PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/telangana-politics53513d28-fd84-4844-917e-21d63cf7f9a7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/telangana-politics53513d28-fd84-4844-917e-21d63cf7f9a7-415x250-IndiaHerald.jpgమాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఎపిసోడ్‌ అనంతరం తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈటల రాజేందర్‌ ప్రభావమో లేక రాజకీయ ఎత్తుగడో తెలీదు కానీ... ప్రజల్లోకి వెళ్లటం, అభివృద్ధి పనులపై దృష్టి పెట్టడం, దళితులకు వరాలు ఇవ్వడం లాంటివి ఇలా చాలా కొత్తగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ లో కనిపిస్తున్నాయి. అంతేకాదు.. బీసీ నేత అయిన ఈటల రాజేందర్‌.. టీఆర్‌ఎస్‌ నుంచి వెళ్లడంతో... ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు కేసీఆర్‌ వ్యూహాలు కూడా రచించారు. ఇందులో భాగంగానే మాజీ తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు ఎల్‌. రమణకు గాలం వేసినట్లు గానే పcm kcr{#}kavitha;ramana;Backward Classes;Jagtial;రాజీనామా;Assembly;Telangana;Minister;CM;Newsఎల్ రమణకు కేసీఆర్ చెక్... జగిత్యాల బరిలో కవిత!ఎల్ రమణకు కేసీఆర్ చెక్... జగిత్యాల బరిలో కవిత!cm kcr{#}kavitha;ramana;Backward Classes;Jagtial;రాజీనామా;Assembly;Telangana;Minister;CM;NewsSat, 10 Jul 2021 19:36:47 GMTమాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఎపిసోడ్‌ అనంతరం తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈటల రాజేందర్‌ ప్రభావమో లేక రాజకీయ ఎత్తుగడో తెలీదు కానీ... ప్రజల్లోకి వెళ్లటం, అభివృద్ధి పనులపై దృష్టి పెట్టడం, దళితులకు వరాలు ఇవ్వడం లాంటివి ఇలా చాలా కొత్తగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ లో కనిపిస్తున్నాయి. అంతేకాదు.. బీసీ నేత అయిన ఈటల రాజేందర్‌.. టీఆర్‌ఎస్‌ నుంచి వెళ్లడంతో... ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు కేసీఆర్‌ వ్యూహాలు కూడా రచించారు. ఇందులో భాగంగానే మాజీ తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు ఎల్‌. రమణకు గాలం వేసినట్లు గానే పొలిటికల్‌ సర్కిల్‌లో ఓ చర్చ జరుగుతోంది.

అలాగే... ఎల్‌. రమణ టీఆర్‌ఎస్‌లోకి వస్తే... ఈటల రాజేందర్‌ స్థానాన్ని భర్తీ చేస్తాడని గులాబీ బాస్‌ ఆలోచించారట. అంతేకాదు... అవసరమైతే... హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో ఎల్‌. రమణను టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలోకి దించుతారనే వార్తలు కూడా వస్తున్నాయి. మొత్తానికి ఎల్‌. రమణను ఉన్నఫలంగా... గులాబీ బాస్ ఎందుకు అహ్వానించారనే ప్రశ్న అందరి మెదళ్లలో మెదులుతోంది. అయితే.. గులాబీ అసలు స్కెచ్‌... హుజురాబాద్‌ ఉప ఎన్నిక అసలు కాదట. ఆయన టార్గెట్‌.. ఆపరేషన్‌ జగిత్యాల అని సమాచారం. అవును...తన కూతురు కల్వకుంట్ల కవితను వచ్చే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి బరిలోకి దించాలని కేసీఆర్‌ ఆలోచిస్తున్నారట.

దాని కోసం గ్రౌండ్‌ వర్క్‌ ఇప్పటి నుంచే సిద్ధం చేస్తున్నారట. అందులో భాగంగానే ఎల్‌. రమణకు గాలం వేశారని... రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే.. టీఆర్‌ఎస్‌ అధినేత కూతురు కవిత కోసం అవసరమైతే.. తాను రాజీనామా కూడా చేస్తానంటూ ఇప్పటికే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ గతంలో ప్రకటించిన సంగతి విదితమే. జగిత్యాల నుంచి కవితను గెలిపించుకుంటామని... ఒకవేళ కవిత ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే జగిత్యాల నుంచే పోటీ చేయమని కోరతానని సంజయ్‌ గతంలోనే చెప్పారు. వీటన్నింటిని లెక్కలు వేసిన సీఎం కేసీఆర్‌... జగిత్యాల నుంచి కవితను బరిలో దింపనున్నారని తెలుస్తోంది. అయితే.. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.



కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. కవిత కోసం గ్రౌండ్ వర్క్?

ఏపీలో భారీ అగ్ని ప్రమాదం

కృష్ణాజ‌లాల వివాదంపై క్లారిటి ఇచ్చిన మంత్రి కేటీఆర్‌...?

'నారప్ప' నుండి అదిరిపోయే అప్డేట్ రేపే..?

ఈ నెల 14న పోల‌వ‌రం వెళ్ల‌నున్న ఏపీ సీఎం

ఎన్టీఆర్ దంప‌తుల‌తో మెగాస్టార్ దంప‌తులు.. ఈ ఫొటో వెన‌క ఇంట్ర‌స్టింగ్ స్టోరీ..!

విశాఖ ఏజెన్నీలో అడ్డ‌గోలుగా మైనింగ్ చేసింది ఆయ‌నే - వైసీపీ ఎమ్మెల్యే

విమర్శలపై స్పందించిన సురేష్ బాబు.. !

యంగ్ హీరో సరసన నటించనున్న వంటలక్క..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>