PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/lagadapati-political-entry-with-that-party-cca4e362-ff1b-43f4-b802-9ff437632902-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/lagadapati-political-entry-with-that-party-cca4e362-ff1b-43f4-b802-9ff437632902-415x250-IndiaHerald.jpgదీంతో త్వ‌ర‌లోనే ఏపీ కాంగ్రెస్ సార‌థిని మార్చేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఇదే స‌మ‌యంలో ప్ర‌స్తుతం రాజ‌కీయంగా త‌ట‌స్థంగా ఉన్న ల‌గ‌డ‌పాటిని.. పార్టీలోకి తీసుకుని.. ఏపీలో బ‌లోపేతం చేసే దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్టు స‌మాచారం. ఇటీవ‌ల హైద‌రాబాద్ వేదిక‌గా జ‌రిగిన ఏపీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల స‌మావేశంలో ల‌గ‌డ‌పాటి వంటి కీల‌క నేత‌ల‌ను రాజ‌కీయంగా బ‌లోపేతం చేసుకోవాల‌నే విష‌యంపై కాంగ్రెస్ నేత‌లు స‌మాలోచ‌న‌లు చేశారు. ఆయ‌న వ‌స్తే.. యువ‌త కాంగ్రెస్ వైపు వ‌స్తార‌ని.. అదేస‌మయంలో పారిశ్రామిక వ‌ర్గాలు కూడా తిరిగి కాంగ్రెసLagadapati Raja Gopal{#}Dookudu;youth;central government;Congress;Andhra Pradeshల‌గ‌డ‌పాటి పొలిటిక‌ల్ ఎంట్రీ.. ఏ పార్టీతో అంటే..!ల‌గ‌డ‌పాటి పొలిటిక‌ల్ ఎంట్రీ.. ఏ పార్టీతో అంటే..!Lagadapati Raja Gopal{#}Dookudu;youth;central government;Congress;Andhra PradeshSat, 10 Jul 2021 09:00:00 GMTవిజ‌య‌వాడ మాజీ ఎంపీ, రాజ‌కీయ విశ్లేష‌కులు.. ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ తిరిగి రాజ‌కీయంగా త‌న ప్ర‌స్థానాన్ని ప్రారంభించ‌నున్నారా?  ఆయ‌న మ‌ళ్లీ ఏపీ పాలిటిక్స్‌లో త‌న ప్ర‌భావం చూపించ‌నున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌తంలో రాష్ట్ర విభ‌జ‌న‌కు వ్య‌తిరేకంగా ఆయ‌న గ‌ళం వినిపించిన విష‌యం తెలిసిందే. ఇక‌, ఇప్పుడు జ‌ల వివాదాల నేప‌థ్యంలో రెండు రాష్ట్రాల మ‌ధ్య స‌ఖ్య‌త లోపించింది. దీనిని త‌మ‌కు అనుకూలంగా మార్చుకుని.. రాజ‌కీయంగా దూకుడు చూపించాల‌ని కాంగ్రెస్ నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది.

దీంతో త్వ‌ర‌లోనే ఏపీ కాంగ్రెస్ సార‌థిని మార్చేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఇదే స‌మ‌యంలో ప్ర‌స్తుతం రాజ‌కీయంగా త‌ట‌స్థంగా ఉన్న ల‌గ‌డ‌పాటిని.. పార్టీలోకి తీసుకుని.. ఏపీలో బ‌లోపేతం చేసే దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్టు స‌మాచారం. ఇటీవ‌ల హైద‌రాబాద్ వేదిక‌గా జ‌రిగిన ఏపీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల స‌మావేశంలో ల‌గ‌డ‌పాటి వంటి కీల‌క నేత‌ల‌ను రాజ‌కీయంగా బ‌లోపేతం చేసుకోవాల‌నే విష‌యంపై కాంగ్రెస్ నేత‌లు స‌మాలోచ‌న‌లు చేశారు. ఆయ‌న వ‌స్తే.. యువ‌త కాంగ్రెస్ వైపు వ‌స్తార‌ని.. అదేస‌మయంలో పారిశ్రామిక వ‌ర్గాలు కూడా తిరిగి కాంగ్రెస్ వైపు చూస్తాయ‌ని.. భావిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ల‌గ‌డ‌పాటిని త్వ‌ర‌లోనే కాంగ్రెస్‌లోకి పిల‌వాల‌ని భావిస్తున్నారు. ఇక‌, ప్ర‌స్తుత ప‌రిస్థితిలో ల‌గ‌డ‌పాటికి కూడా రాజ‌కీయంగా ఒక పోస్టు అవ‌స‌రంగా మారింది. రాజకీయాల నుంచి దూరంగా ఉన్న ఆయ‌న‌కు వ్యాపార ప‌రంగా ఆశించిన విధంగా దూకుడు క‌నిపించ‌డం లేద‌ని వ్యాపార వ‌ర్గాల్లో ప్ర‌చారం జరుగుతోంది. ఈ నేప‌థ్యంలో నే జ‌రిగింది ఎలాగూ జ‌రిగిపోయింది క‌నుక‌.. ఆయ‌న తిరిగి పొలిటిక‌ల్ ఎంట్రీ ఇస్తే.. బాగుంటుంద‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది.

దీనికి రాజ‌గోపాల్ కూడా సిద్ధంగానే ఉన్నార‌ని.. కాంగ్రెస్‌లో నే ఆయ‌న తిరిగి చేర‌తార‌ని.. ఒక కీల‌క నేత వ్యాఖ్యానించారు. సో.. వ‌చ్చేఆరేడు నెల‌ల్లోనే ల‌గ‌డ‌పాటి రీఎంట్రీ ఖాయ‌మ‌ని సంకేతాలు వ‌స్తున్నాయి. మ‌రి రాజ‌కీయ సంచ‌ల‌నాల‌కు కేంద్ర బిందువు అయిన ల‌గ‌డ‌పాటి తిరిగి పాలిటిక్స్ లోకి వ‌స్తే ఎలాంటి ?  సంచ‌ల‌నాలు న‌మోదు చేస్తారో ?  చూడాలి.

 



ఇంత‌కీ వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఎవ‌రివైపు?

కరోనా ఇంకా పోలేదు... ఏ క్షణమైనా విజృంభించవచ్చు ?

ల‌గ‌డ‌పాటి పొలిటిక‌ల్ రీ ఎంట్రీ కాంగ్రెస్‌తోనే ?

మరి కాసేపట్లో వీర జవాన్ అంత్యక్రియలు..

హ్యాపీ బర్త్ డే : కోట శ్రీనివాసరావు గురించి ఎవరికీ తెలియని నిజాలు..!

దాస‌రి నారాయ‌ణ రావు - ప‌ద్మ తొలి ప్రేమ ఎక్క‌డో తెలుసా..!

కేసీఆర్‌ ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా..? ‍

అప్పుల అప్పారావులు.. మన కేంద్ర మంత్రులు..

రేవంత్‌రెడ్డికి కొత్త పేరు పెట్టిన రోజా... పంచ్ పేలిందిగా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>