PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jika-virus-in-keralaf44f3e64-395e-45af-93f2-f9f256cd8aec-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jika-virus-in-keralaf44f3e64-395e-45af-93f2-f9f256cd8aec-415x250-IndiaHerald.jpgల్లోలం సృష్టించిన కరోనాను ప్రజలు మరువకముందే బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, డెల్టా వైరస్ ప్రజల ప్రాణాలను బలితీసుకున్నాయి. తాజాగా మరోవైరస్ ప్రజల్లో గుబులు రేపుతోంది అదే జికా వైరస్. జికా వైరస్‌ బారిన పడకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని కేరళ ప్రభుత్వం పేర్కొంది. అదేవిధంగా కేరళ పొరుగు రాష్ట్రమైన కర్ణాటక కూడా జికా వైరస్‌ వ్యాప్తి విషయంలో అప్రమత్తమైంది. ముఖ్యంగా కేరళలో ఓ 24ఏళ్ల వయసున్నగర్భిణిలో జికా వైరస్ లక్షణాలు బయటపడ్డాయి.jika virus in kerala{#}mosquitos;Kerala;Government;central governmentముంచుకొస్తున్న మరో ముప్పు.. అక్కడ హై అలర్ట్ !ముంచుకొస్తున్న మరో ముప్పు.. అక్కడ హై అలర్ట్ !jika virus in kerala{#}mosquitos;Kerala;Government;central governmentSat, 10 Jul 2021 19:43:06 GMTఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించింది. లక్షలాది ప్రాణాలను బలితీసుకొంది. లక్షలాది మందిని ఆస్పత్రిపాలు చేసి వారి ఆరోగ్యంతో చెలగాటమాడింది. అంతేకాదు పేదరికంలో ఉన్న వారిని మరింత కుందీసింది. ఆర్థి వ్యవస్థలు కుదేలయిపోయాయి. ప్రభుత్వాల ఖజానాలు ఖాళీ అయ్యాయి. వైరస్ ను అరికట్టేందుకు ప్రభుత్వాలు చేపట్టిన లాక్ డౌన్ తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతేకాదు చాలా మంది ఉపాధిని కూడా కోల్పోయారు. ఇంత కల్లోలం సృష్టించిన కరోనాను ప్రజలు మరువకముందే బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, డెల్టా వైరస్ ప్రజల ప్రాణాలను బలితీసుకున్నాయి. తాజాగా మరోవైరస్ ప్రజల్లో గుబులు రేపుతోంది అదే జికా వైరస్.

జికా వైరస్‌ బారిన పడకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని కేరళ ప్రభుత్వం  పేర్కొంది. అదేవిధంగా కేరళ పొరుగు రాష్ట్రమైన కర్ణాటక కూడా జికా వైరస్‌ వ్యాప్తి విషయంలో అప్రమత్తమైంది. ముఖ్యంగా కేరళలో ఓ 24ఏళ్ల వయసున్నగర్భిణిలో జికా వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. అనుమానమొచ్చి ఆమెతో సహా మరికొంతమంది శాంపిళ్లను తీశారు. వాటిని పుణేలోని వైరాలజీ ల్యాబ్ కు పంపించారు. ఆ రిపోర్ట్ ల్లో భయాన్ని కొలి విషయాలు బయటపడ్డాయి. 14మందికి జికా సోకినట్టు వెల్లడయింది. అయితే ఈ వైరస్ అంతప్రమాదకరం కాదంటున్నారు. కానీ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

జికా వైరస్ వెలుగు చూడటంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఆరుగురు నిపుణులతో కూడిన టీమ్ ను కేరళ రాష్ట్రానికి పంపించింది. ఈ విషయంలో కేరళ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంటుందని సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది. మరోవైపు కేరళ ప్రభుత్వం కూడా జికా వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. వైద్య పరీక్షలను వేగవంతం చేసింది.  

డెంగీని వ్యాప్తి చేసే ఎడిస్ ఈజిప్టి దోమ జికా వైరస్ ప్రభావానికి గురై.. మనుషులను కుట్టడం వల్లే ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. మనుషుల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువైతే.. రక్తంలోని ప్లేట్ లెట్స్ సంఖ్యాపరంగా పడిపోవడం, మెదడుకు సోకి మూర్చ రావడంలాంటివి జరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. అంతేగాదు నోటి నుంచే కాకుండా మూత్రంలో రక్తం పడే లక్షణాలు ఉంటాయంటున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.  దానిద్వారా డెంగీతో పాటు జికాను కంట్రోల్ చేయవచ్చని సూచిస్తున్నారు.






జగన్ మాస్టర్ ప్లాన్ సక్సెస్ అయితే... ?

బిజినెస్: రూ.12 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. కోట్లల్లో రాబడి..

జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఇద్దరు పిల్లల్నే కనండి.. లేకపోతే అవి కట్..!

అమెరికాకు సుజ‌నా చౌద‌రి.. వెన‌క్కి వ‌స్తారా?

జికా వైరస్ లేటెస్ట్ అప్డేట్... ఎన్ని కేసులు అంటే?

కృష్ణాజ‌లాల వివాదంపై క్లారిటి ఇచ్చిన మంత్రి కేటీఆర్‌...?

మళ్ళీ లాక్ డౌన్ పొడిగింపు !

జ‌గ‌న్ చిత్త‌శుద్ధికి ఇది అగ్ని ప‌రీక్షే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>