MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanthbc527c7c-3592-47f3-8f49-c4d37a19a6de-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanthbc527c7c-3592-47f3-8f49-c4d37a19a6de-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ రజనీకాంత్ మే నెలలో "అన్నాత్తే" షూటింగ్ కంప్లీట్ చేశారు. అనంతరం ఆయన వైద్య పరీక్షల నిమిత్తం అమెరికాకు వెళ్లారు. ప్రస్తుతం అమెరికాలోనే ఉన్న ఆయన త్వరలోనే స్వదేశానికి తిరిగి రానున్నారు. స్వదేశానికి తిరిగి రాగానే ఒక కొత్త సినిమా పట్టాలెక్కించనున్నారు. అయితే కోలీవుడ్ సినీ వర్గాల ప్రకారం, రజనీకాంత్ మళ్లీ తన కూతురు దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారట. 2014లో ఆయన తన కూతురు సౌందర్య దర్శకత్వంలో "కొచ్చాడియాన్ (తెలుగులో విక్రమసింహ)" అనే కూతురితో భారీ సినిమా ప్లాన్ చేసిన రజనీకాంత్..?rajinikanth{#}Cinema;Rajani kanth;Kollywood;Soundarya;Father;Blockbuster hit;Writerకూతురితో భారీ సినిమా ప్లాన్ చేసిన రజనీకాంత్..?కూతురితో భారీ సినిమా ప్లాన్ చేసిన రజనీకాంత్..?rajinikanth{#}Cinema;Rajani kanth;Kollywood;Soundarya;Father;Blockbuster hit;WriterThu, 08 Jul 2021 17:00:00 GMTసూపర్ స్టార్ రజనీకాంత్ మే నెలలో "అన్నాత్తే" షూటింగ్ కంప్లీట్ చేశారు. అనంతరం ఆయన వైద్య పరీక్షల నిమిత్తం అమెరికాకు వెళ్లారు. ప్రస్తుతం అమెరికాలోనే ఉన్న ఆయన త్వరలోనే స్వదేశానికి తిరిగి రానున్నారు. స్వదేశానికి తిరిగి రాగానే ఒక కొత్త సినిమా పట్టాలెక్కించనున్నారు. అయితే కోలీవుడ్ సినీ వర్గాల ప్రకారం, రజనీకాంత్ మళ్లీ తన కూతురు దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారట. 2014లో ఆయన తన కూతురు సౌందర్య దర్శకత్వంలో "కొచ్చాడియాన్ (తెలుగులో విక్రమసింహ)" అనే ఒక త్రీడీ యానిమేషన్ యాక్షన్ సినిమా చేశారు. ఐతే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. దీంతో షాకయిన సౌందర్య తర్వాత తేరుకొని.. మంచి స్క్రిప్ట్ తో ఒక సినిమాని డైరెక్ట్ చేసి తన తండ్రి రజినీకి ఓ బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

అయితే ఆమె ఒక మంచి స్క్రిప్ట్ రాయడం కోసం దాదాపు ఏడేళ్ల సమయం తీసుకున్నారు. ఎట్టకేలకు ఇటీవలే ఒక మంచి స్క్రిప్ట్ పూర్తి కావడంతో ఆమె తన తండ్రిని హీరోగా పెట్టి భారీ బడ్జెట్ తో సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. అడపాదడపా సినిమాలు, వెబ్ సిరీస్ లకు కథలు అందిస్తున్న సౌందర్య మంచి రచయిత అని కోలీవుడ్ లో టాక్ ఉంది. అంతేకాకుండా రజనీకాంత్ సినిమా కోసం ఆమె ప్రముఖ రచయితలతో కలిసి కథను సిద్ధం చేస్తున్నారు. దీంతో రజనీకాంత్ కూడా తన కూతురు పై పూర్తి నమ్మకం తో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారని సమాచారం.

ఇకపోతే ఈ సినిమాని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందించనుందని తెలుస్తోంది. ఫ్యాంటసీ జానర్ లో రానున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. చెన్నైకి తిరిగి వచ్చేసిన తర్వాత రజనీకాంత్ "అన్నాత్తే" సినిమాలోని తన పాత్రకు సంబంధించి డబ్బింగ్ చెప్పనున్నారు. ఆ తర్వాత ఇక తన కొత్త సినిమాని ప్రారంభించనున్నారని తెలుస్తోంది. మరి ఈసారైనా కూతురి సినిమాతో హిట్ అందుకుంటారో లేదో చూడాలి.


దళపతి విజయ్ సినిమా చూపిస్తూ.. ఆపరేషన్ చేసిన వైద్యులు?

సీరియల్ హీరోయిన్ భర్త కూడా హీరో నే.. ఎవరో చూడండి

ప్రభాస్, ఎన్టీఆర్ లకు షాక్ ఇస్తున్న చరణ్!!

చైతు లవ్ స్టోరీకి 10 ఆఫర్లు.. అయినా వెనక్కి తగ్గలేదు..!

కూతురితో భారీ సినిమా ప్లాన్ చేసిన రజనీకాంత్..? పూర్తి సమాచారం కోసం ఇండియా హెరాల్డ్ మూవీస్ కేటగిరీలో చూడండి.

భార్య నిర్మాతగా... భర్త వెబ్ సిరీస్ ?

బన్నీని ఫాలో అవుతున్న విజయ్..

ప్రభాస్ ధూమ్ సినిమా చేయొద్దంటున్న ఫ్యాన్స్. కారణం క్రేజీ గా ఉంటుంది!!

AVS అల్లుడు కూడా మనకు తెలిసిన నటుడే !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>