GoldChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/gold/124/gold-rates1f2a7985-eaab-4635-a9e2-b2d0731d724a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/gold/124/gold-rates1f2a7985-eaab-4635-a9e2-b2d0731d724a-415x250-IndiaHerald.jpgబంగారం కొనాలనుకునేవారికి శుభవార్త. గత కొద్దిరోజులుగా పైకి వెళుతున్న బంగారం ధర ఈరోజు మాత్రం కొంచెం దిగొచ్చింది.. ఒక రకంగా గత వారం రోజుల నుంచి బంగారం ధరలు పైపైకి పరుగులు పెడుతున్నాయి.. కానీ ఈ రోజు బంగారం ధరలు దిగివచ్చాయి అనే చెప్పాలి. భారత దేశ స్త్రీలు అమితంగా ఇష్టపడే బంగారం ధర మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. అంతర్జాతీయంగా పెరుగుతున్న ధరలను బట్టి భారతదేశంలో కూడా బంగారం ధరల మీద నియంత్రణ కొనసాగుతూనే ఉంటుంది. అయితే ఆసక్తికర అంశం ఏమిటంటే దేశం మొత్తం బంగారం ధర కాస్త తగ్గితే హైదరాబాద్ లో మాత్రం స్వలgold rates{#}Hyderabad;gold;Capital;Good news;Silver;Good Newwzమహిళలకు శుభవార్త : తగ్గిన బంగారం ధరలు!మహిళలకు శుభవార్త : తగ్గిన బంగారం ధరలు!gold rates{#}Hyderabad;gold;Capital;Good news;Silver;Good NewwzSat, 10 Jul 2021 07:29:00 GMTబంగారం కొనాలనుకునేవారికి శుభవార్త. గత కొద్దిరోజులుగా పైకి వెళుతున్న బంగారం ధర ఈరోజు మాత్రం కొంచెం దిగొచ్చింది.. ఒక రకంగా గత వారం రోజుల నుంచి బంగారం ధరలు పైపైకి పరుగులు పెడుతున్నాయి.. కానీ ఈ రోజు బంగారం ధరలు దిగివచ్చాయి అనే చెప్పాలి. భారత దేశ స్త్రీలు అమితంగా ఇష్టపడే బంగారం ధర మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. అంతర్జాతీయంగా పెరుగుతున్న ధరలను బట్టి భారతదేశంలో కూడా బంగారం ధరల మీద నియంత్రణ కొనసాగుతూనే ఉంటుంది. 


అయితే ఆసక్తికర అంశం ఏమిటంటే దేశం మొత్తం బంగారం ధర కాస్త తగ్గితే హైదరాబాద్ లో మాత్రం స్వల్పంగా పెరిగింది. అయితే ప్రతి రోజూ కాస్త పెరుగుతున్న వెండి ధర కూడా ఈ రోజు తగ్గింది. ఇక ఈ రోజు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయి అనేది పరిశీలిస్తే ఈ మేరకు ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 46,900 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 50,950 రూపాయలుగా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 45,200 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 49,310 రూపాయలుగా ఉంది. 


దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 46,810 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 47,810 రూపాయలుగా ఉంది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.110 పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,820 ఎగసింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.100 పెరిగింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,750కి చేరుకుంది. ఇక వెండి మాత్రం తగ్గుతూ వస్తోంది. ఈరోజు వెండి ధర భారీగా తగ్గింది. రూ.700 తగ్గి కాస్త ఊరటనిచ్చింది. దీంతో నేడు కేజీ వెండి ధర రూ.73,400కు చేరుకుంది. వెండి కొనాలనుకునే వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు.




తెలుగు రాష్ట్రాలకు అలర్ట్ : మరో మూడు రోజుల పాటు?

ఎంటెక్ లో డిఫెన్స్ ప్రోగ్రాం.. వివరాలు..

ఒలింపిక్స్ విజేతలకు భారీ నజరానా !

కుర్ర భామ‌తో టాలీవుడ్ యంగ్ హీరో ఎఫైర్ ?

ఘోర అగ్నిప్రమాదం, 52మంది మృతి..!

రాజధాని కౌలు కేసులో కీలక పరిణామం!

అప్పట్లో రజినీ కంటే ఎక్కువ రెమ్యూనరేన్ పొందిన వ్యక్తి..

దారుణం : రోడ్డుపైనే మహిళ చీర లాగారూ?

ఖమ్మంలో భారీ పేలుడు.. తృటిలో తప్పించుకున్న పోలీసులు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>