MoviesGVK Writingseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/katthi -415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/katthi -415x250-IndiaHerald.jpgసినిమా క్రిటిక్ మరియు నటుడు అయిన కత్తి మహేష్ కి మీడియాలో మంచి పేరు ఉన్న విషయం తెలిసిందే. తనదైన శైలిలో పలు సినిమాలకు రివ్యూస్ ఇచ్చే మహేష్, ఆ తరువాత మిణుగురులు సినిమాకు కో రైటర్ గా కూడా పని చేసిన కత్తి మహేష్, ఆపై సంపూర్ణేష్ బాబు హీరోగా యాక్ట్ చేసిన హృదయ కాలేయం సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్ర చేసారు. ఇక సినిమాపై మంచి ప్యాషన్ పెంచుకున్న కత్తి, అనంతరం సంపూర్ణేష్ బాబు హీరోగా పెసరట్టు అనే సినిమా తీసి దర్శకుడిగా మారారు. kathi mahesh{#}sampoornesh babu;Pesarattu;Nellore;Kathi Mahesh;Krack;Katthi;Ram Gopal Varma;rana daggubati;Car;kadapa;Traffic police;Accident;Ravi;ravi teja;Andhra Pradesh;Chennai;media;king;Cinemaకత్తి మహేష్ మృతి .... !!కత్తి మహేష్ మృతి .... !!kathi mahesh{#}sampoornesh babu;Pesarattu;Nellore;Kathi Mahesh;Krack;Katthi;Ram Gopal Varma;rana daggubati;Car;kadapa;Traffic police;Accident;Ravi;ravi teja;Andhra Pradesh;Chennai;media;king;CinemaSat, 10 Jul 2021 17:57:00 GMTసినిమా క్రిటిక్ మరియు నటుడు అయిన కత్తి మహేష్ కి మీడియాలో మంచి పేరు ఉన్న విషయం తెలిసిందే. తనదైన శైలిలో పలు సినిమాలకు రివ్యూస్ ఇచ్చే మహేష్, ఆ తరువాత మిణుగురులు సినిమాకు కో రైటర్ గా కూడా పని చేసిన కత్తి మహేష్, ఆపై సంపూర్ణేష్ బాబు హీరోగా యాక్ట్ చేసిన హృదయ కాలేయం సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్ర చేసారు. ఇక సినిమాపై మంచి ప్యాషన్ పెంచుకున్న కత్తి, అనంతరం సంపూర్ణేష్ బాబు హీరోగా పెసరట్టు అనే సినిమా తీసి దర్శకుడిగా మారారు.

ఇక రానా హీరోగా వచ్చిన నేనే రాజు నేనే మంత్రి, ఆర్జీవీ మూవీ అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమాలతో పాటు ఇటీవల రవితేజ నటించిన క్రాక్ మూవీలో కూడా ఒక చిన్న రోల్ చేసిన కత్తి మహేష్ తరచు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తాజా సినిమా రాజకీయాల పై తన విశ్లేషణలు చేస్తుంటారు. కాగా కొద్దిరోజుల క్రితం నెల్లూరు వద్ద ఆయన ప్రయాణిస్తున్న ఆయన కార్ కు యాక్సిడెంట్ జరిగింది. ఆ సమయంలో కత్తి మహేష్ తల, కుడి కన్నుకు బాగా పెద్ద గాయాలవడంతో వెంటనే ఆయనను సమీప ఆసుపత్రికి తరలించారు. ఆపై ప్రధమ చికిత్స అందించిన తరువాత చెన్నై లోని అపోలో ఆసుపత్రికి మార్చారు.

అయితే అప్పటి నుండి ఆయనని కాపాడడానికి డాక్టర్లు ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన వైద్య ఖర్చుల కోసం రూ.17 లక్షలు కేటాయించింది. అయితే అసలు విషయం ఏమిటంటే కొద్దిసేపటి క్రితం కత్తి మహేష్ పరిస్థితి మరింతగా విషమించిందని, దానితో డాక్టర్లు శత విధాలా ప్రయత్నించినప్పటికీ ఆయన ఆరోగ్యం సహకరించకపోవడంతో కత్తి మరణించారని తెలుస్తోంది. కాగా కత్తి మహేష్ మృతికి పలువురు ప్రేక్షకాభిమానులు, సినిమా ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.... !!  


బాహుబలి మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ ఛాయిస్ కీరవాణి కాదా ... ??

మహిళా క్రికెటర్ ప్రతిభకి.. కేటీఆర్ ఫిదా?

విజువల్స్ తో ఆకట్టుకుంటున్న ధింసారే ధింసా సాంగ్...

అందుకే ఈ కేరళ భామ అతనితో విడిపోయిందట ?

జగన్ మాస్టర్ ప్లాన్ సక్సెస్ అయితే... ?

ప్రయోగానికి సిద్దమైన స్వీటీ... ?

భారీ బాంబు పేలుడు... 10 మంది మృతి !

జయప్రద కి ముద్దు పెట్టిన స్టార్ హీరో బయట పెట్టిన నటుడు..!!

'బాహుబలి'గురించి ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>