MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/farhan-akthar-movie-in-dispute0ee63468-6411-4c90-9499-28203904df6e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/farhan-akthar-movie-in-dispute0ee63468-6411-4c90-9499-28203904df6e-415x250-IndiaHerald.jpgమాములుగా కొన్ని సినిమాలు రకరకాల వివాదాల కారణంగా విడుదల లేట్ అవ్వడం అలాగే కొన్ని సినిమాలు అసలు విడుదల కాకపోవడం జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే ఒక సినిమాకు ఎదురయ్యేలా ఉంది. ఈ సినిమా విడుదల కాక ముందే వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమాని చూడొద్దంటూ ప్రచారం జరుగుతోంది.FARHAN AKTHAR MOVIE IN DISPUTE{#}ali;Culture;central government;Pooja Hegde;bollywood;Audience;Chitram;Hero;Cinemaఆ సినిమా చూడొద్దంటూ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం...ఆ సినిమా చూడొద్దంటూ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం...FARHAN AKTHAR MOVIE IN DISPUTE{#}ali;Culture;central government;Pooja Hegde;bollywood;Audience;Chitram;Hero;CinemaSat, 10 Jul 2021 14:00:00 GMTమాములుగా కొన్ని సినిమాలు రకరకాల వివాదాల కారణంగా విడుదల లేట్ అవ్వడం అలాగే కొన్ని సినిమాలు అసలు విడుదల కాకపోవడం జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే ఒక సినిమాకు ఎదురయ్యేలా ఉంది. ఈ సినిమా విడుదల కాక ముందే వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమాని చూడొద్దంటూ ప్రచారం జరుగుతోంది. మరో వారంలో విడుదల కావాల్సిన సినిమా సందిగడంలో పడింది. ఇదంతా బాలీవుడ్ మూవీ ‘తూఫాన్‌’ గురించి. బాలీవుడ్ హీరో ఫర్హాన్‌ అక్తర్‌, మ్రునాల్‌ థాకూర్‌ లు ఈ చిత్రంలో జంటగా నటించారు. ఇంకో వారంలో అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. అయితే ఈ సినిమాని ఎవరూ వీక్షించ వద్దని రిక్వెస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో మెసేజ్ ల మీద మెసేజ్ లు పెడుతున్నారు.
నిన్న రాత్రి నుండి మొదలైన ఈ వివాదం ఇంకా కొనసాగుతూ వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ సినిమా ఇన్ని విమర్శలు ఎందుకు ఎదుర్కొంటుంది అంటే, సినిమాలో హీరో, హీరోయిన్ల పాత్రల పేర్లే అసలు సమస్య చెలరేగడానికి కారణం అని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరో ఫర్హాన్‌ ఒక గ్యాంగ్‌స్టర్‌ పాత్ర పోషించారు. ఇతని ప్రేయసి మ్రునాల్‌  ప్రోత్సాహం మరియు సహాయంతో  బాక్సింగ్‌ ఛాంపియన్‌ స్థాయికి చేరుకుంటాడు. కాగా  ఈ మూవీలో ఫర్హాన్‌ పాత్ర పేరు అజిజ్‌ అలీ కాగా, మ్రునాల్‌ క్యారెక్టర్ పేరు డాక్టర్‌ పూజా షా. అయితే ఈ పేర్లు యొక్క కలయిక మన సంస్కృతి సంప్రదాయాలకు వ్యతిరేకమని, ఈ రకమైన మతాంతర కథలను ప్రోత్సహిస్తే మన సంప్రదాయాలను మనమే అగౌరవ పరిచినట్లని కొందరు విమర్శిస్తున్నారు.
 అయితే  ఫర్హాన్‌ సినిమాకి ఈ రేంజ్ లో విమర్శలు ఎదుర్కోవడానికి మరో కారణం కూడా బలంగా వినిపిస్తోంది. గతంలో  ఫర్హాన్‌ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా  నిరసనల్లో పాల్గొన్న విషయం తెలిసినదే. అయితే ఇపుడు అవకాశం రావడంతో ఈ రకంగా ఫర్హాన్ పై కక్ష సాధిస్తున్నారని మరో వర్గం అంటోంది. ఎన్ని వివాదాలు ఎదురైనా మా సినిమాపై ఎటువంటి ప్రభావం ఉండబోదని, ప్రజలు ఇలాంటివి నమ్మరని సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని  అంటున్నారట తుఫాన్ మూవీ  చిత్ర బృందం. రాకేశ్‌ ఓంప్రకాశ్‌ మెహ్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జులై 16న అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది.

" style="height: 715px;">




కోట గారి సినీ జీవితంలో పెద్ద మచ్చ అదే ??

'లక్ష్య' క్లైమాక్స్ షూట్ పూర్తి చేస్తున్న శౌర్య..?

ఆచార్య: చెర్రీ-సోనూ మధ్య అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్..?

చిరంజీవి నటించిన ఏకైక హాలీవుడ్ మూవీ..ఎందుకు ఆగిపోయింది

స్టార్ కూతురే అయినా తప్పని సినిమా కష్టాలు!!

బాహుబ‌లి సంచ‌ల‌నానికి నేటికి ఆరేళ్లు..!

కోటా శ్రీనివాసరావు ఎన్ని అవార్డులు అందుకున్నారో తెలుసా.?

ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.. తేజ తో ఆ స్టార్!!

హీరోయిన్ అంజలి కి ఇన్ని కోట్ల ఆస్తి ఉందా.. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>