SpiritualityVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/spirituality/pisces_pisces/spirituality93763058-c8e8-40f0-acaf-0d84d99aacc1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/spirituality/pisces_pisces/spirituality93763058-c8e8-40f0-acaf-0d84d99aacc1-415x250-IndiaHerald.jpgమహాశివుని యొక్క జ్యోతిర్లింగం, అమ్మవారి శక్తి పీఠం ఒకే దగ్గర వెలసిన అత్యంత అద్భుతమైన పుణ్యక్షేత్రం శ్రీశైల క్షేత్రం. నల్లమల అడవులలో కొలువై ఉన్న ఈ శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రము ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి కావడం మరో విశేషం. ఒక్క శ్రీశైల క్షేత్రంలోనే అతిపెద్ద ఆకారం కలిగిన బసవయ్య ఉన్నాడు. శనగల బసవన్నగా నందీశ్వరునికి ఒక ప్రత్యేకత ఉంది. SPIRITUALITY{#}bhavana;Nallamala Forest;Shakti;sree;Indiaఇష్టకామేశ్వరి దేవి ప్రత్యేకత ఇదే ?ఇష్టకామేశ్వరి దేవి ప్రత్యేకత ఇదే ?SPIRITUALITY{#}bhavana;Nallamala Forest;Shakti;sree;IndiaSat, 10 Jul 2021 08:40:00 GMTశక్తి పీఠం ఒకే దగ్గర వెలసిన అత్యంత అద్భుతమైన పుణ్యక్షేత్రం శ్రీశైల క్షేత్రం. నల్లమల అడవులలో కొలువై ఉన్న ఈ శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రము ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి కావడం మరో విశేషం. ఒక్క శ్రీశైల క్షేత్రంలోనే అతిపెద్ద ఆకారం కలిగిన బసవయ్య ఉన్నాడు. శనగల బసవన్నగా నందీశ్వరునికి ఒక ప్రత్యేకత ఉంది. ఎంతో కష్టంలో ఉన్న వారైనా సరే.. అస్సలు ఇంక ఆ సమస్యకు పరిష్కారమే లేని తరుణంలో..అసలు ఎలా ఈ సమస్య నుండి బయట పడాలి అని అనుకునేవాళ్లకి ఒకటే ఒక పరిష్కార మార్గం ఉందని సంప్రదాయం ఇప్పటికీ చెబుతోంది. నేరుగా శ్రీశైలానికి వెళ్లి నందీశ్వరునికి నమస్కారం చేసుకొని ఆయన చెవిలో మెల్లగా మన సమస్యను విన్నవిస్తే చాలు ఇక ఆ సమస్య తొలగి పోయినట్లే. ఖచ్చితంగా ఆ సమస్య తీరి మనకు అంతా మంచే జరుగుతుంది. చెవిలో చెబితే సమస్యలు పరిష్కారం అయ్యే క్షేత్రం శ్రీశైల క్షేత్రం ఒక్కటే. ఇక్కడ ఇష్ట కామేశ్వరి మాత మరో ప్రత్యేకత.

భారతదేశం మొత్తం మీద ఇష్ట కామేశ్వరి అన్న మాట లేదు. అయితే ఒక్క శ్రీశైలంలోనే ఇష్ట కామేశ్వరిగా అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. శ్రీశైలంలో ఇష్ట కామేశ్వరి ఆలయం చాలా ప్రాచీనమైనది. ప్రస్తుతం అది చాలా శిధిల అవస్థలో ఉంది.  ఇక్కడ అమ్మవారు నాలుగు చేతులతో దర్శనమిస్తారు. ఒక చేతిలో రుద్రాక్ష మాల ..మరొక చేతిలో శివలింగం పట్టుకుని ఉంటారు. మిగిలిన రెండు చేతులతో వైష్ణవ సంప్రదాయంలో పద్మములను చేత పట్టుకుని ఉంటారు. అమ్మవారి ఈ రూపం దేశంలో మరెక్కడా లేదు. అయితే ఎవరైతే శ్రీశైలంలోని ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శించుకుని వారి కోర్కెలను అమ్మవారితో మొర పెట్టుకుంటారో వారి కోర్కెలను ఇష్టకామేశ్వరి మాత తప్పక నెరవేరుస్తారని ప్రతీతి. భక్తుల ఇష్ట కార్యాలను అమ్మవారు సిద్ధించేలా చేస్తుంది కనుకనే ఇక్కడ అమ్మవారిని ఇష్టకామేశ్వరి అంటారు అని చెబుతారు.

అలా వారి కోర్కెలు తీరిన వారు తిరిగి ఆలయానికి వచ్చి వారి మొక్కులను తీరుస్తుంటారు.  అంతే కాకుండా ఇక్కడ అమ్మవారి విగ్రహానికి కుంకుమ బొట్టు పెడితే మానవ శరీరానికి మెత్తగా తగులుతుంది. ఇది ఎంతో ఆశ్చర్యకరమైన విషయం.. ఇది అమ్మవారి విగ్రహమా లేక మానవత రూపమా అన్న భావన కలుగుతుంది.  ఇలా శ్రీశైల పుణ్యక్షేత్రంలో ఎన్నో రహస్యాలు, వింతలు దాగి ఉన్నాయి.


యశ్ ఫోకస్ మార్చాడే... అసలు కథేంటో?

బాయ్ ఫ్రెండ్ కి చికెన్ తినిపించిన శృతిహాసన్.. వైరల్ అవుతున్న వీడియో..!!

ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్న మెగాస్టార్...

బాల‌య్య విగ్గు స్పెషాలిటీ ఏంటి.. ఇంత ఖ‌రీదా...!

క‌రోనా థ‌ర్డ్‌వేవ్ వ‌చ్చేస్తోంది.. ఆర్ నాట్ విలువ చెప్పేస్తోంది..!

హీరోలు, డైరెక్టర్ లే కాదు.. ఇప్పుడు అరవ విలన్ లు కూడా?

ప్రపంచ జనాభా దినోత్సవం 2021 ప్రాముఖ్యత ఇదే ?

ఆ డైరెక్ట‌ర్‌కు మ‌ళ్లీ ఛాన్స్ ఇస్తోన్న బాల‌య్య .. ఈ సారైనా హిట్ ఇస్తాడా ?

రెండో డోస్ తీసుకోకపోతే ఏం జరుగుతుంది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>