Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/revanthbbe9482b-8b2c-4b2d-8492-170e44933547-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/revanthbbe9482b-8b2c-4b2d-8492-170e44933547-415x250-IndiaHerald.jpgఇటీవలే ఎన్నో అనూహ్య పరిణామాల మధ్య తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త పిసిసి చీప్ ఎన్నికయ్యారు. ఇక మొదటి నుంచీ అందరూ అనుకున్నట్లు గానే టిపిసిసి చీఫ్ పదవి మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ని వరించింది. అయితే టిపిసిసి గా ఎన్నికైన నాటినుండి రేవంత్ రెడ్డి ఎంతో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్న వాళ్ళందరిని కూడా కలుపుకు పోతూ ముందుకు సాగుతున్నారు రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేతలు అందరూ రేవంత్ రెడ్డి తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాము అని ప్రకటిRevanth{#}TPCC;Mohandas Karamchand Gandhi;Malkajgiri;police;Revanth Reddy;revanth;Telangana;Congress;Partyటీపీసీసీగా ఎన్నిక అయ్యాడో లేదో.. రేవంత్ పై రెండు కేసులు?టీపీసీసీగా ఎన్నిక అయ్యాడో లేదో.. రేవంత్ పై రెండు కేసులు?Revanth{#}TPCC;Mohandas Karamchand Gandhi;Malkajgiri;police;Revanth Reddy;revanth;Telangana;Congress;PartyThu, 08 Jul 2021 21:07:00 GMTఇటీవలే ఎన్నో అనూహ్య పరిణామాల మధ్య తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త పిసిసి చీప్ ఎన్నికయ్యారు. ఇక మొదటి నుంచీ అందరూ అనుకున్నట్లు గానే టిపిసిసి చీఫ్ పదవి మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ని వరించింది. అయితే టిపిసిసి గా ఎన్నికైన నాటినుండి రేవంత్ రెడ్డి ఎంతో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్న వాళ్ళందరిని కూడా కలుపుకు పోతూ ముందుకు సాగుతున్నారు రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేతలు అందరూ రేవంత్ రెడ్డి తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాము అని ప్రకటించారు.


 ఇటీవల భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం టిపిసిసి పదవీ బాధ్యతలు చేపట్టారు రేవంత్ రెడ్డి. అయితే టీ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యారో లేదో ఆయనపై ఇటీవలే రెండు కేసులు నమోదయ్యాయి. టిపిసిసి పదవీ బాధ్యతలు చేపట్టడానికి ముందు పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు రేవంత్ రెడ్డి. అనంతరం దర్గాలో ప్రార్థనలు కూడా చేశారు. తర్వాత రేవంత్ రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే.  ర్యాలీ లో భారీగా అటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. ఇలా ర్యాలీగా గాంధీ భవన్ కు చేరుకున్న రేవంత్ రెడ్డి అక్కడ టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇలా ఎలాంటి అనుమతి లేకుండా భారీ ర్యాలీ నిర్వహించడం పై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొత్త పీసీసీ చీఫ్ గా ఎన్నికైన రేవంత్ రెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేశారు.



ఇలా జూబ్లీహిల్స్ లొ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కూడా ఒక కేసు నమోదు అయ్యింది  ఇక మరోవైపు బేగం బజార్ లో కూడా రేవంత్ రెడ్డి పై మరో కేసు నమోదు చేశారు పోలీసులు   అయితే రేవంత్ రెడ్డి ఇలా టిపిసిసి పదవిలో ఎన్నికైన కొన్ని రోజుల్లోనే రేవంత్ రెడ్డి పై పోలీసులు కేసులు నమోదు చేయడంపై మాత్రం అటు కాంగ్రెస్ శ్రేణులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే రేవంత్ రెడ్డి పై కేసు నమోదు చేశారు అంటూ విమర్శలు చేస్తున్నారు. మరోవైపు టిపిసిసి అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి అటు రేవంత్ రెడ్డి ఎంతో దూకుడుగా ముందుకు సాగుతున్నారు.



తెల్లవారితే నిశ్చితార్థం.. ఇంతలోనే ఊహించని ఘటన..!

ఆ తెలంగాణ మంత్రి, ఎమ్మెల్యేను టీఆర్ఎస్సే ఓడిస్తుందా ?

కొత్త బిచ్చగాళ్ళోచ్చారు.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్?

ఆ వైసీపీ నేత‌కు మ‌హ‌ర్ద‌శ ప‌ట్ట‌నుందా.. జ‌గ‌న్ డెసిష‌న్ ఏంటో ?

తెలంగాణ వ్యాప్తంగా షర్మిల పాదయాత్ర..

అన్న బ‌ద్ధ శ‌త్రువుతో ష‌ర్మిల చెతులు క‌లిపారా...!

పేరెంట్స్ పర్యవేక్షణ లేక పిల్లలు ఈ విధంగా తయారవుతున్నారా..?

ఆదర్శంగా మారనున్న బెంగళూరు గవర్నమెంట్ స్కూల్...

షర్మిల పార్టీపై వైసీపీ స్టాండ్ ఇదే.. క్లారిటీ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>