PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tag7293a9e4-8279-4544-99b9-e189d14aa389-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tag7293a9e4-8279-4544-99b9-e189d14aa389-415x250-IndiaHerald.jpg ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా అభివృద్ధి చెందలేదని.. ఇక నుంచి దానికి మహర్దశ పడుతుందని చెప్పారు. దేశంలోని అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా కడపను తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఈ మాటలు విని కడప వాసుల‌తోపాటు ఏపీ మొత్తం నిబిడాశ్చర్యానికి లోనైంది. కడప జిల్లాలో 40 సంవ‌త్స‌రాల నుంచి వైఎస్ కుటుంబానికి చెందిన‌వారిదే ఆధిపత్యం. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, అధికారంలో ఎవ‌రున్నా, కడప జిల్లాలో జ‌రిగే ప్ర‌తి కార్యక్రమం వైఎస్ కుటుంబం కనుసన్నల్లోనే జ‌రుగుతుండేది. అంటే క‌డ‌ప జిల్లా అంతా వారిచేతిలోనtag{#}dr rajasekhar;Pulivendula;Idupulapaya;Kanna Lakshminarayana;Jagan;Telangana Chief Minister;District;Party;Reddy;kadapa;Andhra Pradeshఈ రెండేళ్ల‌లో మ‌న‌మేం చేసిన‌ట్లు?ఈ రెండేళ్ల‌లో మ‌న‌మేం చేసిన‌ట్లు?tag{#}dr rajasekhar;Pulivendula;Idupulapaya;Kanna Lakshminarayana;Jagan;Telangana Chief Minister;District;Party;Reddy;kadapa;Andhra PradeshSat, 10 Jul 2021 18:36:00 GMT
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా అభివృద్ధి చెందలేదని.. ఇక నుంచి దానికి మహర్దశ పడుతుందని చెప్పారు. దేశంలోని అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా కడపను తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఈ మాటలు విని కడప వాసుల‌తోపాటు ఏపీ మొత్తం నిబిడాశ్చర్యానికి లోనైంది. కడప జిల్లాలో 40 సంవ‌త్స‌రాల నుంచి వైఎస్ కుటుంబానికి చెందిన‌వారిదే ఆధిపత్యం. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, అధికారంలో ఎవ‌రున్నా, కడప జిల్లాలో జ‌రిగే ప్ర‌తి కార్యక్రమం  వైఎస్ కుటుంబం కనుసన్నల్లోనే జ‌రుగుతుండేది. అంటే క‌డ‌ప జిల్లా అంతా వారిచేతిలోనే ఉండేదే క‌దా అని అర్థం.

జ‌గ‌న్ ఎవ‌రిని నిందిస్తున్నారు?
తాజాగా జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ప‌రిశీలిస్తే కడపను పట్టించుకోలేదని ఎవ‌రిని నిందిస్తున్నారో అర్థం కావ‌డంలేదు. ప్రజలంతా  ఎవరి వైపు చూస్తున్నారు? ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జ‌గన్ క‌లిపి ఇప్ప‌టికి ఏడు సంవ‌త్స‌రాలు పాలించారు. ఈ స‌మ‌యంలో అభివృద్ధి ఎందుకు చేయ‌లేదు? కడపలో, పులివెందులలో వైఎస్ కుటుంబానికి పెద్ద పెద్ద ఇళ్లు, ఇడుపులపాయ ఎస్టేట్‌లో భారీ ఫామ్ హౌస్, పులివెందుల ప‌ట్ట‌ణంలో కాస్తంత అభివృద్ధి పనులు జరిగాయి. జగన్ ఈ రెండు సంవ‌త్స‌రాల కాలంలో వందల కోట్ల రూపాయ‌ల‌ జీవోలిచ్చారు కానీ పనులు చేయ‌లేదు.

ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అనేరీతిలో ఉన్న ప‌నులు
క‌డ‌ప జిల్లాలో అభివృద్ధి ప‌నులు ప‌రిశీలిస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న‌ట్లుగా త‌యార‌య్యాయి. పులివెందులలో వైఎస్ కన్నా ఎక్కువ అభివృద్ధి పనులు చేసి ప్రజల మెప్పు పొంద‌డానికి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం వందల కోట్ల రూపాయ‌లు గుమ్మ‌రించింది. గ‌త ప్ర‌భుత్వ ప‌నుల‌న్నీ తిర‌గ‌రాసి త‌న‌వే అని చెబుతున్న జ‌గ‌న్ మ‌రి ఆ ప‌నుల‌ను ముందుకు తీసుకువెళ్ల‌డంలో ఎందుకు సంకోచిస్తున్నారో ఆయ‌న‌కే తెలియాలి. రెండు సంవ‌త్స‌రాల స‌మ‌య‌మంటే చాలా విలువైంది. అటువంటి స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేసుకొని సొంత జిల్లాను కూడా అభివృద్ధి చేయ‌కుండా నెప‌మంతా గ‌త ప్ర‌భుత్వాల‌మీద నెట్టేస్తే రాజ‌కీయంగా ఎటువంటి ప్ర‌యోజ‌నం చేకూర‌ద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.



ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా అభివృద్ధి చెందలేదని.. ఇక నుంచి దానికి మహర్దశ పడుతుందని చెప్పారు. దేశంలోని అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా కడపను తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఈ మాటలు విని కడప వాసుల‌తోపాటు ఏపీ మొత్తం నిబిడాశ్చర్యానికి లోనైంది. కడప జిల్లాలో 40 సంవ‌త్స‌రాల నుంచి వైఎస్ కుటుంబానికి చెందిన‌వారిదే ఆధిపత్యం. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, అధికారంలో ఎవ‌రున్నా, కడప జిల్లాలో జ‌రిగే ప్ర‌తి కార్యక్రమం వైఎస్ కుటుంబం కనుసన్నల్లోనే జ‌రుగుతుండేది. అంటే క‌డ‌ప జిల్లా అంతా వారిచేతిలోనే ఉండేదే క‌దా అని అర్థం.

ఏజెంట్ కోసం స్పీడ్ పెంచుతున్న అఖిల్

బాక్సాఫీస్ దగ్గర అక్కినేని హీరోల ఫైట్..!

కత్తి మహేష్ మృతి .... !!

టీడీపీకి త‌ల‌నొప్పిగా మారిన సోష‌ల్‌మీడియా...?

కృష్ణాజ‌లాల వివాదంపై క్లారిటి ఇచ్చిన మంత్రి కేటీఆర్‌...?

ఈ నెల 14న పోల‌వ‌రం వెళ్ల‌నున్న ఏపీ సీఎం

ఎన్టీఆర్ దంప‌తుల‌తో మెగాస్టార్ దంప‌తులు.. ఈ ఫొటో వెన‌క ఇంట్ర‌స్టింగ్ స్టోరీ..!

ఇద్దరు కి'లే'డీలు అరెస్ట్.. ఏం చేశారంటే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>