PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/corona153074cb-e26f-475a-b3a6-15f31974ac5d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/corona153074cb-e26f-475a-b3a6-15f31974ac5d-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. అయితే ఇది ఓవరాల్‌ గా చూస్తే కనిపించే దృశ్యం.. కానీ.. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. కొన్ని జిల్లాల్లో పాజిటివ్ కేసుల శాతం ఎక్కువగా కనిపిస్తోంది. ఏపీలో నమోదవుతున్న కేసుల్లో చాలా వరకూ కేవలం మూడు జిల్లాల్లోనే నమోదవుతున్నాయి. ఏపీ రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోలిస్తే చిత్తూరు, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల శాతం ఎక్కువగా ఉంటోంది. చివరకు ఈ విషయంలో కోర్టు కూడా ప్రత్యేకంగా ఈ జిల్లాల గురcorona{#}High court;Bhuma Akhila Priya;Sunkara Ramabrahmam;Thota Chandrasekhar;court;Andhra Pradesh;Government;Coronavirus;central governmentఆంధ్రాను హడలెత్తిస్తున్న ఆ 'మూడు' జిల్లాలు..?ఆంధ్రాను హడలెత్తిస్తున్న ఆ 'మూడు' జిల్లాలు..?corona{#}High court;Bhuma Akhila Priya;Sunkara Ramabrahmam;Thota Chandrasekhar;court;Andhra Pradesh;Government;Coronavirus;central governmentSat, 10 Jul 2021 09:15:00 GMTకరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. అయితే ఇది ఓవరాల్‌ గా చూస్తే కనిపించే దృశ్యం.. కానీ.. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. కొన్ని జిల్లాల్లో పాజిటివ్ కేసుల శాతం ఎక్కువగా కనిపిస్తోంది. ఏపీలో నమోదవుతున్న కేసుల్లో చాలా వరకూ కేవలం మూడు జిల్లాల్లోనే నమోదవుతున్నాయి. ఏపీ రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోలిస్తే చిత్తూరు, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల శాతం ఎక్కువగా ఉంటోంది.

చివరకు ఈ విషయంలో కోర్టు కూడా ప్రత్యేకంగా ఈ జిల్లాల గురించి ప్రస్తావించింది. అఖిల భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుంకర రాజేంద్రప్రసాద్‌, పాత్రికేయులు తోట సురేశ్‌బాబు, మరికొందరు దాఖలు చేసిన వ్యాజ్యాలను విచారించిన ఏపీ హైకోర్టు ఈ జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ జిల్లాల్లోనే ఎందుకు ఎక్కువ కేసులు నమోదవుతున్నాయో కారణాలను అన్వేషించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ మూడు జిల్లాల్లో కరోనా కట్టడికి సూక్ష్మ నిర్వహణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని సూచించింది. ఈ మూడు జిల్లాల్లో గత 15 రోజుల్లో జిల్లాల వారీగా నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య ఎంత? ఎక్కువగ కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధ ఏమి తీసుకున్నారు? ఇలాంటి  వివరాలన్నీ  కోర్టు ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అంతే కాదు..  అవసరమైతే వ్యాప్తికి కారణమవుతున్న ప్రాంతాలను కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రకటించాలని ఆదేశించింది.


రాష్ట్రంలో నమోదవుతున్న బ్లాక్ ఫంగస్‌ కేసులపైనా హైకోర్టు ప్రశ్నించింది. ఈ సమయంలో రాష్ట్రంలో 1135 బ్లాక్‌ ఫంగస్‌ యాక్టివ్‌ కేసులున్నాయని.. యావరేజ్‌గా రోజుకు 42 నమోదవుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తరఫున సహాయ సొలిసిటర్‌ జనరల్‌ వాదనలు వినిపించారు. ఏపీలో 2897 బ్లాక్‌ ఫంగస్‌ యాక్టివ్‌ కేసులున్నాయని తెలిపారు. ధర్మాసనం స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం కేసుల సంఖ్య వేరువేరుగా చెప్పడం ఏమిటని అడిగింది. భారీ వ్యత్యాసం ఎందుకు ఉందో తదుపరి విచారణలో చెప్పాలని కోరింది.





ఏపీలో నమోదవుతున్న కేసుల్లో చాలా వరకూ కేవలం మూడు జిల్లాల్లోనే నమోదవుతున్నాయి. ఏపీ రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోలిస్తే చిత్తూరు, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల శాతం ఎక్కువగా ఉంటోంది.

ల‌గ‌డ‌పాటి పొలిటిక‌ల్ ఎంట్రీ.. ఏ పార్టీతో అంటే..!

కరోనా ఇంకా పోలేదు... ఏ క్షణమైనా విజృంభించవచ్చు ?

మరి కాసేపట్లో వీర జవాన్ అంత్యక్రియలు..

ప్రాథమిక హక్కు అంటే ఏమిటో తెలుసుకుందామా..?

హ్యాపీ బర్త్ డే : కోట శ్రీనివాసరావు గురించి ఎవరికీ తెలియని నిజాలు..!

దాస‌రి నారాయ‌ణ రావు - ప‌ద్మ తొలి ప్రేమ ఎక్క‌డో తెలుసా..!

కేసీఆర్‌ ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా..? ‍

అప్పుల అప్పారావులు.. మన కేంద్ర మంత్రులు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>