఆయన కెరీర్ బాగుండాలని ఆల్ ది బెస్ట్ చెబుదాం.



బాహుబలి మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ ఛాయిస్ కీరవాణి కాదా ... ??

విజువల్స్ తో ఆకట్టుకుంటున్న ధింసారే ధింసా సాంగ్...

జయప్రద కి ముద్దు పెట్టిన స్టార్ హీరో బయట పెట్టిన నటుడు..!!

మన హీరోలు మంచి కధలు కూడా చెబుతారు... ?

'బాహుబలి'గురించి ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు..!!

అమ్మో.. ఆ సినిమాకి 'ప్రదీప్' అంత తీసుకున్నాడా..?

వచ్చే సంవత్సరంలో పవన్ కళ్యాణ్ ఇన్ని సినిమాలు చేస్తున్నాడా..?

"రాజమౌళి సినిమాలో పని చేయకపోడానికి కారణం అదే" : రామ్ లక్ష్మణ్

ఆర్యన్ రాజేష్ భార్య గురించి ఎవరికి తెలియని విషయాలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>