MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samudra-khanid29d82c3-c820-4cda-80a1-e1933503e3dd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samudra-khanid29d82c3-c820-4cda-80a1-e1933503e3dd-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం తమిళ నటీ నటులు జోరు చూపిస్తున్నారు. ఇప్పటికే కోలీవుడ్ స్టార్ హీరోలు అయిన ధనుష్, విజయ్ లాంటి హీరోలు తెలుగులో స్ట్రెయిట్ తెలుగు సినిమాలు చేస్తున్నారు. కేవలం హీరోలే కాదు.. తమిళ విలన్లు కూడా తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ తమ సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో దర్శకుడు, నటుడు అయిన సముద్ర ఖని కూడా ఒకరు. తమిళంలో దర్శకుడిగా తన కెరీర్ ను మొదలు పెట్టిన సముద్ర ఖని.. ఆ తర్వాత అనుకోకుండా ఆర్టిస్ట్ గా మారి.. ఇప్పుడు బిజీ విలన్ గా మారిపోయాడు.తెలుగులో శంభో శివ శంభో సినిమానSamudra Khani{#}vani;Samudra Kani;Gokaraju Ganga Raju;Shambo Siva Shambo;Kollywood;mahesh babu;Joseph Vijay;NTR;Blockbuster hit;Tamil;Traffic police;ram pothineni;Tollywood;m m keeravani;Hero;India;Telugu;Cinema;Darsakudu;Directorటాలీవుడ్ లో తమిళ విలన్ హవా మాములుగా లేదుగా..!!టాలీవుడ్ లో తమిళ విలన్ హవా మాములుగా లేదుగా..!!Samudra Khani{#}vani;Samudra Kani;Gokaraju Ganga Raju;Shambo Siva Shambo;Kollywood;mahesh babu;Joseph Vijay;NTR;Blockbuster hit;Tamil;Traffic police;ram pothineni;Tollywood;m m keeravani;Hero;India;Telugu;Cinema;Darsakudu;DirectorSat, 10 Jul 2021 21:30:45 GMTటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం తమిళ నటీ నటులు జోరు చూపిస్తున్నారు. ఇప్పటికే కోలీవుడ్ స్టార్ హీరోలు అయిన ధనుష్, విజయ్ లాంటి హీరోలు తెలుగులో స్ట్రెయిట్ తెలుగు సినిమాలు చేస్తున్నారు. కేవలం హీరోలే కాదు.. తమిళ విలన్లు కూడా తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ తమ సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో దర్శకుడు, నటుడు అయిన సముద్ర ఖని కూడా ఒకరు. తమిళంలో దర్శకుడిగా తన కెరీర్ ను మొదలు పెట్టిన సముద్ర ఖని.. ఆ తర్వాత అనుకోకుండా ఆర్టిస్ట్ గా మారి.. ఇప్పుడు బిజీ విలన్ గా మారిపోయాడు.తెలుగులో శంభో శివ శంభో సినిమాని డైరెక్ట్ చేసింది సముద్ర ఖనే. ఈ సినిమా మొదట తమిళంలో విడుదలై సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత తెలుగులో ఈ సినిమాని తెరకెక్కించాడు.ఇక ఆ తర్వాత కూడా దర్శకుడిగా పలు సినిమాలు చేశాడు సముద్ర ఖని.

ఇక నటుడిగా మారిన తర్వాత ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించిన ఈయనకి ఆ పాత్రలు మంచి పేరు తెచ్చి పెట్టాయి. 'విచారణ' అనే సినిమాలో సముద్ర ఖని పోషించిన పోలీస్ పాత్రకు జాతీయ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు కూడా వచ్చింది.దీంతో తమిళంతో పాటూ ఇతర ఇండ్రస్టీ లకు చెందిన దర్శకనిర్మాతలు సైతం సముద్ర ఖనిని కొన్ని కీలక పాత్రలకు తీసుకుంటున్నారు.ఈ క్రమంలోనే ఇటీవల తెలుగులో అల వైకుంఠ పురములో,క్రాక్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలలో విలన్ గా అద్భుతమైన నటనను కనబర్చాడు.ఈ రెండు సినిమాల విజయాల్లో సముద్ర ఖని పాత్ర కూడా కీలకం అని నిస్సందేహంగా చెప్పొచ్చు.ఇక ఇప్పుడు రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ ల కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఆర్ ఆర్ ఆర్ లో ఈ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు.

ఇక తాజాగా మరో అగ్ర హీరో సినిమాలో విలన్ గా నటించనున్నాడు సముద్ర ఖని. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమా కోసం మెయిన్ విలన్ గా సముద్ర ఖనినే ఎంపిక చేసినట్లు సమాచారం.పరశురాం తెరకెక్కిస్తున్న ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ లో సముద్ర ఖని పాత్ర కనుక క్లిక్ అయి.. సినిమా హిట్ అయితే మాత్రం ఇక టాలీవుడ్ లో సముద్ర ఖనికి అస్సలు తిరుగుండదు.ఇక ఓ వైపు అగ్ర హీరోల సినిమాల్లో నటిస్తూనే.. మరో వైపు చిన్న చిన్న సినిమాల్లో కూడా నటిస్తున్నాడు ఈ తమిళ నటుడు.అశ్విన్ గంగరాజు అనే దర్శకుడు తెరకెక్కిస్తున్న ఆకాశ వాణి అనే సినిమాలో ఓ కీలక పాత్ర పోషించిన సముద్ర ఖని.. కీరవాణి కొడుకు సింహాతో కలిసి దొంగలున్నారు జాగ్రత్త అనే సినిమాలోనూ నటిస్తున్నాడు...!!



తాజాగా మరో అగ్ర హీరో సినిమాలో విలన్ గా నటించనున్నాడు సముద్ర ఖని. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమా కోసం మెయిన్ విలన్ గా సముద్ర ఖనినే ఎంపిక చేసినట్లు సమాచారంవీటితో పాటు ఆకాశవాణి, దొంగలున్నారు జాగ్రత్త అనే రెండు చిన్న సినిమాల్లో కూడా కీలక పాత్రలు పోషిస్తున్నాడు

బన్నీ ఐకాన్ లో మెగాస్టార్ .... ??

బాహుబలి మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ ఛాయిస్ కీరవాణి కాదా ... ??

సునీల్ కు మంచి రోజులొస్తున్నాయ్..!

మహిళా క్రికెటర్ ప్రతిభకి.. కేటీఆర్ ఫిదా?

విజువల్స్ తో ఆకట్టుకుంటున్న ధింసారే ధింసా సాంగ్...

అందుకే ఈ కేరళ భామ అతనితో విడిపోయిందట ?

బిజినెస్: రూ.12 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. కోట్లల్లో రాబడి..

ఆ తప్పు వల్లనే ఏయన్నార్ బాలూని వద్దనుకున్నారట.. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>