Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cobgress506812d0-ddc0-4d20-80f9-91d2ed9d9977-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cobgress506812d0-ddc0-4d20-80f9-91d2ed9d9977-415x250-IndiaHerald.jpgనిన్నటి వరకు తెలంగాణ కాంగ్రెసు పార్టీలో పిసిసి పదవికి సంబంధించిన రగడ నడిచింది. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం టిపిసిసి పదవి ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు ఎన్నో వార్తలు వచ్చాయి. ఐతే కొత్తగా పార్టీలోకి వచ్చిన రేవంత్ రెడ్డి కి కాకుండా ఇక మొదటి నుంచి పార్టీని ముందుకు నడిపిస్తున్న సీనియర్ నేతల్లో ఒకరికి పీసీసీ పదవి అప్పగించాలని అంటూ కాంగ్రెస్ సీనియర్ నేతలు అందరూ వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారిపోయింది. ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి Cobgress{#}Malkajgiri;politics;Qualification;Congress;revanth;venkat;Revanth Reddy;Y. S. Rajasekhara Reddy;Telangana;Party;Newsకాంగ్రెస్ లోనే ఉంటా.. కానీ గాంధీభవన్లో కూర్చోలేను : కోమటిరెడ్డికాంగ్రెస్ లోనే ఉంటా.. కానీ గాంధీభవన్లో కూర్చోలేను : కోమటిరెడ్డిCobgress{#}Malkajgiri;politics;Qualification;Congress;revanth;venkat;Revanth Reddy;Y. S. Rajasekhara Reddy;Telangana;Party;NewsThu, 08 Jul 2021 16:50:00 GMTనిన్నటి వరకు తెలంగాణ కాంగ్రెసు పార్టీలో పిసిసి పదవికి సంబంధించిన రగడ నడిచింది. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం టిపిసిసి పదవి ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు ఎన్నో వార్తలు వచ్చాయి. ఐతే కొత్తగా పార్టీలోకి వచ్చిన రేవంత్ రెడ్డి కి కాకుండా ఇక మొదటి నుంచి పార్టీని ముందుకు నడిపిస్తున్న సీనియర్ నేతల్లో ఒకరికి పీసీసీ పదవి అప్పగించాలని అంటూ కాంగ్రెస్ సీనియర్ నేతలు అందరూ వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారిపోయింది. ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి..  మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ల మధ్య టిపిసిసి పదవి కోసం తీవ్రస్థాయిలో పోటీ నడిచింది.



 వీరిద్దరిలో టిపిసిసి పదవి ఎవరికి వరించబోతుంది  అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది  అయితే గత కొన్ని రోజుల పాటు ఇద్దరు ఢిల్లీలోనే ఉండడం మరింత ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఇక ఎట్టకేలకు ముందునుంచి అనుకున్నట్లుగానే రేవంత్ రెడ్డి కే టిపిసిసీ పదవిని అప్పజెప్పింది కాంగ్రెస్ అధిష్టానం.  రేవంత్ రెడ్డి టిపిసిసి పదవికి ఎన్నికైన నాటినుండి అటు కాంగ్రెస్ సీనియర్ నేతలను కలుస్తూ వారందరినీ కలుపుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇటీవలే పిసిసి అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం కూడా చేశారు రేవంత్ రెడ్డి.  అయితే ఇప్పుడు వరకు అందరూ స్పందించి ఇక తెలంగాణ పార్టీ అధ్యక్షుడు అయిన రేవంత్ రెడ్డి తో కలిసి పని చేసేందుకు సిద్ధంగానే ఉన్నాము అంటూ ప్రకటించారు.



 అయితే అటు కోమటిరెడ్డి మాత్రం టిపిసిసి పదవి దక్కలేదని నిరాశలో ఉన్నారని.. ఇతర పార్టీ లోకి వెళ్ల పోతున్నారు అన్న వార్తలు హాట్ టాపిక్ గా మారిపోయాయి. అయితే తాజాగా స్పందించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఇటీవలే వైఎస్ఆర్ జయంతి సందర్భంగా భువనగిరి లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి టిపిసిసి 10 రాకపోవడం ఎంతగానో బాధ కలిగించిందన్నారు.  అర్హత ఉండి ఇవ్వలేదు అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఎన్నో పార్టీల నుంచి ఆహ్వానాలు వచ్చాయని కానీ తాను ఏ పార్టీలో కి వెళ్ళకుండా కాంగ్రెస్లోనే కొనసాగాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు కోమటిరెడ్డి. ఇక పార్టీలో గ్రూపు రాజకీయాలు చేస్తే అందరు నష్టపోతామని..  అంతేకాకుండా గాంధీభవన్లో కూర్చుంటే కెసిఆర్ పై పోరాడ లేము అంటూ వ్యాఖ్యానించారు  కెసిఆర్ ని ఓడించాలంటే అందరూ కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పుకొచ్చారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.



వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావం

మాటకు ప్రాణమిచ్చే వాళ్లు, మాట్లాడక పోతే ప్రాణం పోయిందనుకునే వాళ్ళు!

జగన్ వద్దన్నా షర్మిల పార్టీ పెట్టారు.. సజ్జల షాకింగ్ కామెంట్స్?

చంద్రబాబు.. అప్పుడేమైనా గాడిదలు కాసారా : జగన్

వైయస్సార్ కు భారతరత్న?

ప్రభాస్, ఎన్టీఆర్ లకు షాక్ ఇస్తున్న చరణ్!!

జగన్ పై తిట్లు.. షర్మిలపై ప్రశంసలు.. అదిరిందయ్యా పవన్?

భార్య నిర్మాతగా... భర్త వెబ్ సిరీస్ ?

డబుల్ బెడ్ రూమ్ రాలేదని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>