MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tolllywoood8a9cf65f-6de4-4186-ba59-4a939bc5890b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tolllywoood8a9cf65f-6de4-4186-ba59-4a939bc5890b-415x250-IndiaHerald.jpgకరోనా పరిస్థితులు తరువాత సినిమా ఇండస్ట్రీలో చాల మార్పులు జరుగుతున్నాయి. ఈ మార్పులు వల్ల పెద్ద హీరోల పరిస్థితులలో మార్పు లేదు కాని మీడియం రేంజ్ హీరోల పరిస్థితి అయోమయంలో పడుతూ వారికి ఎదురీత మొదలైందా అన్న సంకేతాలు వస్తున్నాయి.ఇండస్ట్రీలోకి ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు కొత్త హీరో వస్తూనే ఉంటాడు. అయితే ఆ కొత్త హీరోలు తమ సినిమాల హిట్స్ విషయంలో తమ కెరియర్ గ్రాఫ్ ను కొనసాగించ లేకపొతున్నారు. ఒక హిట్ పడగానే మీడియం రేంజ్ హీరో తన పారితోషికాన్ని విపరీతంగా పెంచడం మరో రెండు ఫ్లాప్ లు తగలగానే ఆ హీరో తన పారితోషిtolllywoood{#}santosh sobhan;Kanna Lakshminarayana;Industry;vegetable market;Hero;Audience;Cinema;Coronavirusమీడియం రేంజ్ హీరోలకు మొదలైన ఎదురీత !మీడియం రేంజ్ హీరోలకు మొదలైన ఎదురీత !tolllywoood{#}santosh sobhan;Kanna Lakshminarayana;Industry;vegetable market;Hero;Audience;Cinema;CoronavirusThu, 08 Jul 2021 11:07:46 GMTకరోనా పరిస్థితులు తరువాత సినిమా ఇండస్ట్రీలో చాల మార్పులు జరుగుతున్నాయి. ఈ మార్పులు వల్ల పెద్ద హీరోల పరిస్థితులలో మార్పు లేదు కాని మీడియం రేంజ్ హీరోల పరిస్థితి అయోమయంలో పడుతూ వారికి ఎదురీత మొదలైందా అన్న సంకేతాలు వస్తున్నాయి.



ఇండస్ట్రీలోకి ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు కొత్త హీరో వస్తూనే ఉంటాడు. అయితే ఆ కొత్త హీరోలు తమ సినిమాల హిట్స్ విషయంలో తమ కెరియర్ గ్రాఫ్ ను కొనసాగించ లేకపొతున్నారు. ఒక హిట్ పడగానే మీడియం రేంజ్ హీరో తన పారితోషికాన్ని విపరీతంగా పెంచడం మరో రెండు ఫ్లాప్ లు తగలగానే ఆ హీరో తన పారితోషికాన్ని సగానికి తగ్గించుకావడంతో ప్రస్తుత పరిస్థితులలో మీడియం రేంజ్ హీరోల మార్కెట్ అయోమయంలో పడిపోతోంది.



గత సంవత్సరం వరకు ప్రేక్షకులు పెద్ద హీరోల సినిమాలతో పాటు మీడియం రేంజ్ చిన్న హీరోల సినిమాలను కూడ బాగా చూసేవారు. అయితే ఇప్పుడు ఓటీటీ హవా పెరిగి పోవడంతో చిన్న హీరోల సినిమాలను ఓటీటీ లో చూడటానికి టాప్ హీరోల సినిమాలను ధియేటర్లలో చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు అన్న సంకేతాలు వస్తున్నాయి. ‘ఉప్పెన’ ‘జాతిరత్నాలు’ లాంటి ఊహించని హిట్స్ తప్పించి చిన్న మీడియం రేంజ్ హీరోలు నటించిన సినిమాలు అన్నీ ఫ్లాప్ అవుతూ ఉండటంతో చిన్న మీడియం రేంజ్ హీరోల మార్కెట్ ప్రశ్నార్థకంగా మారింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.



విష్వక్ సేన్, నవీన్ పోలిశెట్టి, సత్యదేవ్, తేజు సజ్జా, సంతోష్ శోభన్ లాంటి కొత్త హీరోలు ఈ కరోనా సమయంలో పుట్టుకు వచ్చి వారికంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకున్నారు. ఇలాంటి హీరోలతో 10 కోట్లతో సినిమాలు తీయవచ్చు. అయితే మిడిల్ రేంజ్ హీరోలతో అయితే ఆసినిమాకు కనీసం 25 కోట్లకు పైగా ఖర్చు పెట్టవలసి వస్తోంది. దీనితో మిడిల్ రేంజ్ హీరోల పై జూదం ఆడే కన్నా క్రేజ్ ఉన్న కొత్త హీరోలతో సినిమాలు తీస్తే అసలకు ఎదురుండదు అన్న అభిప్రాయంలోకి ఇండస్ట్రీ వర్గాలు వచ్చినట్లు తెలుస్తోంది..  






వామ్మో: ఇన్ని బాల్య వివాహాలు ఆగాయా..?

శంకర్ కూతురి పెళ్లికి ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా..?

దేశంలో భారీగా కరోనా...తాజా కేసులివే.. !

హైపర్ ఆదికి లక్కీ ఛాన్స్.. దశ తిరిగినట్టే ?

మనీ : రూ.500 కడితే.. రూ.17 లక్షలు మీ సొంతం..

కృష్ణ, పూరీ ల సినిమా కాంబో వచ్చుంటే ఎలా ఉండేదో?

ఆహుతి సినిమా తో ఆహుతి ప్రసాద్ గా మారిన జనార్ధన వరప్రసాద్!!

జ‌గ‌న్‌పై వీళ్లంతా ర‌గులుతున్నారుగా.. స‌ర్కార్‌కు పెద్ద దెబ్బే ?

సినిమా టైటిల్‌ని ఇంటిపేరుగా మార్చుకున్న స్టార్ కమెడియన్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>