MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rp-patnaik389c1700-9ee4-4143-8e2c-4b2bb0ef0730-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rp-patnaik389c1700-9ee4-4143-8e2c-4b2bb0ef0730-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్స్ ఎంత ఇంటరెస్టింగ్ గా ఉంటాయి అంటే సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఆ కాంబినేషన్ మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. ఎన్ని సినిమాలు వచ్చినా తెరపై వారి కాంబినేషన్ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది ప్రేక్షకులకి. మధ్యలో ఏ కారణాల వల్లనైనా వారు విడిపోతే అయ్యో మంచి కాంబినేషన్ లో సినిమా రాకుండా పోయింది అని బాధపడతారు. మళ్లీ ఆ కాంబినేషన్ సెట్ అయితే వారి ఆనందానికి అవధులు ఉండవు. ఆ విధంగా టాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.పి.పట్నాయక్ డైరెక్టర్ తేజ ల కాంబో ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.RP Patnaik{#}r p patnayak;teja;Sangeetha;Daggubati Venkateswara Rao;Venkatesh;Chitram;Tollywood;Music;Darsakudu;Director;Cinemaఎన్నాళ్ళకెన్నాళ్ళకు.. తేజ తో ఆ స్టార్!!ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.. తేజ తో ఆ స్టార్!!RP Patnaik{#}r p patnayak;teja;Sangeetha;Daggubati Venkateswara Rao;Venkatesh;Chitram;Tollywood;Music;Darsakudu;Director;CinemaSat, 10 Jul 2021 12:01:45 GMTటాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్స్ ఎంత ఇంటరెస్టింగ్ గా ఉంటాయి అంటే సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఆ కాంబినేషన్ మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. ఎన్ని సినిమాలు వచ్చినా తెరపై వారి కాంబినేషన్ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది ప్రేక్షకులకి. మధ్యలో ఏ కారణాల వల్లనైనా వారు విడిపోతే అయ్యో మంచి కాంబినేషన్ లో సినిమా రాకుండా పోయింది అని బాధపడతారు. మళ్లీ ఆ కాంబినేషన్ సెట్ అయితే వారి ఆనందానికి అవధులు ఉండవు. ఆ విధంగా టాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.పి.పట్నాయక్ డైరెక్టర్ తేజ ల కాంబో ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.

వీరి కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు రాగా ఆ సినిమాలోని పాటలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. తేజ దర్శకత్వం వహించిన తొలి సినిమా నుంచి వీరి ప్రయాణం కొనసాగుతోంది. చిత్రం సినిమాతో వీరు తొలిసారిగా కలిసి పని చేయగా ఆ సినిమాలోని పాటలు ఇప్పటికీ మార్మోగిపోతూనే ఉంటాయి. ఆ తరువాత నువ్వు నేను, నిజం, ధైర్యం, ఔనన్నా... కాదన్న వంటి చిత్రాల ఆల్బమ్స్ సూపర్ హిట్ గా నిలిచాయి.

అయితే చాలా రోజులనుంచి వీరి కాంబినేషన్ తెరపై కనిపించడం లేదు. దాంతో వీరి కాంబినేషన్ ను కోరుకునే అభిమానులు ఎంతో నిరాశ పడ్డారు. ఆర్పి పట్నాయక్ సంగీతం మానేసి సినిమాలకు దర్శకుడు కావడంతో తేజ అనూప్ రూబెన్స్ వంటి ఇతర సంగీత దర్శకులకు వెళ్లడంతో ఈ కాంబినేషన్ మళ్లీ చూడలేము అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో నెలకొంది. కానీ తిరిగి వీరిద్దరూ కలిసి పని చేయాలని ఇటీవలే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దగ్గుబాటి అభిరామ్ ను హీరోగా పరిచయం చేస్తూ తేజ ఓ చిత్రాన్ని చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మరి వీరి కాంబినేషన్లో భవిష్యత్తులో ఇంకెన్ని సూపర్ హిట్ పాటలు వస్తాయో చూడాలి. 



త్వరలో సెట్లోకి వెళ్లనున్న బన్నీ కూతురు.. హీరో ఎవరంటే..!

హీరోయిన్ అంజలి కి ఇన్ని కోట్ల ఆస్తి ఉందా.. ?

కోట శ్రీనివాసరావు సినీ రంగ ప్రవేశానికి కారణం ఎవరో తెలుసా ?

సబ్‌కలెక్టర్‌గా దుమ్మురేపనున్న రవితేజ..?

'విక్ర‌మ్‌'లో లోక‌నాయ‌కుడి 'విశ్వ‌రూపం'?

తల్లి పాత్ర చేయబోతున్న కాజల్?

హృతిక్ కి ఇన్నాళ్లకు సరైన సినిమా పడిందట!!

తాప్సీ నటనకు షాక్ అయిన సహ నటుడు... కామెంట్స్ వైరల్ ?

జులై లో విడుదల అయిన రాజమౌళి సినిమాలు ఎన్ని ఉన్నాయో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>