BeautyMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beautyf0210b7d-1983-414c-816e-c3cc44d84596-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beautyf0210b7d-1983-414c-816e-c3cc44d84596-415x250-IndiaHerald.jpgచర్మం అందంగా ఉంటే అది మన లైఫ్ స్టైల్ ని తెలియ చేస్తుంది. లాక్ డౌన్ వల్ల బ్యూటీ పార్లర్ లకు వెళ్ళడం సాధ్యం కాదు కాబట్టి ఇంట్లోనే అధికంగా ఉండటంతో చర్మాన్ని పరిరక్షించుకోవడానికి తగినంత సమయం దొరికింది. అలాగే పొల్యూషన్ నుంచి కూడా విముక్తి లభిస్తుంది. ఈ సమయంలో మనం నిత్యం ఇంట్లో వాడే పదార్థాలతోనే చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. అదెలాగో చూద్దాం. నిమ్మకాయ లేదా చింత పండు: ఇవి ఆరోగ్యపరంగానే కాక సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడతాయి. వీటిలో ఉండే సిట్రిక్ యాసిడ్, సహజ సిద్ధమైన బ్లీచింగ్ వల్ల అది చర్మంపై ఉన్న మలినbeauty{#}Turmeric;Tamarind;Cinnamon;Soundarya;pollution;Manam;BEAUTYఇంట్లో దొరికే ఈ 5 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.. !ఇంట్లో దొరికే ఈ 5 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.. !beauty{#}Turmeric;Tamarind;Cinnamon;Soundarya;pollution;Manam;BEAUTYThu, 08 Jul 2021 13:30:28 GMTచర్మం అందంగా ఉంటే అది మన లైఫ్ స్టైల్ ని తెలియ చేస్తుంది. లాక్ డౌన్ వల్ల బ్యూటీ పార్లర్ లకు వెళ్ళడం సాధ్యం కాదు కాబట్టి ఇంట్లోనే అధికంగా ఉండటంతో చర్మాన్ని పరిరక్షించుకోవడానికి తగినంత సమయం దొరికింది. అలాగే పొల్యూషన్ నుంచి కూడా విముక్తి లభిస్తుంది. ఈ సమయంలో మనం నిత్యం ఇంట్లో వాడే పదార్థాలతోనే చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. అదెలాగో చూద్దాం.

నిమ్మకాయ లేదా చింత పండు: ఇవి ఆరోగ్యపరంగానే కాక సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడతాయి. వీటిలో ఉండే సిట్రిక్ యాసిడ్, సహజ సిద్ధమైన బ్లీచింగ్ వల్ల అది చర్మంపై ఉన్న మలినాలను తొలగిస్తుంది. మెరిసే ముఖం కోసం నిమ్మరసం, తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత కడగాలి, లేదా చింతపండు రసం కూడా ముఖానికి రాసుకుని ఆరాక కడిగితే ముఖం ప్రకాశవంతంగా ఉంటుంది.

బంగాళా దుంపలు :  ఇవి ముఖ చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. ఆలూ ని పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో కడగాలి. దీని వల్ల కళ్ళ కింద ఉండే నల్ల మచ్చలు తొలగిపోతాయి.

తేనె: మొటిమలు ఉన్నా, ఆయిలీ స్కిన్ అయినా తేనెలో దాల్చిన చెక్క పొడి కలిపి రాస్తే చక్కటి గుణం ఉంటుంది. అలాగే తేనె ను రోజుకి రెండు సార్లు ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం కాంతివంతంగా ఉంటుంది.

పసుపు: పసుపు ఆరోగ్య పరంగానే కాక సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. పసుపు,తేనె, నిమ్మరసం కలిపి మిక్స్ చేసి ముఖానికి రాసి కాసేపు ఆగి కడగాలి. ఇలా చేయడం వల్ల స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తుంది. చర్మాన్ని కాంతివంతం చేసి ఫ్రెష్ గా కనపడేలా చేస్తుంది.

మెంతులు: ఒక స్పూన్ మెంతులను రాత్రంతా నానబెట్టి తర్వాతి రోజు మెత్తగా రుబ్బాలి. ఆ మిశ్రమానికి తేనె కలిపి ముఖానికి పూతలా వేయాలి ఇలా చేయడం వల్ల ముఖంపై ముడతలు కనపడవు. వయసు ముదురుతున్న ఛాయలు ఉండవు.



అనంతపురం : రాయదుర్గం పట్టణంలోని మార్కెట్ యార్డులో వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభించిన సీఎం జగన్.

భయాన్ని తగ్గించుకోవాలంటే ఇవి పాటించండి...?

జిమ్ లో తెగ వర్క్ ఔట్స్ చేస్తున్న రాశీ..?

ఆరు మాసాల బిడ్డను పక్కన పెట్టి అంబులెన్స్ డ్రైవర్ గా సేవలు అందిస్తున్న మహిళ

దాదా ఒక సారధి దాదా ఒక వారధి!

మళ్ళీ ధరలు పెంచిన టాటా..

పాస్ వర్డ్స్ పదేపదే మారుస్తున్నారా? జాగ్రత్త...

చుండ్రు పూర్తిగా తగ్గాలంటే ఇలా చెయ్యండి..

చిన్న పిల్లలకు అలాంటివి చెప్పడం అక్కడ నేరమట..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>