MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan80d15ddc-9a83-4063-a79d-43bcd4ead191-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan80d15ddc-9a83-4063-a79d-43bcd4ead191-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆయన అల్లూరి సీతారామరాజు గా నటిస్తుండగా, మరో కథానాయకుడు ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటించబోతున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తుండగా బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇకపోతే మరో పాన్ ఇండియా సినిమా గా టాలీవుడ్ నుంచి రాబోతున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.ram charan{#}Bahubali;NTR Kathanayakudu;Graphics;RRR Movie;Komaram Bheem;Alluri Seetha Rama Raju;Alluri Sitarama Raju;shankar;Rajamouli;Industry;Ram Charan Teja;Prabhas;Pawan Kalyan;Darsakudu;Director;dil raju;Audience;koratala siva;Tollywood;News;Cinema;Indiaప్రభాస్, ఎన్టీఆర్ లకు షాక్ ఇస్తున్న చరణ్!!ప్రభాస్, ఎన్టీఆర్ లకు షాక్ ఇస్తున్న చరణ్!!ram charan{#}Bahubali;NTR Kathanayakudu;Graphics;RRR Movie;Komaram Bheem;Alluri Seetha Rama Raju;Alluri Sitarama Raju;shankar;Rajamouli;Industry;Ram Charan Teja;Prabhas;Pawan Kalyan;Darsakudu;Director;dil raju;Audience;koratala siva;Tollywood;News;Cinema;IndiaThu, 08 Jul 2021 17:00:00 GMT
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆయన అల్లూరి సీతారామరాజు గా నటిస్తుండగా, మరో కథానాయకుడు ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటించబోతున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తుండగా బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇకపోతే మరో పాన్ ఇండియా సినిమా గా టాలీవుడ్ నుంచి రాబోతున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.

ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ చేస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నిన్నటి వరకు ఈ సినిమా చేయడానికి దర్శకుడు శంకర్ కు కొన్ని అడ్డంకులు ఉన్నా ఇప్పుడు అవన్నీ తొలగిపోవడంతో త్వరలోనే పట్టాలెక్కడం ఖాయమని చెబుతున్నారు. పొలిటికల్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని శంకర్ మరో రేంజ్  చేయబోతున్నాడట. దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమా దాదాపు రెండు వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది అని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

సెప్టెంబర్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట దర్శక నిర్మాతలు. ప్రీ ప్రొడక్షన్ పనులను దర్శకుడు ఇప్పటికే పూర్తి చేసుకోగా సినిమాలో గ్రాఫిక్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఉందని అందువల్ల శంకర్ వేగంగానే షూటింగ్ ను పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన క్యాస్టింగ్ సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొను సమ్మర్ కి వస్తూ ఉండటంతో ప్రభాస్ ఎన్టీఆర్ లు కూడా అదే సమయంలో తమ సినిమాలను తీసుకు వస్తుండడంతో ఈ మూడు సినిమాలు క్లాష్ అవుతున్నాయట. సలార్, కొరటాల శివ ఎన్టీఆర్ ల సినిమా కూడా సమ్మర్ కే రిలీజ్ చేస్తున్నారు. 



సినిమా ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన "తిమ్మరుసు"...

బాలీవుడ్ ఇండస్ట్రీకి ధీటుగా ఎదిగిన సౌత్ ఫిలిం ఇండస్ట్రీ..?

పవన్ కళ్యాణ్ ముందుగా అయ్యప్పనున్ కోషియం రీమేక్ ని పూర్తి చేసి విడుదల చేయాలని భావిస్తున్నాడట.ఈ విషయమై దర్శకుడు క్రిష్ తో పవన్ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో రెండు చిత్రాల దర్శకనిర్మాతలు ఒక మాట మీద రావడంతో ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాను.. వాయిదా వేయడానికి నిర్ణయించినట్లు సమాచారం.

దళపతి విజయ్ సినిమా చూపిస్తూ.. ఆపరేషన్ చేసిన వైద్యులు?

కత్తి ఆరోగ్యం పై పవన్ ఆరా.. !

సీరియల్ హీరోయిన్ భర్త కూడా హీరో నే.. ఎవరో చూడండి

కూతురితో భారీ సినిమా ప్లాన్ చేసిన రజనీకాంత్..?

చైతు లవ్ స్టోరీకి 10 ఆఫర్లు.. అయినా వెనక్కి తగ్గలేదు..!

డైరెక్టర్లతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న హీరోయిన్లు వీళ్ళే..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>