Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/toung-abfdf746-3725-4673-83ef-22a4365774a2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/toung-abfdf746-3725-4673-83ef-22a4365774a2-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఎవరైనా నాలుకతో ముక్కు అందుకోగలరా.. ఇలాంటివి చేయడం కేవలం కొంతమందికి మాత్రమే సాధ్యమవుతుంది.. అయితే ఇలా నాలుకతో ముక్కుని అందుకున్నప్పుడు వావ్ అంటూ ఉంటారు అందరూ. కానీ ఇక్కడ ఓ యువకుడు మాత్రం నాలుకతో ముక్కు అందుకోవడం కాదు ఏకంగా కళ్లను కూడా అందుకుంటున్నాడు. ఇక తన పొడవాటి నాలికతో అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాడు ఇక్కడ ఒక వ్యక్తి. ఇక తమిళనాడుకు చెందిన వ్యక్తి తన నాలుకతో ముక్కును కళ్ళ నే కాదు అతని మోచేతిని కూడా అందుకుంటూ వావ్ అనిపిస్తున్నాడు. ఇక పొడవైన నాలుకతో ప్రస్తుతం వార్తల్లో హాట్ టాపికToung {#}praveenఇతని నాలుక ఏంటి ఇంత పొడుగుంది.. చూస్తే హడలిపోతారు?ఇతని నాలుక ఏంటి ఇంత పొడుగుంది.. చూస్తే హడలిపోతారు?Toung {#}praveenThu, 08 Jul 2021 19:35:00 GMTసాధారణంగా ఎవరైనా నాలుకతో ముక్కు అందుకోగలరా.. ఇలాంటివి చేయడం కేవలం కొంతమందికి మాత్రమే సాధ్యమవుతుంది..  అయితే ఇలా నాలుకతో ముక్కుని అందుకున్నప్పుడు వావ్ అంటూ ఉంటారు అందరూ. కానీ ఇక్కడ ఓ యువకుడు  మాత్రం నాలుకతో ముక్కు అందుకోవడం  కాదు ఏకంగా కళ్లను కూడా అందుకుంటున్నాడు. ఇక తన పొడవాటి నాలికతో అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాడు ఇక్కడ ఒక వ్యక్తి. ఇక తమిళనాడుకు చెందిన వ్యక్తి తన నాలుకతో ముక్కును కళ్ళ నే కాదు అతని మోచేతిని  కూడా అందుకుంటూ వావ్ అనిపిస్తున్నాడు. ఇక పొడవైన నాలుకతో ప్రస్తుతం వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు ఈ యువకుడు.



 వివరాల్లోకి వెళితే.. విరుదునగర్ లోని తిరుతంగల్ కు చెందిన ప్రవీణ్ కుమార్ అనే 20 ఏళ్ల యువకుడు తన పొడవాటి నాలికతో అందరినీ షాక్ కి గురి చేస్తున్నాడు. సాధారణ మనిషికి ఉండాల్సిన నాలుక కంటే అతని నాలుక కాస్త పొడవుగా ఉంది. సాధారణంగా అయితే పురుషుల నాలుక 8.5 సెంటీమీటర్లు ఉంటుంది. కానీ ఇతని నాలిక మాత్రం 10.8 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. దీంతో ఇక అతని నాలుక తో విన్యాసాలు చేస్తున్నాడు సదరు వ్యక్తి. అంతేకాదు మరికొన్ని రోజుల్లో వరల్డ్ గిన్నిస్ బుక్ రికార్డు కొట్టేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఈ యువకుడికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.



 సాధారణంగా అయితే వరల్డ్ గిన్నిస్ బుక్ రికార్డు ప్రకారం ఇక అత్యంత పొడవైన నాలుక 10.1 సెంటీ మీటర్లు మాత్రమే. 2012లో కాలిఫోర్నియాకు చెందిన నిక్  పేర్లు అనే వ్యక్తి పేరు మీద ఈ రికార్డు నమోదు అయింది. ఇక అతను ప్రపంచంలోనే అతి పొడవైన నాలుకను కలిగి ఉన్న వ్యక్తిగా గుర్తించబడ్డాడు. అయితే ఇతని నాలుకతో పోల్చిచూస్తే ఏకంగా తమిళనాడుకు చెందిన ప్రవీణ్ అనే యువకుడు నాలిక మరింత పొడవుగా ఉంది. దీంతో మరికొన్ని రోజుల్లో ఇతను ఇక గిన్నిస్బుక్ రికార్డును సైతం కొట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం బీఈ రోబోటిక్స్ చదువుతున్న ప్రవీణ్ తన నాలుకతో ఆసియా బుక్ ఆఫ్ రికార్డుల్లో ఇప్పటికే స్థానం సంపాదించాడు. కేవలం ఒక్క నిమిషం లోనే తన నాలుకను 219 సార్లు తాకి రికార్డు  దక్కించుకున్నాడు. ఇలాంటి పొడవైన నాలుక వల్ల తనకు ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ చెప్పుకొస్తున్నాడుయువకుడు  .





సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>