CrimeMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crime-a0b719d5-8be5-4547-a104-7ebffa83e389-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crime-a0b719d5-8be5-4547-a104-7ebffa83e389-415x250-IndiaHerald.jpgప్రస్తుత కాలంలో మనవాడు అనే ప్రేమాభిమానాలు లేకుండాపోయాయి. ఆస్తుల కోసం, కామవాంఛ కోసం ఎవరు ఎవరిని చంపుతున్నారో, ఏ విధంగా చంపుతున్నారో అర్థంకాని పరిస్థితిలో ఉన్నాం. దేశంలో రోజు రోజుకు ఇలాంటి ఘటనలు వందల సంఖ్యలో చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు పట్టణాల్లోనే ఆస్తుల కోసం చంపుకునేవారు. ప్రస్తుత కాలంలో మారుమూల గ్రామాల్లో కూడా చిన్నచిన్న ఆస్తుల గొడవలకు ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. మానవత్వాన్ని మరుస్తున్నారు. అనేక మరణాలకు దారితీస్తున్నారు. అలాంటి ఒక్క కుటుంబమే తమతో రోజు ఉన్న ఒక వ్యక్తిని హతమార్చింది. అదేమిCrime {#}Warangal;Tammudu;Hanamkonda;Thammudu;Car;Yevaru;king;Wife;policeరక్త సంబంధీకులే కాలయములైతే.. చివరికి..?రక్త సంబంధీకులే కాలయములైతే.. చివరికి..?Crime {#}Warangal;Tammudu;Hanamkonda;Thammudu;Car;Yevaru;king;Wife;policeThu, 08 Jul 2021 09:05:00 GMTప్రస్తుత కాలంలో  మనవాడు అనే ప్రేమాభిమానాలు లేకుండాపోయాయి. ఆస్తుల కోసం, కామవాంఛ కోసం ఎవరు ఎవరిని చంపుతున్నారో, ఏ విధంగా చంపుతున్నారో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. దేశంలో రోజు రోజుకు ఇలాంటి ఘటనలు వందల సంఖ్యలో చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు పట్టణాల్లోనే ఆస్తుల కోసం చంపుకునేవారు. ప్రస్తుత కాలంలో  మారుమూల గ్రామాల్లో కూడా చిన్నచిన్న ఆస్తుల గొడవలకు ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. మానవత్వాన్ని మరుస్తున్నారు. అనేక మరణాలకు దారితీస్తున్నారు. అలాంటి ఒక్క కుటుంబమే తమతో రోజు ఉన్న ఒక వ్యక్తిని హతమార్చింది. అదేమిటో ఎక్కడో చూద్దాం..?

 అదంతా ఒకటే కుటుంబం. రోజు వాళ్లతో ఆనందంగా ఉన్న వ్యక్తిని వాళ్లంతా కలిసి హతమార్చారు. అసలు అతను చేసిన తప్పు ఏమిటి. తమ్ముడు నాగరాజు, ప్రవీణ్, చెల్లెలు సరిత, తల్లి ప్రమీలా కలిసి ఒకటై పోయి ఆ వ్యక్తి రాజేష్ తో గొడవకు దిగారు. వీరి మధ్య మాటా మాటా పెరగడంతో అందరూ కలిసి ఒక్కటై రాజేష్ పై దాడి చేసి, పెద్ద బండరాయితో రాజు తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సొంత కుటుంబమే ఇంత దారుణానికి ఒడిగట్టారు. తల్లి, తమ్ముడు, సోదరి తన రక్త సంబంధీకులే కాలయము డయ్యరు. ఆస్తి, అంతస్తులే ఆ కుటుంబంలో చిచ్చు పెట్టిందా. వివరాల్లోకి వెళితే వరంగల్ జిల్లాలోని  దుగ్గొండి మండల కేంద్రం బంధం పల్లిలో ఈ సంఘటన జరిగింది. ప్రమీల అనే మహిళకు మొత్తం ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. ఆ ముగ్గురు కుమా రులు రాజేష్, ప్రవీణ్, నాగరాజు, కుమార్తె సరిత. రాజేష్ గత కొద్ది రోజులుగా  హన్మకొండ పట్టణంలో కారు నడుపుతూ జీవనం సాగిస్తు న్నాడు. తన భార్య పిల్లలతో కలిసి అక్కడే నివాసం ఉంటున్నాడు. ఆస్తి పంపకాల కొరకు ఇటీవల రాజేష్ తన సొంత ఇంటికి  భార్య శైలజ రెండేళ్ల కుమారుడు కూడా ఆయనతో ఇంటికి వచ్చారు.

 ఆస్తి విషయంలో అందరూ కూర్చుని మాట్లాడుకుంటు న్నారు. పంపకాల విషయంలో కొద్దిగా తేడా వచ్చింది. గొడవ జరిగింది. అందరూ మూకుమ్మడిగా రాజేష్ ని టార్గెట్ చేశారు. తమ్ముడు ప్రవీణ్, నాగరాజు,సరిత, తల్లి అందరూ ఒకటే రాజేష్ తో వాగ్వాదానికి దిగి, మాటా మాటా పెరగ డంతో  వారంతా కలిసి రాజేష్ ను బండరాయితో కొట్టి హతమార్చారు. కొన ఊపిరితో ఉన్న రాజేష్ ను  ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కానీ మార్గమధ్యంలోనే ఆయన కన్నుమూశారు. మృతుడి భార్య శైలజ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇట్టి సంఘటన స్థలాన్ని నర్సంపేట ఏసిపి పణిందర్, సీఐ సతీష్, ఎస్సై వెంకటేశ్వర్లు సందర్శించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.



తొలి సినిమాతోనే అందరి ' దిల్ ' దోచుకున్న రాజు..!!

కృతి శెట్టికి మరో లక్కీ ఛాన్స్..!

24 గంటల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతం !

ప్రియుడితో ఆ పని చేస్తుండగా చూసిన భర్త షాక్...?

మనోభావాల ఉచ్చులో ఆర్ ఆర్ ఆర్ ?

రామ్ చరణ్ డేట్ కి వెళ్ళింది ఎవరితోనో తెలుసా ?

టీవీ: బిగ్ బాస్-5 లో కీ మరో బుల్లితెర నటి..!

దిల్ రాజుతో రామ్ చరణ్.. మెగా ఓటిటి ప్లాన్..!

పోలీస్ ఇంట్లోనే దొంగతనం.. లెటర్ రాసి మరి...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>