Telangana
oi-Madhu Kota
తెలంగాణలో కరోనా పరిస్థితులు దాదాపు అదుపులోకి వచ్చాయి. కొత్త కేసులు భారీగా తగ్గి, రికవరీలు పెరిగాయి. మరణాలు కూడా గతంలో కంటే తక్కువగా నమోదవుతున్నాయి. అయితే, కరోనాపై ప్రభుత్వాలకు సంపూర్ణ అవగాహన కరువైందని, ఏ వేరియంట్, ఏ వేవ్, ఎప్పడొస్తదో ఎందుకు వస్తదో ఎంత వరకు విస్తరిస్తదో తెలియట్లేదు కాబట్టి సర్వత్రా అప్రమత్తత అవసరమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వివరాలివి..
వైఎస్సార్ ద్రోహి, ఆయన వారసులనూ నమ్మొద్దు -ఆంధ్రా తొత్తులకు స్థానం లేదు :షర్మిలపై హరీశ్ రావు ఫైర్
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం వెల్లడించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 1,00,632 శాంపిళ్లను పరీక్షించగా, కొత్తగా 704 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6, 31, 218కి పెరిగింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్‌లో 77, నల్లగొండలో 64, కరీంనగర్‌లో 55, వరంగల్ అర్బన్‌లో 47, మంచిర్యాలలో 46, ఖమ్మంలో 44, పెద్దపల్లిలో 37 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ వివరించింది.

నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో కరోనా కాటుకు ఐదుగురు బలైపోయారు. ఇప్పటిదాకా చోటుచేసుకున్న కొవిడ్ మరణాల సంఖ్య 3,725కు పెరిగింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.59 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 917 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 6,31,218కు పెరిగింది. తెలంగాణలో రికవరీ రేటు 97.17శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,724 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇదిలా ఉంటే,
ఏ వేవ్, ఎప్పడొస్తదో తెలియట్లేదు -ప్రభుత్వాలకూ అవగాహన కరువు -మళ్లీ ఫీవర్ సర్వే: కరోనాపై కేసీఆర్
రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, నియంత్రణ, వైద్యారోగ్య పరిస్థితుల పై ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం రాత్రి నిర్వహించిన సమీక్షలో కీలక ఆదేశాలిచ్చారు. కరోనాను గుర్తించి ముందస్తు కట్టడి చేసి, ఇప్పటికే విజయవంతంగా నిర్వహించిన ఫీవర్ సర్వేను మరోసారి రాష్ట్రంలో కరోనా ప్రభావిత ప్రాంతాల్లో నిర్వహించాలని ఆదేశించారు. కరోనా కట్టడి, నియంత్రణపై ప్రభుత్వాలకే అవగాహన కరువైందని, ఎప్పుడు ఏ వేవ్, ఏ వేరియంట్ పుట్టుకొస్తుందో చెప్పలేమని సీఎం అన్నారు.
English summary
Telangana reports 704 new COVID-19 cases, 917 recoveries and 5 deaths in the last 24 hours according to state health department bulletin released on saturday. as of now Total recoveries increased to 6,16,769, Death toll to 3725 and Active cases are 10,724. cm kcr has ordered officials to conduct fiver survey in telangana.
Story first published: Saturday, July 10, 2021, 20:03 [IST]