LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/gas-adha40da2883-7542-42c8-9e54-dc013b57470a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/gas-adha40da2883-7542-42c8-9e54-dc013b57470a-415x250-IndiaHerald.jpgపూర్వకాలంలో వంట చేయాలి అంటే కట్టెల పొయ్యి మాత్రమే వినియోగించేవారు. కానీ ఇటీవల కాలంలో కాలానుగుణంగా వస్తున్న టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుని, ప్రతి ఒక్కరూ గ్యాస్ స్టవ్ ఉపయోగిస్తున్న తీరును మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే మారుమూల ప్రాంతాల్లో కట్టెల పొయ్యిని మనం చూడగలుగుతాము. ఇక ఇటీవల కాలంలో పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామాలలో కూడా గ్యాస్ స్టవ్ ను వినియోగించడం మొదలు పెట్టాక, గ్యాస్ ఉత్పత్తి కూడా తగ్గుతున్న తరుణం మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ గ్యాస్ ధర కూడా రోజురోజుకు పెరిగిపోGAS ADHA{#}Adah Sharma;Gas Stove;Manam;vegetable marketలైఫ్ స్టైల్: ఇలా చేస్తే కుకింగ్ గ్యాస్ ఆదా చేయవచ్చు..?లైఫ్ స్టైల్: ఇలా చేస్తే కుకింగ్ గ్యాస్ ఆదా చేయవచ్చు..?GAS ADHA{#}Adah Sharma;Gas Stove;Manam;vegetable marketThu, 08 Jul 2021 19:00:00 GMT
పూర్వకాలంలో వంట చేయాలి అంటే కట్టెల పొయ్యి మాత్రమే వినియోగించేవారు. కానీ ఇటీవల కాలంలో కాలానుగుణంగా వస్తున్న టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుని, ప్రతి ఒక్కరూ గ్యాస్ స్టవ్ ఉపయోగిస్తున్న తీరును మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే మారుమూల ప్రాంతాల్లో కట్టెల పొయ్యిని మనం చూడగలుగుతాము. ఇక ఇటీవల కాలంలో పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామాలలో కూడా గ్యాస్ స్టవ్ ను వినియోగించడం మొదలు పెట్టాక, గ్యాస్ ఉత్పత్తి కూడా తగ్గుతున్న తరుణం మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ గ్యాస్ ధర కూడా రోజురోజుకు పెరిగిపోతోంది.

ఇంతకుముందు గ్యాస్ తీసుకున్న తర్వాత సబ్సిడీ రూపంలో కొంత డబ్బు వెనక్కి వచ్చేది. ప్రస్తుత కాలంలో డబ్బు కూడా వెనక్కి రావడం లేదు. పైగా ఒక్కో సిలిండర్ ధర రూ.900 నుంచి తొమ్మిది వందల యాభై రూపాయల ధర పలుకుతోంది. ఈ నేపథ్యంలోనే మనం గ్యాస్ ను ఆదా చేసుకోవడం నేర్చుకోవాలి. ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాల ద్వారా గ్యాస్ ఆదా చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చదివి తెలుసుకుందాం.

1. వంట చేసేటప్పుడు వంటకు కావలసిన పదార్థాలు అన్నీ ఒకేసారి దగ్గరగా ఉంచుకోవాలి. లేదంటే గ్యాస్ స్టవ్ ఆన్లైన్ లో ఉంచి , ఇతర పదార్థాల కోసం వెతుకులాటలో గ్యాస్ ఎక్కువగా వృధా అవుతుంది.

2. స్టవ్ మీద కుక్కర్ ను ఉపయోగించేటప్పుడు రెండు విజిల్స్ రాగానే మంటను సిమ్ లో ఉంచుకోవడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల గ్యాస్ ఆదా అవుతుంది.

3. ఇక ఏదైనా పప్పు దినుసులను కూరగా చేయాలనుకున్నప్పుడు, ముందుగా అరగంట పాటు ఆ పప్పును నీటిలో నానబెట్టాలి. ఇక దీనిని కుక్కర్ లో  వేయగానే తొందరగా ఉడకడంతో పాటు గ్యాస్ కూడా ఆదా అవుతుంది.

4. కొంతమంది ఏదైనా వంట వండేటప్పుడు , కూరలో నీళ్లు సరిపోలేదని అప్పుడప్పుడు నీళ్లు జోడిస్తూ ఉంటారు. అలా  మధ్య మధ్యలో నీళ్లు జోడించడం వల్ల కూరగాయలు ఉడకడానికి సమయం పడుతుంది. అలాగే గ్యాస్ కూడా వృధా అవుతుంది. ఒకేసారి కూరకు ఎంత  నీరు అవసరం అవుతుందో తెలుసుకుని నీళ్ళు జోడించాలి. తద్వారా గ్యాస్ ఆదా చేసుకోవాలి.

5. ఇక మరికొంతమంది కూర త్వరగా కావాలని పెద్ద మంట పై వంట చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల కూడా గ్యాస్ వృధా అవుతుంది. అలాగే కూర ఉడికిందో లేదో తెలుసుకునేందుకు మధ్య మధ్యలో మూత తీస్తూ, వేస్తూ ఉండడం వల్ల కూడా గ్యాస్ ఎక్కువగా వృధా అవుతుంది అని అంటున్నారు నిపుణులు.





గద్దలకి పాస్ పోర్ట్.. ఇదేం వింత గురూ!

తేలిపోతున్న బాలీవుడ్.. సౌతా.. మజాకా..!!

వంటను ఎప్పుడూ కుక్కర్లో ఉడికించిడానికి ప్రయత్నించడం, కూరను వండేటప్పుడు చిన్నమంటపై చేయడం, మధ్యలో మధ్యలో నీళ్లు జోడించకపోవడం, కూర ఉడికేటప్పుడు మూత తీస్తూ వేస్తూ ఉండకపోవడం లాంటి పనులు చేయడం వల్ల గ్యాస్ ను ఆదా చేయవచ్చు

CSK అభిమానులకు గుడ్ న్యూస్.. ఎందుకో తెలుసా !

మంచిమాట: మూర్ఖులతో అనవసర ప్రసంగాలు చేయరాదు..

విజయ్ సినిమా చూపిస్తూ బాలుడికి ఆపరేషన్.. !

ఇంట్లో దొరికే ఈ 5 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.. !

భయాన్ని తగ్గించుకోవాలంటే ఇవి పాటించండి...?

జీడిపప్పుతో ఫ్రై ఎప్పుడన్నా ట్రై చేసారా.?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>